ధనికులకు ఆర్.బి.ఐ పండగ కానుక, వడ్డీ రేటు తగ్గింపు

ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ శత పోరును ఆర్.బి.ఐ గవర్నర్ రఘురాం రాజన్ మన్నించారు. ధనికులు, కంపెనీలకు మరిన్ని రుణాలను అందుబాటులోకి తెస్తూ రెపో రేటును 8 శాతం నుండి 7.75 శాతానికి తగ్గించారు. ద్రవ్య విధానం సమీక్షతో సంబంధం లేకుండానే ఆర్.బి.ఐ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. “లిక్విడిటీ అడ్జస్ట్ మెంట్ ఫెసిలిటీ కింద పాలసీ రేపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించాలని నిర్ణయించాము. తద్వారా వడ్డీ రేటు 8 నుండి 7.75 శాతానికి…

మహా విలయం సునామీకి పదేళ్ళు -ఫోటోలు

డిసెంబర్ 26, 2014 తేదీతో ఆనాటి సునామీకి పదేళ్ళు నిండాయి. ఇండోనేషియా తీరానికి సమీపంలో హిందూ మహా సముద్రంలో సంభవించిన భారీ భూకంపం వల్ల సంభవించిన సునామీలో 14 దేశాల్లో 2,30.000 మంది ప్రజలు మృత్యువాత పడ్డారు. ఇందులో అత్యధికులు ఇండోనేషియాలోని సుమత్ర ద్వీపానికి చెందినవారే. ఈ సంఖ్య ఇంకా ఎక్కువే ఉండవచ్చని చెప్పేవారూ ఉన్నారు. సముద్రంలో ఆటు, పోటుల గురించి తెలియడమే గానీ సునామీ గురించి అప్పటికి ఎవరికీ తెలియదు లేదా తెలిసినవారు చాలా తక్కువ.…

ప్రధాని మూపురంపై మరో భారం -కార్టూన్

భారతీయ జనతా పార్టీ ఎం.పి సాక్షి మహారాజ్ చేస్తున్న (వివాదాస్పద ప్రతిపాదనలతో కూడిన) ప్రకటనలు ఆ పార్టీ ఆమోదంతోనే చేస్తున్నారా లేక తమ నేతలు ‘వద్దు, వద్ద’ని వారిస్తున్నా వినకుండా చేస్తున్నారా? ఆయనతో పాటు ఇతర బి.జె.పి నేతలు, హిందూత్వ సంస్ధల నేతలు చేస్తున్న విద్వేషపూరిత ప్రకటనల వెనుక ప్రధాని నరేంద్ర మోడి మద్దతు లేదా? ప్రధాని నరేంద్ర మోడి ‘వద్దు, వద్ద’ని వారిస్తున్నా వినకుండా సాక్షి మహారాజ్ తన ధోరణిలో తాను వెళ్లిపోతున్నారని ఈ కార్టూన్…

రాజపక్సే: నిలువునా కూలిన మర్రిమాను -కార్టూన్

శ్రీలంక అధ్యక్ష ఎన్నికల్లో మైత్రీపాల సిరిసేన గెలుపును ‘ప్రజాస్వామ్యం విజయం’గా ది హిందు అభివర్ణించింది. అదే విషయాన్ని కార్టూనిస్టు ఇలా చెప్పారు. ప్రజాస్వామ్యం పని చేయడం ప్రారంభిస్తే మహేంద్ర రాజపక్సే లాంటి ఊడలు దిగిన మర్రిమానులు సైతం నిలువునా కూలిపోవలసిందేనని కార్టూనిస్టు భావన! వాస్తవంలో ప్రజాభిప్రాయాన్ని, ప్రజల భావోద్వేగాలను నియంత్రించగల భౌగోళిక స్ధాయి ఘటనలను ప్రేరేపించగల శక్తులు పని చేస్తున్నప్పుడు ఆధిపత్య శక్తుల అవసరాలే ప్రజాస్వామ్యం ముసుగు వేసుకుని పత్రికల నుండి, టి.వి ఛానెళ్ల నుండి ప్రజల…

నేను మార్క్సిస్టుని! -దలైలామా

కమ్యూనిజానికి కాలం చెల్లిందని నమ్ముతున్నవారికిది దుర్వార్త! హిందూ మతోన్మాదాన్ని పీకలదాకా ఎక్కించుకుని, బుద్ధుడిని హిందూ మతంలో కలిపేసుకుని, చైనామీద వ్యతిరేకతతో దలైలామా పైన ప్రేమ పెంచుకున్న జీవులకు, బహుశా డిప్రెషన్ లోకి నెట్టివేసే విషాద వార్త! దలైలామా సైతం ‘నేను మార్క్సిస్టుని’ అని చాటుకోవడం కంటే మించిన విషాదకర దుర్వార్త ఉండగలదా? “సామాజికార్ధిక సిద్ధాంతానికి సంబంధించినంతవరకు నేను ఇంకా మార్క్సిస్టునే” అని దలైలామా ప్రకటించారు. “నేను ఇంకా” అనడం ద్వారా తాను పూర్వాశ్రమంలో ‘మార్క్సిస్టుని’ అని దలైలామా…

సరళీ-ప్రైవేటీ-ప్రపంచీ కరణాలు -ఈనాడు

LPG! ఇది ఇప్పుడు ప్రపంచ వ్యాపితంగా విస్తరించిన ఊతపదం. దీనిపైన ఒక జోక్ వ్యాప్తిలో ఉంది. LPG అంటే ఏమిటో తెలుసా? అని ఓ వ్యక్తి అడిగాడట. ‘ఆ, ఏముంది గ్యాసే కదా!’ అని మరో వ్యక్తి సమాధానం ఇచ్చాడట. LPG అంటే ఏమిటని అడిగిన వ్యక్తి ఉద్దేశ్యం Liberalisation, Privatisation, Globalisation అని. ఈ విధానాలు ప్రజలకు ఎంతో మేలు చేస్తాయని, ఉద్యోగాలు కుమ్మరిస్తాయని, దేశం ఒకటే అభివృద్ధి చెందుతుందని దేశాల పాలకులు చెబుతారు. ఈ…

శ్రీలంక ఎన్నికలు: ఆసియా-పివోట్ వ్యూహంలో ఆహుతి -2

చైనా, శ్రీలంకల మధ్య వాణిజ్యం ఏటికేడూ పెరుగుతూ పోతోంది. 2013లో ద్వైపాక్షిక వాణిజ్యం 3 బిలియన్ డాలర్లు దాటింది. శ్రీలంకకు దిగుమతులు ఇండియా తర్వాత చైనా నుండే ఎక్కువ వస్తాయి. కానీ శ్రీలంక ఎగుమతుల్లో 2 శాతం మాత్రమే చైనాకు వెళ్తాయి. ఫలితంగా శ్రీలంకకు చైనాతో భారీ వాణిజ్య లోటు (2012లో 2.4 బిలియన్ డాలర్లు) కొనసాగుతోంది. త్వరలోనే ఇరు దేశాలు స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోగలవని పరిశీలకులు అంచనా వేస్తున్న దశలో ఎన్నికలు జరిగాయి. ఈ…

శ్రీలంక ఎన్నికలు: దక్షిణాసియాలో పెరుగుతున్న అమెరికా పెత్తనం

దక్షిణాసియాలో వ్యూహాత్మకంగా కీలక ప్రాంతంలో ఉన్న మన పొరుగు దేశం శ్రీలంకలో అద్యక్ష ఎన్నికలు ముగిశాయి. రాజ్యాంగాన్ని సవరించి మరీ మూడోసారి అద్యక్షరికం చెలాయిద్దామని ఆశించిన మహేంద్ర రాజపక్సేకు శృంగభంగం అయింది. పదవీకాలం ఇంకా రెండు సంవత్సరాలు మిగిలి ఉన్నప్పటికీ ఎన్నికలు జరిపించిన రాజపక్సే అనూహ్య రీతిలో ఓటమి పాలయ్యాడు. ఎన్నికలకు రెండు నెలల ముందు వరకు అధికార పార్టీ అయిన శ్రీలంక ఫ్రీడం పార్టీ (ఎస్.ఎల్.ఎఫ్.పి) లోనూ, ప్రభుత్వం లోనూ ప్రధాన బాధ్యతలు నిర్వహించిన మైత్రీపాల…

ప్యారిస్ దాడి సామ్రాజ్యవాద అణచివేతను చట్టబద్ధం చేస్తుంది -2

మొదటి భాగం తరువాత……………….. ప్యారిస్ పత్రికపై జరిగిన దాడిలో పాల్గొన్నవారు అసలు ఉగ్రవాదులే కాదని, ఫ్రాన్స్ గూఢచార సంస్ధల ప్రోద్బలంతో వారి ఏజెంట్లుగానే దాడి చేశారు తప్ప ఉగ్రవాదులుగా దాడి చేయలేదని అనుకోవలసిన అవసరం లేదు. ఫ్రాన్స్ లో పాలకవర్గాలు పనిగట్టుకుని వ్యాపింపజేసిన ముస్లిం వ్యతిరేక సెంటిమెంట్ల వల్ల, ఫ్రాన్స్ సమాజంలోనూ ప్రభుత్వాల నుండి ఎదురవుతున్న వివక్ష వల్ల తీవ్ర నిరుత్సాహానికి గురయినందునే ఆ ముగ్గురు ముస్లిం పౌరులు ఉగ్రవాద దాడికి తెగబడి ఉండవచ్చు కూడా. ఫ్రాన్స్…

ప్యారిస్ దాడి: ఉగ్రవాదులను సాయుధం చేసింది ఫ్రాన్సే

జనవరి 7వ తారీఖున, కొత్త సంవత్సరం మత్తు ఇంకా వదలని ప్యారిస్ నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడి మత్తు విదిల్చుకుని అప్రమత్తం అయింది. రెండు దశాబ్దాలలోనే అత్యంత తీవ్రమైన సాయుధ దాడి నగరంపై జరిగిందన్న వార్త ప్యారిస్ పౌరులకు కలవరం కలిగించింది. ముసుగులు ధరించిన దుండగులు కొందరు ప్రఖ్యాత వ్యంగ్య పత్రిక కార్యాలయంపై దాడి చేసి ఎడిటర్ తో పాటు 12 మందిని కాల్చి చంపారని ఆ వార్త వారికి తెలియజేసింది. ఎలాంటి ప్రాధమిక దర్యాప్తు ముగియకుండానే ‘ఇది…

శశి ధరూర్ ని ప్రశ్నిస్తాం -ఢిల్లీ పోలీసులు

కాంగ్రెస్ ఎం.పి శశి ధరూర్ మునుముందు మరిన్ని కష్టాలు ఎదుర్కొనే సూచనలు బలపడుతున్నాయి. ఆయన భార్య సునంద పుష్కర్ హత్య కేసులో శశి ధరూర్ ని కూడా ప్రశ్నిస్తామని, అనుమానితుల్ని ఎవరిని వదిలిపెట్టేది లేదని ఢిల్లీ పోలీస్ కమిషనర్ బి.ఎస్.బస్సీ స్పష్టం చేశారని పత్రికలు నివేదించాయి. ‘గుర్తు తెలియని వ్యక్తులు’ నిందితులుగా పేర్కొంటూ హత్య కేసు నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు తనను కేసులో ఇరికించడానికి చూస్తున్నారని ధరూర్ రెండు నెలల క్రితమే ఆరోపించడం గమనార్హం. జనవరి…

చైనీయ మంచు పల్లకి ‘వింటర్ వండర్ ల్యాండ్’ -ఫోటోలు

పశ్చిమ దేశాలు గడ్డ కట్టే మంచుతో నిండే చలి సీజన్లకు పెట్టింది పేరు. చైనాలోని అత్యధిక భాగంలోని శీతా కాలం కూడా ఇంచు మించు ఐరోపా దేశాల లాగానే మంచు కింద కప్పబడి పోయి ఉంటుందని అక్కడి నుండి వెలువడే ఫోటోల ద్వారా స్పష్టం అవుతోంది. అంతర్జాతీయ వేడుకలకు గతంలో పెద్దగా చోటివ్వని చైనా ఇప్పుడు అంతకంతకు ఎక్కువగా అంతర్జాతీయ ఈవెంట్లను నిర్వహిస్తూ టూరిస్టులను సైతం ఆకర్షిస్తోంది. చలి సీజన్ లో చైనా ప్రతి యేటా ‘హార్బిన్…

సునంద పుష్కర్: ఆత్మహత్య కాదు హత్యే!

కేంద్ర మాజీ మంత్రి, ఐరాస సెక్రటరీ జనరల్ కి పోటీ పడిన భారతీయుడు శశిధరూర్ మరోసారి చిక్కుల్లో పడ్డట్లు కనిపిస్తోంది. ఆయన భార్య సునంద పుష్కర్ ది ఆత్మహత్య కాదని, ఎవరో ఆమెకు విషం ఇచ్చి చంపారని ఢిల్లీ పోలీసులు నిర్ధారించారు. ఈ మేరకు సునంద పుష్కర్ మరణం విషయమై హత్య కేసు నమోదు చేయాలని ఢిల్లీ పోలీస్ కమిషనర్ ఆదేశించారు. రష్యాలో తయారయిన విషం ఇచ్చి సునందను చంపారని, ఈ సంగతి శశి ధరూర్ కు…

ఉగ్రవాదాన్ని పాక్ బాగా అణచివేస్తోంది -అమెరికా

భారత పాలకులకు అమెరికా నుండి ఊహించని విధంగా (లేక ఊహించిందేనా?) చేదు అనుభవం ఎదురైంది. తమ దేశంలో సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్ ను ఒంటరిని చేసి సాధించాలని మన పాలకులు డిమాండ్ చేస్తుండగా అమెరికా మాత్రం పాకిస్ధాన్ ని “భేష్, ఉగ్రవాదాన్ని బాగా అణచివేస్తున్నావు” అని సర్టిఫికేట్ ఇచ్చింది. లష్కర్-ఏ-తొయిబా (LeT), జైష్-ఏ-మహమ్మద్ (JeM) లను ఉగ్రవాద సంస్ధలుగా అమెరికా పరిగణిస్తుంది. కానీ ఈ సంస్ధల నేతలు గత యేడు భారీ ర్యాలీలు నిర్వహించినప్పటికీ వాటిని…

ఆసియా, ఐరోపా: శీతల దృశ్య మాలిక -ఫోటోలు

అన్ని కాలాల్లో నీకు ఏది ఇష్టం అని అడిగితే చాలామంది టక్కున చెప్పే మాట ‘చలి కాలం’ లేదా ‘శీతా కాలం’. ముఖ్యంగా డిసెంబర్, జనవరి నెలలు దాదాపు అన్ని వయసుల వారికి మధుర స్మృతుల్ని మిగుల్చుతాయి. కాలేజీలు, పాఠశాలల విద్యార్ధులు ఎక్కువగా విహార యాత్రలకు వెళ్ళేది ఈ కాలంలోనే కావడంతో ఆ స్మృతుల్ని ఫొటోల్లో భద్రం చేసుకుని జీవితం అంతా చెప్పుకుంటూ చాలా మంది గడుపుతుంటారు. యుక్త వయసులో ఉన్న యువతీ యువకుల సంగతి చెప్పనే…