రాహుల్ పట్టాభిషేకం సమస్య ఎవరిది? -కార్టూన్

భారత దేశంలో రాజకీయ పార్టీలు తమ సమస్యలను ప్రజల సమస్యలుగా చేయడం పరిపాటి. సోనియా గాంధీ చరిష్మా కాంగ్రెస్ పార్టీకి చేరకుండా ఉండడానికి ఆమె ఇటలీ పౌరసత్వం ఒక సమస్యగా ప్రజలపై రుద్దడానికి ప్రయత్నం జరిగింది. సోనియా పౌరసత్వాన్ని మించిన సమస్యలు చాలానే ఉండడంతో ప్రజలు ఆ సంగతే పట్టించుకోలేదు. ‘హిందూ మత పరిరక్షణ’ అనే సమస్య కూడా కాంగ్రెస్ నుండి అధికారం లాక్కోవడానికి కృత్రిమంగా ప్రజలపై రుద్దబడినదే. సోనియా చరిష్మా ఇక ముంగింపుకు వచ్చిందని భావిస్తున్నారేమో,…

ప్రజల సొమ్ము దోచుకోండి, కానీ బందిపోట్లలా కాదు -యు.పి మంత్రి

మాయావతి అవినీతి పై ప్రచారం చేసి అధికారంలోకి వచ్చిన అఖిలేష్ యాదవ్ ప్రభుత్వం ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర అధికారులకు ప్రజల సొమ్ము దొంగిలించడానికి అనుమతి ఇచ్చేసింది. కాకపోతే మరీ బందిపోటు దొంగల్లా దోచుకోకుండా, దొంగిలించవచ్చని సున్నితంగా బోధించింది. ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ కి బాబాయి అయిన శివ్ పాల్ సింగ్ యాదవ్ ఈ ఆణి ముత్యాలను తన శాఖ అధికారులకు బోధించాడు. తద్వారా సర్వ వ్యాపితం అయిన అవినీతి ని నాలుగు గోడల మధ్య చట్టబద్ధం చేశాడు.…

2జి కుంభకోణం: లక్ష 76 వేల కోట్ల కాగ్ అంచనా కూడా తక్కువేనా?

సహజ వనరు అయిన 2జి స్పెక్ట్రమ్ ను వేలం వేయకుండా స్వదేశీ, విదేశీ ప్రవేటు కంపెనీలకు ఇష్టారీతిన పంచి పెట్టడం వలన భారత ప్రభుత్వ ఖజానాకు గరిష్టంగా 1,76,645 కోట్ల నష్టం వచ్చిందని ‘కంప్ట్రోలర్ ఆడిటర్ జనరల్’ (సి.ఎ.జి) 10 నవంబర్, 2010 తేదీన నివేదిక వెలువరించింది. కాగ్ నివేదిక అంచనా వేసిన మొత్తం భారీగా ఉండడంతో పత్రికలు దానిని సంచలనం చేశాయి. అప్పటి నుండీ ఏదో ఒక రూపంలో (కేసులు, ఖండన మండన ప్రకటనలు, నీరా…

రాజకీయం దృష్టిలో ‘అవినీతి వ్యతిరేక ఉద్యమం’ -కార్టూన్

సంవత్సరం క్రితం అన్నా హజారే అవినీతి వ్యతిరేక ఉద్యమం  దేశ వ్యాపితంగా ప్రకంపనలు సృష్టించింది. ఆయనకి మద్దతు ఇవ్వడానికి రాజకీయ నాయకులు పోటీలు పడ్డారు. ప్రతి రాష్ట్రంలోనూ పార్టీలకు అతీతంగా సీనియర్ల నుండి ఛోటా మోటా నాయకుల వరకూ అవినీతిపై ఆగ్రహావేశాలు ప్రదర్శిస్తూ అన్నా ఉద్యమానికి మద్దతు ప్రకటించారు. అవినీతి కేసులు ఎదుర్కొంటున్న యెడ్యూరప్ప లాంటి వారు సైతం అప్పట్లో ఉద్యమానికి మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. ఇక మిగిలింది గాలి జనార్ధన రెడ్డి, వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి లాంటివారేనని…

కోర్టు ధిక్కారం: కొత్త ప్రధానినీ వదలని పాక్ సుప్రీం కోర్టు

పాకిస్ధాన్ దేశ అత్యున్నత రాజ్యాంగ నాయకుడిపై అక్కడి సుప్రీం కోర్టు రెండో సారి ‘కోర్టు ధిక్కారం’ కేసు కింద విచారణ జరపడానికి ఉద్యుక్తం అవుతోంది. కోర్టు ధిక్కారానికి పాల్పడ్డాడన్న నేర నిర్ధారణ చేసి మాజీ ప్రధాని యూసఫ్ రజా గిలానీ ని పదవీ భ్రష్టుడిని చేసిన పాక్ సుప్రీం కోర్టు, సరిగ్గా అవే కారణాలతో ఆ తర్వాతి ప్రధాని రాజా పర్వేజ్ అష్రాఫ్ పై కూడా చర్యలు మొదలు పెట్టింది. పాకిస్ధాన్ అధ్యక్షుడు ఆసిఫ్ ఆలీ జర్దారీ…

‘టీం అన్నా’ ఇక లేదు -కార్టూన్

ప్రభుత్వం నుండి ఎటువంటి హామీ లేకుండానే నిరాహార దీక్ష ముగించిన అన్నా హజారే, తర్వాత మూడు రోజులకే ‘అన్నా బృందం’ రద్దు అయినట్లు ప్రకటించి ఒకింత సంచలనం సృష్టించాడు. రాజకీయ పార్టీ ఏర్పాటుని సుగమం చేయడానికే అన్నా హాజరే తన బృందాన్ని రద్దు చేసినట్లు ‘ది హిందూ’ వార్త రాసింది. అంటే ఆ వార్తలో సానుకూలత ఉందే తప్ప సంచలన కారకం ఏమీ లేదు. ఒకటో రెండో ఇతర పత్రికలు కూడా అన్నా అభిప్రాయాన్ని ఇదే విధంగా…

టార్చర్ ఛాంబర్ల నుండి దేశాధ్యక్ష పదవి వరకూ…

కాళ్ళకూ, చెవులకూ ఎలక్ట్రిక్ షాక్ లు, బట్టలు ఊడడదీసి చేతులూ కాళ్ళూ కట్టేసి తలకిందులుగా వేలాడదీసి లాఠీలతో కుళ్లబోడవడం ఇవీ బ్రెజిల్ అధ్యక్షురాలు దిల్మా రౌసెఫ్ నలభైయేళ్ల క్రితం ఎదుర్కొన్న చిత్రహింసలు. యుక్త వయస్సులో లెఫ్టిస్టు గెరిల్లా పోరాటంలో ఉండగా నియంతృత్వ ప్రభుత్వ పోలీసులకు పట్టుబడి మూడేళ్ళ చీకటి కారాగారవాసం అనుభవించిన దిల్మా రౌసెఫ్ తన గత జీవితాన్ని బహిరంగంగ ఇంతవరకూ ఏ పత్రికకూ, వ్యక్తులకూ చెప్పలేదు. ఎస్టెల్లా అనే యుద్ధ నామం (nom de guerre)…

నోరు మూసుకో! -అమెరికాతో చైనా ‘పీపుల్స్ డెయిలీ’

నోరు మూసుకొమ్మని చైనా ప్రభుత్వ పత్రిక ‘పీపుల్స్ డెయిలీ’ అమెరికాను హెచ్చరించింది. చైనా సార్వభౌమ వ్యవహారాల్లో జోక్యం వద్దని పత్రిక విదేశీ విభాగం గట్టిగా చెప్పింది. చైనా, దాని పొరుగు దేశాల మధ్య తగాదాలు పెట్టడానికి అమెరికా ప్రయత్నిస్తోందని పీపుల్స్ డెయిలీ ప్రధాన పత్రిక కూడా తీవ్రంగా వ్యాఖ్యానించిందని ఎన్.డి.టి.వి తెలిపింది. ఉద్దేశ్యపూర్వకంగా విరోధాలు రెచ్చగొట్టి లబ్ది పొందాలని చూడడం అమెరికాకి కొత్త కాదనీ ఇటీవలీ కాలంలో చైనా విషయంలో కూడా ఈ ట్రిక్కు వినియోగిస్తున్నదని నిందించింది.…

టీం అన్నా రాజకీయ రంగ ప్రవేశం -కార్టూన్

అన్నా బృందం రెండో నిరాహార దీక్ష ఎంత చప్పగా ప్రారంభం అయిందో అంతే చప్పగా ముగిసిపోయింది. అరవింద్ కేజ్రీవాల్ పది రోజుల పాటు నిరాహార దీక్ష చేసినా, జనం కోసం అన్నా కూడా ఆయనతో జత కలిసినా పట్టించుకున్నవారు లేరు. అన్నా హజారే గత సంవత్సరం చేసిన నిరాహార దీక్షకి పెద్ద ఎత్తున మద్దతు తెలిపిన పత్రికలు, ఛానెళ్ళు ఈసారి అంతగా పట్టించుకోలేదు. అన్నా దీక్ష విరమణ కోసం పార్లమెంటులో ప్రత్యేక చర్చ జరిపిన కాంగ్రెస్ ప్రభుత్వం,…

పూనే పేలుళ్లు పధకం ప్రకారం జరిగినవే -కేంద్రం

బుధవారం పూనేలో జరిగిన పేలుళ్లు పధకం ప్రకారం జరిగినవేనని కేంద్ర ప్రభుత్వం అభిప్రాయపడుతోంది. 500 మీటర్ల పరిధిలో, 45 నిమిషాల సమయంలో జరిగిన ఈ పేలుళ్లు ఒక పధకం ప్రకారం సమన్వయంతో జరిగాయని హోమ్ సెక్రటరీ ఆర్.కె.సింగ్ విలేఖరులకు చెప్పాడు. కేంద్ర దర్యాప్తు సంస్ధలు ఎన్.ఐ.ఏ (నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజన్సీ), ఎన్.ఎస్.జి (నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్), సి.ఎఫ్.ఎస్.ఎల్ (సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ) ల బృందాలు పూణే చేరుకుని పేలుడు పేలుడు జరిగిన ప్రాంతాలను పరిశీలిస్తున్నాయని ఆయన…

నెం.1 స్ధానంలో రాహుల్ గాంధీ ఖర్చీఫ్

వారసత్వ రాజకీయాలకు భారత దేశం పెట్టింది పేరు. సొంత ప్రయోజనాల కన్నా నాయకుల పట్ల సానుభూతికి భారతీయులు ఎక్కువ విలువ కట్టబెట్టడం ఇక్కడ రివాజు. భర్త చనిపోతే భార్యకు, తండ్రి చనిపోతే కొడుకుకి సానుభూతి ఓట్లు కురిపించి పీకలమీదికి తెచ్చుకోవడానికి శ్రామిక జనం పెద్దగా ఫీలవరు. ఇక సానుభూతి రాజకీయాలను వ్యవస్ధాగతం చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. నెహ్రూ, ఇందిర, సంజయ్ రాజీవ్ లు, సోనియా… ఇప్పుడు రాహుల్. తెలివిగా రాజకీయ వయసుకు ఎంతో ముందుగానే రంగం…

పాక్ సాయంలో భారీ కోతకు ఆమోదించిన అమెరికా కాంగ్రెస్

పాకిస్ధాన్ కి ఇస్తున్న సాయంలో భారీ కోత విధించడానికి అమెరికా సిద్ధపడుతునంట్లు కనిపిస్తోంది. 650 మిలియన్ డాలర్ల కోత విధించే బిల్లును అమెరికా కాంగ్రెస్ శుక్రవారం ఆమోదించింది. రిపబ్లికన్ పార్టీ కి మెజారిటీ సభ్యులున్న అమెరికా ప్రతినిధుల సభలో సీనియర్ రిపబ్లికన్ కాంగ్రెస్ సభ్యుడు ‘టెడ్ పో’ ప్రవేశ పెట్టిన బిల్లు మూజువాణి ఓటుతో ఆమోదం పొందింది. పాకిస్ధాన్ ను అమెరికా విప్లవంలో విద్రోహిగా ముద్ర పడిన “బెనెడిక్ట్ ఆర్నాల్డ్” గా ఈ సందర్భంగా కాంగ్రెస్ సభ్యుడొకరు…

ఉత్తర కొరియా ఆర్మీ చీఫ్ తొలగింపు, రాజకీయ విశ్లేషకులు అప్రమత్తం

ఉత్తర కొరియా నుండి ఊహించని వార్త వెలువడింది. మిలటరీ చీఫ్ ‘రి యాంగ్-హో’ ను అనారోగ్య కారణాల రీత్యా పదవి నుండీ, ఇతర అన్ని అధికార పదవులనుండీ తొలగించినట్లు ప్రభుత్వ వార్తా సంస్ధ కె.సి.ఎన్.ఎ ప్రకటించింది. సెంట్రల్ మిలటరీ కమిషన్ కు వైస్ ఛైర్మన్ గా కూడా వ్యవహరిస్తున్న రీ, అధికార పార్టీ వర్కర్స్ పార్టీలోనూ అనేక పదవులు నిర్వహించిన సీనియర్ నాయకుడు. రీ తొలగింపు ‘అసాధారణం’ గా దక్షిణ కొరియా కొరియాల ‘ఏకీకరణ మంత్రిత్వ శాఖ’…

జనం అంటే చిదంబరం కి ఎంత చిరాకో!

జనం అంటే తనకు చిరాకని కేంద్ర హోమ్ మంత్రి చిదంబరం తన నోటితోనే చాటుకున్నాడు. ప్రజల ఈతి బాధలని గ్రహించి దూరం చేయవలసిన బాధ్యతాయుత పదవిలో ఉన్న మంత్రి వర్యులు ఐస్ క్రీమ్ పై మక్కువనీ, బియ్యం ధరల పెరుగుదలపై వ్యతిరేకతనూ పోల్చి తన ‘వర్గ బుద్ధి’ ప్రదర్శించుకున్నాడు. మీడియా సాక్షిగా తన బుద్ధి సక్రమం కాదనీ, గిరిజనుల సంపద దోచే కంపెనీలకు వత్తాసు పలకడమే కాక సాధారణ మధ్యతరగతి ప్రజల కష్టాలపై కూడా సరైన అవగాహన,…

ఈజిప్టులో అధికార కుమ్ములాటలు తీవ్రం, అధ్యక్షుడి డిక్రీ రద్దు చేసిన కోర్టు

ఈజిప్టులో పాత, కొత్త అధికార వర్గాల మధ్య ఘర్షణలు మరో అంకానికి చేరాయి. కోర్టు రద్దు చేసిన పార్లమెంటును పునరుద్ధరిస్తూ అధ్యక్షుడు ముర్సి జారీ చేసిన డిక్రీ ని కోర్టు కొట్టివేసిందని బి.బి.సి తెలిపింది. ముప్ఫై యేళ్ళుగా ఈజిప్టును తన కబంధ హస్తాల్లో బంధించిన మిలట్రీ నియంతృత్వ పాలకుల ప్రయోజనాలకు ప్రతినిధిగా భావిస్తున్న ‘సుప్రీం కాన్సిటిట్యూషనల్ కోర్టు’ పార్లమెంటును రద్దు చేసిన విషయం తెలిసిందే. ప్రజా తిరుగుబాటు ఫలితంగా జరిగిన ఎన్నికల్లో నెగ్గిన పార్లమెంటుకు మిలట్రీ పాలకుల…