మైనస్ జె.డి(యు), మోడి ఇమేజ్ భారం బి.జె.పి ఆపగలదా? -కార్టూన్

బి.జె.పి లో నరేంద్ర మోడి అనుకూల ప్రచారం ఇతర నాయకులకు అలవి కానంతగా పెరిగింది. మోడి తప్ప దేశానికి దిక్కు లేదని దేశ ప్రజలకు నచ్చజెప్పడానికి ఆయన పార్టీ మద్దతుదారులు, అభిమానులు చెవినిల్లు కట్టి పోరుతున్నారు. మోడీకి ముందే జరిగిన గుజరాత్ అభివృద్ధిని కూడా మోడి చలవే అని తాము నమ్మి ఇతరులను కూడా నమ్మమంటున్నారు. మోడి ప్రధాని అయితే మంత్రి పదవులు దక్కుతాయన్న అసవల్లనే యేమో గాని బి.జె.పిలో ఆరెస్సెస్సేతర నాయకులైన యశ్వంత్ సిన్హా లాంటివారు…

బోస్టన్ బాంబు పేలుళ్లు -ఫోటోలు

అమెరికాలోని బోస్టన్ నగరంలో బాంబు పేలుళ్లు జరిగాయి. సెకన్ల వ్యవధిలో జరిగిన రెండు బాంబు పేలుళ్లలో ముగ్గురు చనిపోగా 130 మందికి పైగా గాయపడ్డారు. గాయపడినవారిలో ఆరుగురి పరిస్ధితి విషమంగా ఉంది. 40 కి.మీ బోస్టన్ మారధాన్ పరుగు పందెం చివరి అంచెలో ఈ పేలుడు సంభవించింది. ప్రేక్షకులు నిలుచున్న చోట పేలుడు జరిగినట్లు కనిపిస్తోంది. పేలుడు అనంతరం ఏరియల్ వ్యూ నుండి తీసిన వీడియోను కింద చూడవచ్చు.   ఈ కింది ఫోటోలను ఆర్.టి (రష్యా…

అమెరికాలో బాంబు పేలుడు, ముగ్గురి మరణం

అమెరికాలోని బోస్టన్ నగరంలో బాంబు పేలుళ్లు సంభవించాయి. సెకన్ల వ్యవధిలో రెండు బాంబులు పేలగా మరో 5 పేలని బాంబులు దొరికాయని పోలీసులు తెలిపారు. 40 కి.మీ దూరం సాగే ‘బోస్టన్ మారధాన్’ పోటీ ముగింపు స్ధలంలో జరిగిన ఈ పేలుళ్లలో ముగ్గురు మరణించారు. 130 మందికి పైగా గాయపడ్డారు. పదుల సంఖ్యలో అవయవాలు తీసివేయాల్సి వచ్చిందని ఆసుపత్రుల అధికారుల సమాచారాన్ని ఉటంకిస్తూ పత్రికలు తెలిపాయి. బాల్ బేరింగ్ లాంటి ఇనప వస్తువులు కూరి బాంబులు తయారు…

మోడిని ఎంత విమర్శిస్తే అంత బలం -కార్టూన్

గుజరాత్ లోపల మోడి వాలి టైపు. వాలికి ఎదురు నిలబడి పోరాడినవాడి నుండి సగం బలం వాలికి వచ్చి చేరుతుందట! దానితో శ్రీరాముల వారు సైతం చెట్టు చాటున నిలబడి దొంగ దెబ్బ తీయక తప్పలేదు. మోడి విషయం కూడా అంతే. ఆయనను ఎంత విమర్శిస్తే మోడీకి అంత బలం. మోడిని వ్యక్తిగతంగా విమర్శిస్తే మోడీకి ఇంకా బలం. గత మూడు ఎన్నికల్లో అదే జరిగింది. తనపైన ప్రత్యర్ధులు విరుచుకుపడినప్పుడల్లా దానిని ‘గుజరాత్ ఆత్మాభిమానం’ కింద మలుచుకుని…

శ్రీలంక: సాయంలో కోత పెట్టిన అమెరికా

శ్రీలంకకు ఇస్తున్న సహాయంలో అమెరికా కోత విధించింది. మానవ హక్కుల హరణ, మిలట్రీ జోక్యం వల్ల కోత విధిస్తున్నట్లు అమెరికా విదేశాంగ ప్రతినిధి చెప్పినట్లు పి.టి.ఐ తెలిపింది. ఎల్.టి.టి.ఇ యుద్ధం ముగిసిన తర్వాత ఉత్తరాన నివశిస్తున్న తమిళులకు పౌరహక్కులు కల్పించడంలోనూ, నాశనం అయిన నిర్మాణాలను పునర్నిర్మించడంలోను, రాజకీయంగా తమిళులను దేశంలో కలుపుకోవడంలోనూ శ్రీలంక ప్రగతి సాధించలేదని తాము ఇస్తున్న సాయం బాధితులకు అందకుండా మిలట్రీ జోక్యం చేసుకుంటోందని అమెరికా ప్రతినిధి తమ చర్యకు కారణంగా చెప్పాడు. ది…

భిన్నత్వంలోనూ ప్రత్యేకం దక్షిణ భారత దేశం -ఈనాడు ఆర్టికల్ 9వ భాగం

“జాతీయ అంతర్జాతీయ పరిస్ధితులపై అవగాహన సాధించడమెలా” వ్యాస పరంపర లోని తొమ్మిదో భాగం ఈరోజు ఈనాడు చదువు పేజిలో ప్రచురితం అయింది. నేరుగా ఈనాడు వెబ్ పేజీలో చూడదలిస్తే ఇక్కడ క్లిక్ చేయగలరు. పి.డి.ఎఫ్ డాక్యుమెంట్ రూపంలో చదవాలనుకుంటే కింద బొమ్మ పైన క్లిక్ చేయండి.

బ్రిటిష్ మాజీ ప్రధాని ధాచర్ మరణం వారికి పండగ -ఫోటోలు

బ్రిటన్ మాజీ ప్రధాని మార్గరెట్ ధాచర్ ఏప్రిల్ 8 తేదీన మరణించింది. ఆమె మరణం పట్ల ధనికులు ఖేదం ప్రకటిస్తే కార్మికులు, అల్పాదాయ, మధ్యతరగతి వర్గాలు అనేకులు మోదం ప్రకటించారు. దేశవ్యాపిత సంబరాలకు సైతం ‘క్లాస్ వార్’ లాంటి సంస్ధలు, మైనింగ్ వర్కర్స్ యూనియన్ లాంటి కార్మిక సంఘాలు పిలుపునిచ్చి అమలు చేసాయి కూడా. ధాచర్ మరణం పట్ల సంబరాలు జరుపుకున్న ఫోటోలను కింద చూడవచ్చు. ఈ సంబరాలకు కారణం ఏమిటో అర్ధం చేసుకోవాలంటే చరిత్రలోకి కొద్దిగా…

మోడి గాలి జనం ఒప్పుకోరు -నితీష్ కుమార్

ఎన్.డి.ఎ కూటమి ఏర్పడినప్పుడు విధించిన షరతులు ఇప్పటికీ వర్తిస్తాయని, అలా అయితేనే కూటమి కొనసాగుతుందని జనతా దళ్ (యునైటెడ్) పార్టీ నాయకుడు, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ స్పష్టం చేశాడు. ‘తాము ఒక తుఫాను సృష్టిస్తామని, ప్రజలు దానిని అంగీకరిస్తారని’ కొంత మంది భావిస్తున్నారని, కానీ ప్రజలు చదువు లేకపోయినా చాలా తెలివైనవారని మోడిని పరోక్షంగా ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించాడు. తెలివైన ప్రజలు ఎలాంటి గాలిని ఒప్పుకోరని రాజకీయ నాయకులు చెప్పే మాటల్లో విషయం ఉన్నదీ లేనిదీ వారు…

అమెరికా ‘మేగ్నిట్ స్కీ జాబితా’కు యాకోవ్లెవ్ జాబితా’తో బదులిచ్చిన రష్యా

నాలుగు దశాబ్దాల పాటు సాగిన ‘ప్రచ్ఛన్న యుద్ధం’ (కోల్డ్ వార్) లో రెండు అంతర్జాతీయ వైరి శిబిరాలకు నాయకత్వం వహించిన అమెరికా, రష్యాలు మళ్ళీ ఒక్కసారి ఆ రోజులను గుర్తుకు తెచ్చాయి. ‘మేగ్నిట్ స్కీ చట్టం’ కింద అనేకమంది రష్యా ప్రముఖుల పైన ఆంక్షలు విధిస్తూ అమెరికా ప్రకటించిన ‘మేగ్నిట్ స్కీ జాబితా’ కు ప్రతీకారంగా పలువురు అమెరికన్ ప్రముఖులపై ఆంక్షలు ప్రకటిస్తూ రష్యా మరొక జాబితా విడుదల చేసింది. ఇరు దేశాలు తమ చర్యలకు మానవ…

ఏ రాయయితేనేం… పళ్లూడగొట్టుకోడానికి? -కార్టూన్

రానున్న ఎన్నికల్లో ఎవరికి ఓటేయ్యాలి? ప్రజలను ఎటువంటి వివక్ష లేకుండా పాలన చేయడం అటుంచి వారి మానాన వారిని బతకనిచ్చే పార్టీలు ఇండియాలో ఏమున్నాయని? వనరులన్నీ విదేశీ కంపెనీలు తరలించుకుపోతున్నా నోరు మూసుకున్నందుకు కాళ్ళ కింద భూమిని కూడా ఇప్పుడు లాక్కుపోతున్నారు. ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వకపోయినా చిల్లర కొట్టు పెట్టుకుని స్వయం ఉపాధి కల్పించుకుంటే దాన్ని తీసుకుపోయి వాల్ మార్ట్ కి అప్పజెపుతున్నారు. ఇన్ని చేసినా సహించి ఊరుకుంటే నువ్వు ముస్లింవి కనుక చంపుతాను అని ఒకరోస్తే,…

మమత ఒంటరితనం స్వయంకృతం! -కార్టూన్

ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ప్రజలకు వ్యతిరేకంగా ఉపయోగించడం భారత పాలకుల నైజం. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి ఇందులో నాలుగాకులు ఎక్కువే చదివింది. ఎన్నికల నాటి ప్రమాణాలను సంవత్సరం లోపే పూర్తి చేసేశానని ప్రకటించిన మమత ‘వాగ్దానాలను అమలు  చేయండి’ అని అడిగిన ఒక సాధారణ రైతు పైన మావోయిస్టు అని ముద్ర వేసి అరెస్టు చేయించింది. తద్వారా మావోయిస్టులు రైతుల కోసం పని చేస్తున్నారని చెప్పకనే చెప్పింది. మహిళల హక్కులు, ప్రజల ప్రజాస్వామిక హక్కులు హరించబడుతున్నాయని ఒక…

మమత చిక్కరు, దొరకరు -కార్టూన్

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీని తమ కూటమిలో చేర్చుకోడానికి యు.పి.ఎ, ఎన్.డి.ఎ శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నాయి. కానీ యు.పి.ఎ నుండి బైటికి దూకిన తర్వాత త్రిణమూల్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ఎవరికీ ‘చిక్కరు, దొరకరు’ అన్నట్లుగా పరిస్ధితి ఉంటోంది. ఆమెకు  అనుకూలంగా వ్యవహరించడానికి రెండు కూటముల నాయకులు ప్రయత్నిస్తున్నా, ఆమె ఎవరివైపు మొగ్గు చూపుతారో ఎవరి అంచనాలకు అందడం లేదు. ఒక రోజు యు.పి.ఎ పైన యుద్ధం ప్రకటించినట్లు మాట్లాడి ఒక సంకేతం ఇచ్చినట్లు…

తమిళనాడు వేర్పాటుకు అమెరికా సాయం కోరిన డి.ఎం.కె నాయకన్? -వికీలీక్స్

తమిళనాడు రాష్ట్రం భారత దేశం నుండి విడిపోయి ప్రత్యేక దేశంగా ఏర్పడడానికి అప్పటి డి.ఎం.కె రాష్ట్ర మంత్రి ఒకరు అమెరికా సాయం కోరినట్లు అమెరికా రాయబార పత్రాల ద్వారా తెలుస్తోంది. మాజీ ప్రధాని ఇందిరాగాంధి ఎమెర్జెన్సీ పాలన విధించిన వారం రోజులకు తమిళనాడులో రాష్ట్ర ప్రభుత్వానికి నాయకత్వం వహించిన ద్రవిడ మున్నేట్ర కజగం పార్టీ నేత, రాష్ట్ర కార్మిక మరియు గృహ శాఖ మంత్రి కె.రాజారాం అమెరికా రాయబారిని కలిసి తమిళనాడు ప్రత్యేక దేశంగా విడిపోదలుచుకుంటే అమెరికా…

ఈ హిందు కార్టూన్ కి అర్ధం? -కార్టూన్

ఈ కార్టూన్ కి అర్ధం ఏమై ఉండొచ్చు? ‘ది హిందు’ పత్రికలో ప్రచురించబడిన కార్టూన్ లను వివరించడం ద్వారా వివిధ రాజకీయ, ఆర్ధిక పరిస్ధితులను పాఠకుల దృష్టికి తీసుకురావడానికి నేను ప్రయత్నిస్తున్నాను. చాలాసార్లు ఒక వ్యాసం చెప్పలేని విషయం నాలుగైదు అర్ధవంతమైన గీతలతో కూడిన కార్టూన్ శక్తివంతంగా చెబుతుంది. అందువలన ఒక పాఠకుడి సలహా మేరకు ‘కార్టూన్లు’ అని ఒక ప్రత్యేక కేటగిరి మొదలు పెట్టి వివిధ కార్టూన్లు ప్రచురిస్తున్నాను. అయితే ఈ రోజు ది హిందు…

పోలీసు పరిణామ క్రమం -కార్టూన్

పోలీసు సంస్కరణల గురించి దశాబ్దాల తరబడి పాలకులు చెబుతూనే ఉన్నారు. పోలీసు వ్యవస్ధలో సమూల మార్పులు తీసుకురావాలని సుప్రీం కోర్టు కూడా అనేకసార్లు చెప్పింది. బ్రిటిష్ వలస పాలన అవసరాలకు అనుగుణంగా ఏర్పాటు చేసిన పోలీసు హైరార్కీ వ్యవస్ధ ప్రజలకు సేవ చేయడం మాని రాజకీయ బాసుల సేవలో తరిస్తూ ప్రజావ్యతిరేక స్వభావాన్ని సంతరించుకుందని ఈ పరిస్ధితిని మార్చాలని కొన్నిసార్లు పోలీసు సంఘాలు కూడా డిమాండ్ చేశాయి. సంస్కరణలలో భాగంగా ఏ చర్యలు తీసుకోవాలో, రాజకీయ నాయకులకు…