రు. 70 వేల కోట్ల ఆస్తుల అమ్మకానికి మోడి రెడీ
కోశాగార క్రమ శిక్షణ గురించి ఈ సరికే విడతలు విడతలుగా లెక్చర్లు దంచిన మోడి ప్రభుత్వం రు. 70 వేల కోట్ల రూపాయల ప్రభుత్వ రంగ ఆస్తులను స్వదేశీ, విదేశీ ప్రైవేటు కంపెనీల విందు భోజనం కోసం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. కోశాగార క్రమ శిక్షణ (Fiscal Discipline) లేదా కోశాగార స్ఢిరీకరణ (Fiscal Consolidation), ఆర్ధిక క్రమ శిక్షణ, ఆర్ధిక పొదుపు… ఈ పదజాలాలన్నీ ఒకే ఆర్ధిక ప్రక్రియకు వివిధ రూపాలు. అన్నింటి అర్ధం ఒకటే…
