ఉత్తర ఖండ్ కాదిది, మీ రాష్ట్రమే! -కార్టూన్

– నాయకుడు: దారుణం! నా హృదయం ఈ అభాగ్యుల కోసం విలపిస్తోంది… పైలట్: ఇది మీ సొంత రాష్ట్రమే సార్, వాతావరణం అనుకూలంగా లేకపోవడం వల్ల మనం వెనక్కి వచ్చేశాం! ———000——— ఉత్తర ఖండ్ రాష్ట్రంలో కనీ వినీ ఎరుగని రీతిలో సంభవించిన మేఘ ప్రళయం (cloud bursts), హఠాత్ వరదల (flash floods) ను సృష్టించింది. ఈ వరదల్లో అనేకమంది తప్పించుకోవడానికి కూడా తగిన వీలు, సమయం లేక అసువులు బాసారు. ఇప్పటివరకు 800 చిల్లర…

రుద్ర భూమిపై రాజకీయ హెలికాప్టర్లు -కార్టూన్

శైవ క్షేత్రాలకు కేంద్రమైన ఉత్తర ఖండ్ ను రుద్ర భూమిగా చెప్పవచ్చు. ఆ రుద్ర భూమి రౌద్ర రూపం దాల్చిన క్షణాలు భక్తజన సమూహానికి శాపంగా మారగా, రాజకీయ నాయకులకు మాత్రం ఓట్ల గాలం కావడం అత్యంత శోచనీయం. ముఖ్యమంత్రులు ఏరియల్ సర్వేలలో నిమగ్నమై తమ తమ రాష్ట్ర వాసుల మెప్పు పొందేందుకు ప్రయత్నిస్తూ బాధిత ప్రజలకు సాయం చేస్తున్న సైనికుల పనిని కష్టతరం చేస్తున్నారు. హోమ్ మంత్రి సుశీల్ కుమార్ షిండే వారిస్తున్నా వినకుండా ఉత్తర…

2 కోట్లు విదిల్చి రాంబో గొప్పలేల మోడి సారు?

134 మంది పట్టే విమానంలో రెండు రోజుల్లో 15,000 మంది గుజరాతీ యాత్రీకులను నరేంద్ర మోడి రక్షించారట! గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడి గారు స్వయంగా ఈ విషయం చెప్పుకుంటూ అప్పుడే ఎన్నికల ప్రచారం ప్రారంభించేశారు. ఎన్నికల ప్రచారానికి 5,000 మందికి పైగా హిందూ భక్తులు దుర్మరణం చెందినట్లు భయపడుతున్న కేదార్ నాధ్ వరద భీభత్సం కంటే మించిన సదవకాశం నరేంద్ర మోడి గారికి దొరక్కపోవడం అత్యంత అమానుషం కాగా, సాధ్యా సాధ్యాలు పరిశీలించకుండానే మోడీ భక్తాగ్రేసరులు…

చైనా ఫోన్ కంపెనీ, యూనివర్శిటీలను హ్యాక్ చేసిన అమెరికా

“నిజాలు బైటికి రావడం మొదలైంది. మరిన్ని నిజాలు  వెలువడకుండా ఎవరూ అడ్డుకోలేరు” అని ప్రకటించిన సి.ఐ.ఏ మాజీ టెక్నీషియన్, ఎన్.ఎస్.ఏ మాజీ కాంట్రాక్టర్ ఎడ్వర్డ్ స్నోడెన్ చెప్పినట్లుగానే మరొక నిజం వెల్లడి చేశాడు. హాంగ్ కాంగ్ లోని ‘సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్’ (లేదా ది పోస్ట్) పత్రికకు ఇంటర్వ్యూ ఇస్తూ చైనా లోని మొబైల్ ఫోన్ కంపెనీలను, సాంకేతిక పరిశోధనలకు ప్రసిద్ధి చెందిన ఒక యూనివర్సిటీని అమెరికా హ్యాకింగ్ చేసి సమాచారం దొంగిలించిందని స్నోడెన్ వెల్లడి…

నితీష్ కుమార్ ‘మోడీ’కరణ! -కార్టూన్

కేశవ్ నుండి మరో అద్భుతమైన, నిశితమైన, శక్తివంతమైన కార్టూన్! మోడి నియంతృత్వ పోకడలు ఇతర పార్టీలే కాకుండా బి.జె.పి నాయకులు కూడా అనేకమంది విమర్శిస్తారు. తన ప్రధాని కలకు అడ్డువచ్చిందుకు ఎల్.కె.అద్వానీ మోడి సహిత బి.జె.పి పైన చేసిన విషయం ఇంకా పత్రికల్లో నానుతోంది. గోధ్రా అనంతర అల్లర్లను ఆపకుండా రాజధర్మ నిర్వహణలో విఫలమైనందుకు అప్పటి ప్రధాని వాజ్ పేయి సైతం మోడీని విమర్శించారు. పరమత విద్వేష పూరిత ప్రసంగాలకు పెట్టింది పేరైన ప్రవీణ్ తొగాడియా (విశ్వ…

మోడి వేవ్? అది కార్పొరేట్ సృష్టి! -నితీష్ కుమార్

దేశంలో మోడి వేవ్ అనేదేమీ లేదని అది కార్పొరేట్ కంపెనీలు సృష్టించింది మాత్రమేనని బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తేల్చేశారు. అనేకమంది బి.జె.పి కార్యకర్తలు దేశంలో మోడి వేవ్ ఉందని భావిస్తున్నారనీ, 2014 ఎన్నికల్లో అది ఒక ఊపు ఊపేస్తుందని నమ్ముతున్నారనీ కానీ అది వాస్తవంగా లేదని వారు గ్రహించాలని నితీష్ కోరారు. కార్పొరేట్ కంపెనీలు సృష్టించిన ఈ వేవ్ త్వరలోనే సమసిపోతుందని, అదేమీ మాజిక్కులు చేయబోవడం లేదని ఆయన వ్యాఖ్యానించారు. బీహార్ శాసన సభలో ప్రభుత్వం…

గాంధీల ఆత్మను మోసి అలసిన మన్మోహన్ దేహం -కార్టూన్

కార్టూనిస్టులు ఎంత సున్నితంగా -కానీ శక్తివంతంగా- ఆలోచించగలరో ఈ కేశవ్ సురేంద్ర కార్టూన్ మరొక ఉదాహరణ. “రాహుల్ గాంధీ నా చెప్పుల్లో తన కాళ్ళు దూర్చవచ్చు” (Rahul Gandhi can step into my shoes) అని మన్మోహన్ గాంధీ, క్షమించాలి, మన్మోహన్ సింగ్ నిన్న (మంగళవారం) చేసిన ప్రకటనను వాస్తవాలకు అన్వయించిన విధానం అద్వితీయం! రాహుల్ గాంధీని మన్మోహన్ ఆహ్వానించడం ఇదే మొదటిసారి కాదు. బహుశా చివరిసారీ కాదేమో. ఈయన ఆహ్వానం పలకడం ఆయన సున్నితంగా…

కాంగ్రెస్, బి.జె.పి ల తేడా? -ఇలస్ట్రేషన్

భారత దేశంలో వివిధ రాజకీయ పార్టీల మధ్య తేడా క్రమంగా కనుమరుగవుతున్న సంగతి అంతకంతకూ ప్రస్ఫుటం అవుతోంది. జె.డి(యు) కేంద్రంగా జరిగిన, జరుగుతున్న పరిణామాలు అందుకు ఒక సాక్ష్యం మాత్రమే. కాంగ్రెస్, బి.జె.పిల మధ్య వారు చెప్పుకునే సైద్ధాంతీక విభేదాలే ఉన్నట్లయితే జె.డి(యు) ఆ రెండు పార్టీలకూ ఉమ్మడి మిత్రుడు ఎలా కాగలుగుతుంది? నిన్న, ఈరోజు అన్న ఒక్క తేడాయే తప్ప జె.డి(యు)-బి.జె.పి, జె.డి(యు)-కాంగ్రెస్ సంబంధాల్లో ఉన్నదంతా పోలికే. దేశంలోని పార్లమెంటరీ పార్టీలన్నీ ఒక తానులోని ముక్కలే.…

బీహార్ కాంగ్రెస్: కిం కర్వ్తవ్యం? -కార్టూన్

జనతా దళ్ (యునైటెడ్) బీహార్ కాంగ్రెస్ కి పెద్ద చిక్కే తెచ్చిపెట్టినట్లుంది! ఆ పార్టీ మీదా, పార్టీ నాయకుల మీదా కాంగ్రెస్ పార్టీ అధినాయకులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నప్పటికీ బీహార్ వరకు చూసుకుంటే ఒక సమస్య కాంగ్రెస్ ముందు నిలబడి ఉంది. ఎన్.డి.ఏ నుండి చీలిన జనతాదళ్ (యు)తో సఖ్యత పెంచుకోవడమా లేక ఎప్పటి నుండో కేంద్ర కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇస్తున్న రాష్ట్రీయ జనతా దళ్ తోనే స్నేహం కొనసాగించడమా? పోనీ రెండింటితో సఖ్యత నెరుపుదామంటే ఒకే…

సిరియా యుద్ధరంగంలోకి దూకనున్న ఇరాన్

సిరియా కిరాయి తిరుగుబాటులో స్టేక్స్ పెరుగుతున్నాయి. సౌదీ అరేబియా, కతార్, టర్కీ, అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, ఇజ్రాయెల్ దేశాలు ఇప్పటికే ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ సిరియా తిరుగుబాటులో భాగస్వామ్యం వహిస్తున్నాయి. ఈ దేశాల మద్దతుతోనే ఆల్-ఖైదా టెర్రరిస్టులు సిరియా ప్రజలపై మారణహోమం సాగిస్తున్నారు. అమెరికా, ఐరోపా దేశాలు అందిస్తున ధన, ఆయుధ సహాయంతో అధ్యక్షుడు బషర్ ఆల్-అసద్ కూల్చివేతకు రెండేళ్లుగా సాయుధంగా తలపడుతున్నారు. ఇరాన్, రష్యాల మద్దతుతో కిరాయి తిరుగుబాటును ఎదుర్కొంటున్న సిరియా ప్రభుత్వానికి ప్రత్యక్షంగా సహకరించడానికి ఇప్పుడు…

ఎన్.డి.ఎ కి జె.డి(యు) రామ్ రామ్

పత్రికలు ఊహించినట్లే జరిగింది. జనతాదళ్ (యునైటెడ్) పార్టీ జాతీయ ప్రజాస్వామిక కూటమి (ఎన్.డి.ఎ) కి రామ్ రామ్ చెప్పేసింది. గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడి ప్రధాని అభ్యర్ధిగా బి.జె.పి పరోక్షంగా ప్రకటించిన వారం రోజులకి ఆ పార్టీ ప్రతిపక్ష కూటమి నుండి బిచాణా ఎత్తేసింది. ప్రస్తుత పాలక్ష కూటమి లోకి ఇప్పుడు కాకపోతే భవిష్యత్తులోనైనా చేరుతుందో లేదో గానీ ఇప్పటికైతే బీహార్ లో పరిస్ధితిని సవరించుకునేలో పడింది. బి.జె.పి మంత్రులను మంత్రివర్గం నుండి తొలగించి జూన్ 19…

ఎడ్వర్డ్ స్నోడెన్, అందుకో వందనం! -ది హిందూ సంపాదకీయం

ప్రతి చారిత్రక క్షణమూ కొద్ది మంది వ్యక్తులను పతాక శీర్షికల్లో ఉంచుతుంది. ప్రభుత్వము, అధికారాల దుర్వినియోగం.. అలాంటి వారి నుండే అసాధారణ సాహసకృత్యాలను ప్రేరేపించి వెలికి తీస్తాయి. ప్రభుత్వాల ఉద్దేశ్యపూర్వక దుష్ట కార్యాల పట్ల –తమ పౌరులకు అబద్ధాలు చెప్పడం కావచ్చు, వారి ప్రైవేటు వ్యవహారాల్లోకి చొరబడడం కావచ్చు లేదా స్వార్ధ ప్రయోజనాలతో కుమ్మక్కవ్వడం కావచ్చు– విజిల్ ఊదడం ద్వారా ఈ దృఢచిత్తులు ప్రజలకు మంచి జరగడం కోసం తమ వ్యక్తిగత ప్రయోజనాలను పక్కన పెట్టేస్తారు. ఒక…

విచ్ఛిన్నం దారిలో ఎన్.డి.ఎ -కార్టూన్

జాతీయ ప్రజాస్వామిక కూటమి (నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్) విచ్ఛిన్నం దారిలో పయనిస్తున్నట్లు స్పష్టమైన సూచనలు కనిపిస్తున్నాయి. బి.జె.పితో సంబంధాలు అంత బాగా లేవని ఎన్.డి.ఎ కన్వీనర్ శరద్ యాదవ్ శుక్రవారం స్పష్టం చేసేశారు. ఇప్పటిడైతే ఎన్.డి.ఎ ఉనికిలోనే ఉంది అని చెబుతూనే ఎన్.డి.ఎ స్ధాపన సమయంలో అంగీకరించిన కనీస కార్యక్రమానికి, అవగాహనకి భిన్నంగా పరిస్ధితులు పోతున్నాయి అని ఆయన అభిప్రాయపడ్డారు. నరేంద్ర మోడిని ప్రధాని అభ్యర్ధిగా ప్రకటించడాన్ని ఆయన ఉద్దేశించారని స్పష్టమే. ఎన్.డి.ఎ స్ధాపన సమయంలో బి.జె.పి…

దేనికైనా సిద్ధపడే లీక్ చేశాను -స్నోడెన్ ఇంటర్వ్యూ

మొదటి భాగం తరువాయి…………. – మీరు దీనికోసం పధకం వేస్తున్నారని మీ కుటుంబానికి తెలుసా? లేదు. ఏం జరుగుతోందో నా కుటుంబానికి తెలియదు. ప్రధానంగా నా భయం ఏమిటంటే వారు కుటుంబం వెంటపడతారు. నా మిత్రులు, నా భాగస్వామి… ఇలా నా సంబంధీకులను అందర్నీ వేధిస్తారు… నా మిగిలిన జీవితంలో ఈ వాస్తవంతో నేను బతకాల్సి ఉంటుంది. వారితో సంభాషించే అవకాశం నాకు ఇక ఉండదు. వాళ్ళు (అధికార వర్గాలు) నేను తెలిసిన ప్రతి ఒక్కరిపైనా తీవ్ర…

ఒక ఊరేగింపుకి ఇంత నిర్బంధమా?

పశ్చిమ దేశాల ప్రజాస్వామిక ముసుగులు ఒక్కొక్కటీ తొలగిపోతున్న నేపధ్యంలో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కూడా తానూ తగ్గేది లేదని చాటుకుంటోంది. ఒకే ఒక ఊరేగింపుకు, అది కూడా రాజ్యాంగం గ్యారంటీ చేసిన భావ ప్రకటనా స్వేచ్ఛకు అనుగుణంగా మాత్రమే తలపెట్టిన ఊరేగింపుకు, ఆంద్ర ప్రదేశ్ ప్రభుత్వం కనీ వినీ ఎరుగని రీతిలో పది రాష్ట్రాలను జిల్లాలను పోలీసు కాపలా మధ్య దిగ్బంధించిన తీరు అత్యంత హేయం. బస్సులు, రైళ్లు, మెట్రో రైళ్లు అన్నీ రద్దు చేసి, స్కూళ్ళు,…