2016 బడ్జెట్: రాష్ట్రాల ఎన్నికలే లక్ష్యంగా… -1
ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ ఒక విచిత్రమైన బడ్జెట్ ప్రతిపాదించారు. దాదాపు ఎవరికీ ఏమీ అర్ధం కాకుండా పోయిన బడ్జెట్ ఇది. సారాంశాన్ని ఒక ముక్కలో చెప్పడానికి సాధారణ పరిశీలకులకు ఎవరికీ అవకాశం ఇవ్వకుండా బడ్జెట్ ప్రతిపాదించబడింది. చివరికి స్టాక్ మార్కెట్లు కూడా మొదట 600 పాయింట్లు పైగా పడిపోయి మళ్ళీ లేచి 153 పాయింట్ల నష్టంతో సర్దుకుంది. అనగా ధనిక పారిశ్రామిక వర్గాలకు కూడా బడ్జెట్ తనకు అనుకూలమో, ప్రతికూలమో ఒక పట్టాన అర్ధమై చావలేదు.…



