ఫ్రాన్స్ లో మరో కొత్త రకం కోవిడ్ వైరస్ ‘IHU’

ఇండియాలో ‘ఒమిక్రాన్’ వేరియంట్ విజృంభణ ఇంకా అందుకోనే లేదు, మరో కొత్త రకం కోవిడ్ వైరస్ ని ఫ్రాన్స్ పరిశోధకులు కనుగొన్నారు. ఆఫ్రికా దేశం కామెరూన్ నుండి తిరిగి వచ్చిన వ్యక్తిలో ఇండెక్స్ కేసు (మొదటి కేసు) కనుగొన్నట్లు ‘ఐ‌హెచ్‌యూ మేడిటెరనీ’ అనే పరిశోధనా సంస్థ ప్రకటించింది. దక్షిణ ఫ్రాన్స్ ఫ్రాన్స్ లో కనుగొన్న కొత్త రకం కోవిడ్ వైరస్ ను ఇప్పటికే 12 మందిలో కనుగొన్నారు. మ్యుటేషన్ పరిభాషలో ఈ రకాన్ని B.1.640.2 వేరియంట్ గా…

హెలికాప్టర్ క్రాష్: సి‌డి‌ఎస్ బిపిన్ రావత్ దుర్మరణం

భారత సాయుధ బలగాల చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సి‌డి‌ఎస్) జనరల్ బిపిన్ రావత్ తమిళనాడు లోని నీలగిరి కొండల్లో ఆయన ప్రయాణిస్తున్న ఎం-17 హెలికాప్టర్ కూలి దుర్మరణ చెందారు. జనరల్ బిపిన్ రావత్ జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీ కి ఛైర్మన్ కూడా. ఈ పదవిలో నియమితులైన మొట్ట మొదటి ఆర్మీ అధికారి ఆయన. జనరల్ బిపిన్ రావత్ డిపార్ట్^మెంట్ ఆఫ్ మిలట్రీ అఫైర్స్ కి కూడా అధిపతిగా వ్యవహరించారు. 1 జనవరి 2020…

ఇండియాలో ఒమిక్రాన్ వేరియంట్ కోవిడ్ వైరస్!

ప్రస్తుతం ప్రపంచ దేశాలను హడలెత్తిస్తున్న కోవిడ్ వైరస్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ భారత దేశంలో కూడా ప్రవేశించిందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.రెండు కేసులూ కర్ణాటక రాష్ట్రంలో కనుగొన్నట్లు ప్రభుత్వం గురువారం తెలిపింది. ఒమిక్రాన్ వేరియంట్ వైరస్ సోకిన ఇద్దరూ పురుషులే. ఒకరి వయసు 66 సం.లు కాగా మరొకరి వయసు 46 సం.లు. ఈ ఇద్దరి జాతీయత ఏమిటో వాళ్ళు ఎక్కడి నుండి వచ్చారో భారత పత్రికలు వెల్లడించడం లేదు. అయితే WION వెబ్ సైట్ అందజేసిన…

స్టేటస్!

గత పది రోజుల నుండి టపాలు లేకపోవడంతో మిత్రులు ఆందోళన తెలియజేస్తున్నారు. రాయడం లేదేమని అడుగుతున్నారు. నేను మళ్ళీ అనారోగ్యం పాలయ్యానేమోనని ఎంక్వైరీ చేస్తున్నారు. చొరవ చేసి అడుగుతున్న వారి వెనుక మరింత మంది పాఠకుల ఆందోళన ఉంటుందని నేను ఊహించగలను. మొదటి విషయం: నేను ఎలాంటి అనారోగ్యానికి గురి కాలేదు. రోజూ ఆఫీస్ కి వెళ్ళి వస్తున్నాను. రెండవది: బ్లాగ్ అప్ డేట్ కాకపోవడానికి కారణం నేను మరొక రాత పనిలో ఉండటమే. ఈ అక్టోబరుతో…

ఎట్టకేలకు చమురు ఉత్పత్తి కోతకు ఒపెక్ నిర్ణయం!

Originally posted on ద్రవ్య రాజకీయాలు:
చమురు ఉత్పత్తిలో కోత పెట్టుకునేందుకు చమురు ఉత్పత్తి – ఎగుమతి దేశాల కూటమి OPEC (ఆర్గనైజేషన్ ఆఫ్ పెట్రోలియం ఎక్స్ పోర్టింగ్ కంట్రీస్)  నిర్ణయించింది. కూటమి నిర్ణయించిన కోత పరిమాణం స్వల్పమే అయినప్పటికీ ఉత్పత్తి తగ్గించేందుకు ఇన్నాళ్లు సౌదీ అరేబియా నిరాకరించిన నేపథ్యంలో ఈ చర్య తదుపరి చర్యలకు ప్రారంభం అవుతుందని మార్కెట్ వర్గాలు ఆశిస్తున్నాయి.  గత నాలుగైదు ఏళ్లుగా చమురు ధరలు అత్యంత అధమ స్ధాయిలో కొనసాగుతున్నాయి. ధరలు ఎంతగా తగ్గినప్పటికీ…

బ్రెక్సిట్ ప్రభావం అంతేమీ లేదు!

బ్రెక్సిట్ కి ఓటు వేస్తె ప్రపంచం తల కిందులు అయిపోతుంది అన్నంతగా పశ్చిమ ప్రభుత్వాలు, కార్పొరేట్ మీడియా ప్రచారం చేసింది. కానీ ఇప్పటి వరకు వచ్చిన ఫలితాలను బట్టి చూస్తే తల కిందులు కావటం అటుంచి ఉన్న వంకర సరి అవుతున్నట్లుగా కనిపిస్తున్నది. పడిపోతుంది అనుకున్న పారిశ్రామిక ఉత్పత్తి ఊహించని విధంగా పెరుగుదల నమోదు చేయగా మొత్తంగా బ్రిటన్ జీడీపీ కూడా కాస్త దారిలో పడినట్లు కనిపిస్తున్నది. జూన్ 23 తేదీన జరిగిన బ్రెక్సిట్ ఓటు వలన…

క్రికెట్ దసరా, ముసలోళ్ళకి లేదిక! -కార్టూన్ 

ఎట్టకేలకు క్రికెట్-రాజకీయ మరియు రాజకీయ-క్రికెట్ పెద్దల నిరసనల మధ్య సుప్రీం కోర్టు, జస్టిస్ లోధా కమిటీ నివేదికను ఆమోదించింది. కమిటీ ప్రతిపాదించిన, తాము ఆమోదించిన సిఫారసులను ఆరు నెలల లోపు బిసిసిఐ అమలు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. కమిటీ సిఫసిఫారసుల మేరకు రాజకీయ పదవులు అనుభవిస్తున్న వారు క్రికెట్ పాలనా పదవులలో ఉండటానికి వీలు లేదు. ఆ లెక్కన ఢిల్లీ క్రికెట్ సంఘం నేతగా కొనసాగుతున్న ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఆ బాధ్యత నుంచి తప్పుకోవాలి.…

సమస్యలకు, చర్చకు సమాధానం ఇవ్వని ప్రధాని!

ప్రతిపక్షాలు ఆత్మ న్యూనత భావం (ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్) తో బాధపడుతున్నాయని ప్రధాన మంత్రి నరేంద్ర మోడి తేల్చేశారు. అందుకే అవి పార్లమెంటులో (ముఖ్యంగా రాజ్య సభలో) చర్చ సజావుగా సాగకుండా అడ్డుకుంటున్నాయని ఆయన నిర్ధారించారు. కానీ చర్చ జరగకుండా నిరోధిస్తున్నది ఒక్క కాంగ్రెస్ తదితర ప్రతిపక్ష పార్టీలేనా? పాలక పక్షం అందునా ప్రధాన మంత్రి గారే చర్చలు ముందుకు సాగనివ్వకుండా అడ్డుకోవడం లేదా? ప్రజా సమస్యలు చర్చలోకి రాకుండా పాలక, ప్రతిపక్షాలు రెండూ ఆటంకాలు కలిగిస్తున్నాయి. కాకపోతే…

చర్చల వైఫల్యానికే పఠాన్ కోట్ దాడి -చైనా

భారత్-పాక్ చర్చలకు అనుకోనివైపు నుండి మద్దతు లభించింది. బ్రిక్స్ కూటమిలో ప్రధాన దేశమైన చైనా పఠాన్ కోట్ దాడిపై స్పందించింది. పఠాన్ కోట్ లోని భారత సైనిక వైమానిక స్ధావరంపై జరిగిన ఉగ్రవాద దాడి పొరుగు దేశాల మధ్య జరగనున్న చర్చలను చెడగొట్టేందుకు ఉద్దేశపూర్వకంగా జరిగిన దాడి అని చైనా వ్యాఖ్యానించింది. పఠాన్ కోట్ పై జరిగిన ఉగ్రవాద దాడిని చైనా ప్రభుత్వ ప్రతినిధి హువా చున్ యింగ్ ఖండించారు. ఇరు దేశాల మధ్య సంబంధాలు మెరుగుపడుతున్న…

‘బ్లాగ్ వేదిక’ ద్వారా ‘తెలుగువార్తలు’కు రండి!

ఎందుకో కారణం చెప్పలేదు గాని కూడలి అగ్రి గేటర్ ను నిర్వాహకులు ఆపేశారు. కినిగె నిర్వాహకులే కూడలిని కూడా నిర్వహిస్తున్నారని ‘బహుశా కినిగె పనిలో మునిగి ఉన్నందున సమయం చాలక పోయి ఉండవచ్చు’ అని కొందరు మిత్రులు చెప్పారు. తెలుగు బ్లాగులకు సేవ చేయడంలో కూడలి ఎంతో పేరు తెచ్చుకుంది. అత్యధిక బ్లాగు పాఠకులు, సందర్శకులు కూడలి ద్వారానే బ్లాగ్ లకు రావడానికి అలవాటు పడిపోయారు. దానితో ‘కూడలి ఇక లేదు’ అన్న ప్రకటన కూడలి వెబ్…

2015లో తెలుగు వార్తలు బ్లాగ్ -సమీక్ష

ఈ సమీక్ష నేను చేసింది కాదు. ఎప్పటిలాగే వర్డ్ ప్రెస్ వాళ్ళు ఈ సమీక్షను ప్రకటిస్తూ దానిని బ్లాగ్ లో ప్రచురించే అవకాశం ఇచ్చారు. సమీక్షలోని ముఖ్య అంశాలు: 2015లో మొత్తం వీక్షణలు 250,000 చిల్లర ఎక్కువ వీక్షణలు పొందిన టపా – చెన్నై జల విలయం -ఫోటోలు ఎక్కువ టపాలు పోస్ట్ చేసిన వారం – గురువారం ఎక్కువ మంది సందర్శకులు కూడలి నుండి రాగా ఆ తర్వాత గూగ్ల్ సర్చ్ ఇంజన్ నుండీ, ఫేస్ బుక్…

కొత్త ధీమ్ సెట్ చేశాను!

‘జాతీయ అంతర్జాతీయ వార్తలు, విశ్లేషణ’ లేదా తెలుగువార్తలు వెబ్ సైట్ కు కొత్త ధీమ్ సెట్ చేశాను. దాని పేరు బ్రాడ్ షీట్. ఇది ప్రీమియం ధీమ్. అంటే వర్డ్ ప్రెస్ వాళ్ళు మంచి డిజైన్ లు తయారు చేసి అమ్మకానికి పెడతారు. వాటిని కొనుక్కోవాల్సి ఉంటుంది. మరి డబ్బు! నేనేమీ డబ్బు త్యాగం చేసేయలేదు. నా వెబ్ సైట్ లో వర్డ్ ప్రెస్ వాళ్ళ యాడ్ లు కనిపిస్తున్నాయి కదా. వాటికి సంబంధించిన ఆదాయంలో కొంత…

ఇజ్రాయెల్ లో యధాతధస్ధితి -ది హిందు ఎడిట్..

[Status quo in Israel శీర్షికన ఈ రోజు -20/03/2015- ప్రచురించబడిన సంపాదకీయానికి ఇది యధాతధ అనువాదం. -విశేఖర్] 2015 ఇజ్రాయెలీ చట్టసభ ఎన్నికల్లో మొత్తం 120 సీట్లకు గాను 30 సీట్లు గెలుచుకున్న లికుడ్ పార్టీ ప్రధమ స్ధానంలో నిలవడం, దరిమిలా బెంజమిన్ “బీబీ” నెతన్యాహు ప్రధాన మంత్రిగా తిరిగి ఎన్నిక కావడం ఒకింత ఆశ్చర్యకరం. లేబర్ పార్టీతో సహా వివిధ సెంట్రిస్టు-మోడరేట్ పార్టీల కూటమి జియోనిస్టు యూనియన్ కు మెరుగైన ఫలితాలు లభిస్తాయని ఎగ్జిట్…

అన్యాక్రాంతం, అభివృద్ధి మరియు ప్రజాస్వామ్యం -ది హిందు ఆర్టికల్

(ఫిబ్రవరి 4వ తేదీన ది హిందు పత్రికలో ప్రచురించబడిన ఆర్టికల్ “Dispossession, development and democracy” కు ఇది యధాతధ అనువాదం. -విశేఖర్) “న్యాయమైన పరిహారం పొందే హక్కు, భూ స్వాధీనం, పునరావాసం మరియు పునఃస్ధిరనివాస చట్టం” (Right to Fair Compensation and Transparency in Land Acquisition, Rehabilitation and Resettlement Act –LARR) ను సెప్టెంబర్ 2013లో ఆమోదించినప్పటి నుండి అది అన్ని వైపుల నుండి విమర్శలు ఎదుర్కొంది. భూములు కోల్పోయినవారికి సరిపోయినంత…