ఎ.పికి చిప్ప, బంగ్లాకు లప్ప!

ఆంధ్ర ప్రదేశ్ కు ఇవ్వడానికి లేని నిధులు బంగ్లాదేశ్ కు అప్పు ఇచ్చేందుకు ఎక్కడి నుండి వస్తాయి. దేశంలో ఒక రాష్ట్ర ప్రగతికి నిధులు లేనప్పుడు ఇతర దేశానికి రుణం ఇవ్వడం ఎలా సాధ్యం? అది కూడా ఒక ముస్లిం దేశానికి? లోటు బడ్జెట్ తో మూలుగుతున్న చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి విభజన సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి డబ్బు లేదని కేంద్రం చెప్పింది. ఇప్పుడేమో ఏకంగా 2 బిలియన్ డాలర్ల (సుమారు రు. 12 వేల…

భూమిపూజ: కేంద్రం నుండి కొబ్బరిచిప్ప -కార్టూన్

విభజన రాజకీయాలు పూర్తి స్ధాయిలో సాగుతున్న కాలంలో, కేవలం సంవత్సర కాలం క్రితమే, అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం గానీ ఇప్పటి బి.జె.పి ప్రభుత్వం గానీ ఇవ్వని వాగ్దానం లేదు. నూతన ఆంధ్ర ప్రదేశ్ ప్రజలకు అనేక సంస్ధలు, నిధులు వాగ్దానం చేసినా అవేవీ అమలు కాకపోగా, కనీసం అమలు చేస్తామన్న నమ్మకం కూడా కేంద్ర ప్రభుత్వం ఇవ్వలేకపోతోంది. రాష్ట్ర విభజనలో తమది కూడా గణనీయమైన పాత్రే అని చెప్పుకోవడం బి.జె.పికి ఇష్టం. అటు తెలంగాణ ప్రజలకేమో తమ…

కింద పడ్డా పై చేయి మాదే -మ్యాగి

భారత దేశంలో ఎల్లెడలా ఒత్తిడి తీవ్రం కావడంతో స్విట్జర్లాండ్ బహుళజాతి కంపెనీ నెస్లే (Nestle) వెనక్కి తగ్గింది. దేశ వ్యాపితంగా అన్ని దుకాణాల నుండి మ్యాగి నిల్వలను వెనక్కి తీసుకుంటున్నట్లు కంపెనీ అధిపతి ప్రకటించాడు. అయితే కింద పడ్డా పై చేయి తనదే అని చెబుతున్నట్లుగా మ్యాగీలో మోనో సోడియం గ్లుటామెట్ (ఎం.ఎస్.జి) ని కలప లేదని బొంకడం మాత్రం మానలేదు. దేశంలో మెజారిటీ రాష్ట్ర ప్రభుత్వాలు మ్యాగి శాంపిళ్లను పరీక్షకు పంపుతూ తమ తమ రాష్ట్ర…

వాలుకి విరుద్ధంగా… -ది హిందు ఎడిట్..

[జూన్ 4 నాటి ది హిందు ఎడిటోరియల్ ‘Against the grain’ కు ఇది యధాతధ అనువాదం. ఈ శీర్షిక ఆంగ్లంలో ఒక సామెత. కట్టెను వాలుగా కొస్తే త్వరగా తెగుతుంది తప్ప అడ్డంగా కోస్తే అనుకున్న ఫలితం రాదని ఈ సామెత సూచిస్తుంది. ఈ సామెత ప్రస్తావించడంలోనే ది హిందు ఉద్దేశ్యం అనుమానాస్పదంగా కనిపిస్తోంది. కానీ ఎడిటోరియల్ లో గమనార్హమైన పరిశీలనలు ఉన్నాయి.] ***************** “న్యాయమైన నష్టపరిహారం పొందే హక్కు మరియు భూ సేకరణ, పునరావాసం,…

మ్యాగి పురుగు పట్టిన మన ఆహార భద్రత -కార్టూన్

ఆహార భద్రత గురించి మన దేశ ప్రధానుల దగ్గర్నుండి ఛోటా మోటా ఐ.ఏ.ఎస్ అధికారుల వరకు చెప్పని కబురు లేదు. వాస్తవంలో భారత దేశ ఆహార భద్రత పురుగులు పట్టి కుళ్లిపోయిన యాపిల్ పరిస్ధితికి దిగజారిందని కార్టూనిస్టు వ్యంగ్యంగా చూపారు. 2 నిమిషాల్లో వండిపడేసే మ్యాగిలో ఆనారోగ్య కారక రసాయనాలు ఉన్నాయని తేలడంతో పలు రాష్ట్రాలు మ్యాగి శాంపిళ్ళను పరీక్ష చేయిస్తున్న నేపధ్యంలో మన ఆహార భద్రత పరిస్ధితిని ఈ కార్టూన్ వివరిస్తోంది. గత ఏప్రిల్ నెలలో…

ఋతుపవనాలు: ఈ యేడూ కష్టమే

ఎల్-నినో పుణ్యమాని ఈ సంవత్సరం దేశంలో వర్షపాతం సగటు కంటే చాలా తక్కువ ఉండవచ్చని భారత వాతావరణ విభాగం (ఇండియన్ మీటియొరలాజికల్ డిపార్ట్ మెంట్ -ఐ.ఎం.డి) తాజా అంచనాలో తెలియజేసింది.  93 శాతం వర్షపాతం మాత్రమే కురుస్తుందని ఏప్రిల్ నెలలో ఐ.ఎం.డి అంచనా వేసింది. అంత కూడా ఉండదని జూన్ 2 తేదీన వేసిన అంచనాలో తెలిపింది. సగటులో 88 శాతం కురిస్తే గొప్ప అని ప్రకటించింది. తాజా అంచనాలో 88 శాతం వర్షపాతం ఉండవచ్చని తెలిపిన…

ఒక ఆదేశం, కొన్ని ప్రశ్నలు -ది హిందు ఎడిట్..

సామాజిక మరియు సైద్ధాంతీక సమస్యలపై ఒక విద్యార్ధి సంస్ధ చేపట్టిన చురుకైన అవగాహన ఆధారంగా ప్రభుత్వ నిధులతో, ప్రభుత్వ పాలన కింద నడిచే పేరు ప్రతిష్టలు కలిగిన ఓ సంస్ధ అధికారులు ఆ విద్యార్ధి సంస్ధ గుర్తింపును రద్దు చేయడానికి నిర్ణయిస్తే గనుక అపుడా ప్రతిష్టాత్మక సంస్ధ వైఖరిలోనే ఏదో తీవ్రమైన దోషం ఉన్నట్లే. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ – మద్రాస్ లోని అంబేద్కర్-పెరియార్ స్టడీ సర్కిల్ (ఎ.పి.ఎస్.సి) ‘బ్రాహ్మణీయ పీడన’ ను తొలగించాలని పిలుపు…

ఎల్-నినో: ఋతుపవనాలు ఆలస్యం

పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడిన ఎల్-నినో వాతావరణ ప్రభావం ఫలితంగా ఈ యేడు భారత దేశానికి ఋతుపవనాలు ఆలస్యంగా వస్తున్నాయి. జూన్ 1 తేదీకల్లా నైరుతి ఋతుపవనాలు కేరళలో ప్రవేశించాల్సి ఉండగా ఇంతవరకు వాటి జాడలేదు. ఐదు రోజులు ఆలస్యంగా జూన్ 5,6 తేదీల్లో కేరళలోకి ఋతుపవనాలు ప్రవేశించవచ్చని వాతావరణ సంస్ధ అధికారులు ఈ రోజు (జూన్ 1) తెలిపారు. మూడింట రెండు వంతుల జనాభా వ్యవసాయ రంగంపై ఆధారపడి జీవిస్తున్న భారత దేశంలో నీటి పారుదల వసతులు…

మోడి స్నేహ హస్తం! -ది హిందు ఎడిట్..

[మే 27 నాటి ది హిందు ఎడిటోరియల్ “Modi reaches out” కు యధాతధ అనువాదం. -విశేఖర్] *************** సాధారణ ప్రజాస్వామిక పద్ధతులు నెలకొని ఉన్నప్పుడు ప్రధాని నరేంద్ర మోడి మరియు డా.మన్మోహన్ సింగ్ ల మధ్య జరిగిన లాంటి సమావేశం ఎలాంటి విమర్శలకు తావు లేకుండా జరిగిపోతుంది. ఒకసారి ఎన్నికల వేడి, శతృత్వాలు అంతరించడం అంటూ జరిగిన తర్వాత ప్రభుత్వ పాలన ఇక సహకార సంస్ధ తరహాలో మారిపోతుంది. అధికారం చేపట్టిన వ్యక్తి సలహా, సూచనల…

ప్రధాని, మాజీ ప్రధాని సమావేశం -కార్టూన్

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, ప్రధాని నరేంద్ర మోడిని కలిశారు. వారి సమావేశంలోనే అంశాలు ఏమిటో ఎవరికి తెలియదు. మాజీ ప్రధాని మాట్లాడి వెళ్ళాక ప్రధాని నరేంద్ర మోడిగారే స్వయంగా వారిద్దరు చేతులు కలిపిన ఫోటోను ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ఫోటోతో పాటు కొంత మేటర్ ఆయన రాశారు గానీ, అందులో వారి సమావేశంలోని అంశం ఏమిటో చెప్పలేదు. ట్రాయ్ (టెలికాం రెగ్యులేటరీ ఆధారిటీ ఆఫ్ ఇండియా) మాజీ అధిపతి భాయిజి తన ఉద్యోగ అనుభవాలను…

పోషక లోపం: ప్రపంచంలో 25% ఇండియాలోనే

ప్రపంచవ్యాపితంగా పోషకాహార లోపంతో బాధపడుతున్నవారు 100 మంది ఉంటే అందులో 25 మంది భారత దేశంలోనే ఉన్నారు. ఐక్యరాజ్యసమితి ఆహార మరియు వ్యవసాయ సంస్ధ (UNFAO) నివేదిక తెలిపింది. ఈ రోజు వెలువడిన నివేదిక ప్రకారం ప్రపంచంలో పోషకాహార లోపంతో బాధపడుతున్నవారి సంఖ్య అత్యధికంగా ఇండియాలోనే ఉన్నారు. ఇండియా తర్వాత స్ధానంలో జి.డి.పిలో అమెరికాతో పోటీ పడుతున్న చైనా నిలవడం గమనార్హం. 21వ దశాబ్దం ఆరంభంలో ఇండియా, చైనాలు సాధించిన వేగవంతమైన జి.డి.పి వృద్ధి ఆ దేశాల్లో…

మోడి ద సూపర్ హీరో -కార్టూన్

“80 రోజుల్లో ప్రపంచాన్ని చుట్టి రావడమే తేలిక…” ************* గత యేడాదిలో పార్లమెంటు సమావేశాలకు అతి తక్కువ సార్లు హాజరైన ప్రధాన మంత్రిగా విమర్శలు ఎదుర్కొన్న ప్రధాని నరేంద్ర మోడి అదే సమయంలో ఒకే సంవత్సరంలో అత్యధిక సంఖ్యలో విదేశాలు పర్యటించిన ఘనతను కూడా దక్కించుకున్నారు. సంవత్సర కాలంలో ప్రధాని నరేంద్ర మోడి 18 దేశాలు పర్యటించడం మున్నేన్నడూ ఎరగనిది. ఆయన ముఖ్యమంత్రి ఉన్న పదేళ్ళ కాలంలో ఏయే దేశాలైతే ఆయనకు వీసా ఇవ్వడానికి నిరాకరించాయో ఆ…

వేడిగాలులకి 1100 మంది బలి -ఫోటోలు

భారత దేశాన్ని, అందునా దక్షిణ భారతాన్ని, అందులోనూ తెలుగు రాష్ట్రాలైన ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలను వేడి గాలులు పట్టి ఊపేస్తున్నాయి. గత వారం రోజుల్లోనే వెయ్యికి పైగా ప్రజలు వడగాలులకు బలైపోగా మొత్తం మీద ఈ వేసవి కాలంలో వడదెబ్బకు గురై మరణించినవారి సంఖ్య 1100 దాటి పోయిందని జాతీయ, అంతర్జాతీయ పత్రికలు తెలిపాయి. దాదాపు ప్రతి అంతర్జాతీయ వార్తా సంస్ధ భారత దేశంలో వేడి గాలుల గురించి గత కొద్ది రోజులుగా తప్పనిసరిగా వార్తలు…

నువ్వు ముస్లింవి, ఇల్లు ఖాళీ చెయ్!

గుజరాత్ మారణకాండ అనంతరం ముస్లిం ప్రజలు రక్షణ కోసం వెలివాడల్లో బ్రతుకులు ఈడ్చవలసిన దుర్గతి దాపురించింది. ఇటువంటి హీన పరిస్ధితుల మధ్య బతకలేక కాస్మోపాలిటన్ నగరం ముంబైలో గౌరవంగా బతకొచ్చని గంపెడు ఆశలతో తరలి వచ్చిన ముస్లింలకు ఆధునిక కాస్మోపాలిటన్ సంస్కృతికి బదులు మత విద్వేషం స్వాగతం పలికింది. ఆధునిక నగరం అని జనులు చెప్పుకునే ముంబై నగరం పైకి మాత్రమే ఆధునికం అనీ లోలోపల కుల, మత, లింగ వివక్షలతో కుళ్లిపోయిందని మిష్భా ఖాద్రి అనుభవం…