చైనా ఇప్పుడు మనకు ఆత్మ బంధువా?
నిన్న మొన్నటి వరకు చైనా, ఇండియా సంబంధాలు ఎలా ఉండేవి? ప్రధాన మంత్రి నరేంద్ర మోడి నుండి భజరంగ్ దళ్ చివరాఖరి కార్యకర్త వరకు చైనా అంటే మండి పడేవాళ్లు. చైనా మనకు ఆజన్మ శత్రువు అని ఒకటే ఊదర గొట్టేవాళ్లు. కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలని చైనా దేశ భక్తులు అని పడ దిట్టేవాళ్లు. మరి ఇప్పుడో! అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పుణ్యమాని చైనా మన శతృదేశం అన్న సంగతి మర్చిపోయాం. చైనా మనకిప్పుడు ఆపన్న…














