అమెరికా కొత్త ఉగ్ర వాస్తవికత -ది హిందూ ఎడిట్..

[ఈ రోజు -జూన్ 14- ది హిందు ప్రచురించిన ఎడిటోరియల్ “America’s new terror reality” కు యధాతధ అనువాదం] –o0o– గ్లోబల్ జిహాదీ ఉగ్రవాదం, విచ్చలవిడి తుపాకీ నియంత్రణ చట్టాలు, వినాశకర హోమో ఫోబియా… ఈ మూడు విష శక్తులు ఆదివారం రాత్రి మూకుమ్మడిగా ఒర్లాండో, ఫ్లోరిడా లోని నైట్ క్లబ్ పైన విరుచుకుపడ్డాయి. ఫలితంగా, అమెరికా చరిత్రలోనే అత్యంత భారీ సామూహిక హత్యాకాండ చోటు చేసుకుంది. ఆఫ్ఘన్ వలస దంపతులకు అమెరికాలో జన్మించిన ఒమర్…

ఉద్తా పంజాబ్: ఒక కత్తెర, A సర్టిఫికేట్ తో హై కోర్టు ఓకే

సెన్సార్ బోర్డు గా పిలవబడుతున్న సి‌బి‌ఎఫ్‌సి కి సినిమా లను సెన్సార్ చేసే అధికారం గానీ, కత్తెర వేసే అధికారం గానీ లేదని, రాజ్యాంగంలో అలాంటి ఏర్పాటు ఏమీ లేదని బోంబే హైకోర్టు స్పష్టం చేసింది. సినిమాటోగ్రఫీ చట్టంలో సెన్సార్ అన్న పదమే లేదని కనుక రాజ్యాంగం రీత్యా ఫలానా మాత్రమే ఉండాలని, ఫలానా ఉండకూడదు అని నిర్దేశించే అధికారం సి‌బి‌ఎఫ్‌సి కి లేదని హైకోర్టు రూలింగ్ ఇచ్చింది. ఉద్తా పంజాబ్ సినిమాకు మోడీ గారి చెంచా…

సెన్సార్ బోర్డుకు కత్తెర బరువైన వేళ -కార్టూన్

ప్రథాన మంత్రి మోడి గారి చెంచా గారు పహ్లాజ్ నిహలానీ పుణ్యమా అని ఉద్తా పంజాబ్ సినిమాకు ఖర్చు లేకుండా బోలెడు ప్రచారం దక్కింది. ఇప్పుడు విడుదల అయి ఘన విజయం సాధించటమే తరువాయి అన్నంతగా ప్రచారం పొందిన ఉద్తా పంజాబ్ కి ఎ సర్టిఫికెట్ ఇచ్చినట్లు నిన్న సి‌బి‌ఎఫ్‌సి అధిపతి నిహలానీ ప్రకటించారు. ఆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ “మా పని మేము చేశాం. ఇక దానిపై కోర్టుకు వెళతారా లేక అలాగే విడుదల చేస్తారా…

ఫ్రాన్స్ లో పెరుగుతూన్న అలజడి -ది హిందు ఎడిట్ (విమర్శ)

[శనివారం, జూన్ 11 తేదీన “Growing unrest in France” శీర్షికన ది హిందులో ప్రచురితం అయిన సంపాదకీయానికి ఇది యధాతధ అనువాదం. అనువాదం అనంతరం సంపాదకీయంపై విమర్శను చూడవచ్చు. -విశేఖర్] ——— సమ్మెలకు ఫ్రాన్స్ కొత్త కాదు. కానీ సోషలిస్టు ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా వామపక్షంవైపు మొగ్గు చూపే కార్మిక యూనియన్లు వారాల తరబడి సాగిస్తున్న అలజడి మున్నెన్నడూ ఎరగనిది. మే 17 తేదీన సమ్మె ప్రారంభించిన యూనియన్లు ఫ్రాన్స్ లోని కఠిన కార్మిక చట్టాలను…

క్లుప్తంగా… -10/06/2016

ఏప్రిల్ లో క్షీణించిన ఫ్యాక్టరీ ఉత్పత్తి కొత్త ఆర్ధిక సంవత్సరం ప్రారంభ నెలలో ఫ్యాక్టరీ/పారిశ్రామిక ఉత్పత్తి వృద్ధి చెందటానికి బదులు కుచించుకుపోయింది. 2015 ఏప్రిల్ తో పోల్చితే 2016 ఏప్రిల్ నెలలో ఫ్యాక్టరీల ఉత్పత్తి 0.8 శాతం తగ్గిపోయిందని కేంద్ర గణాంక కార్యాలయం (CSO – Central Statistics Office) ప్రకటించింది. 2015-16 ఆర్ధిక సంవత్సరంలో ఇండియా జి‌డి‌పి 7.6 శాతం వృద్ధి సాధించిందని అట్టహాసంగా ప్రకటించి రోజులు గడవక ముందే ఈ ప్రతికూల వార్త వెలువడటం…

వడ్డీ రేట్లు: పరిశ్రమ వర్గాల ఏడుపు – కార్టూన్

రెండు రోజుల క్రితం ఆర్.బి.ఐ గవర్నర్ వడ్డీ రేట్లు సమీక్షించారు. ఈ సమీక్షలో ఆయన వడ్డీ రేట్లు తగ్గిస్తారని అందరూ ఆశించారు. అయితే వారి ఆశలను వమ్ము చేస్తూ గవర్నర్ రఘురామ్ రాజన్ వడ్డీ రేట్లు కదల్చకుండా యధాతధంగా ఉంచారు. వడ్డీ రేట్ల వ్యవహారం ఆర్బీఐ, కేంద్ర ప్రభుత్వంల మధ్య ఎప్పుడూ ఘర్షణకు దారి తీసే అవకాశం గల సమస్యగా ఉంటోంది. దీనికి ప్రధాన కారణం వడ్డీ రేట్ల చుట్టూ ఏర్పడి ఉన్న వాతావరణం. వడ్డీ రేటు…

క్లుప్తంగా… 09/06/2016

చైనా అప్పు అమెరికా ఎగవేయొచ్చు జాగ్రత్త! మహిళలపై అమానుషాన్ని ఆపండి -ఐర్లండ్ తో ఐరాస ఉద్తా పంజాబ్ లో తప్పేముంది? -బొంబే హై కోర్ట్ రేపిస్టుని క్షమించి వదిలేయి, ప్లీజ్ చైనా అప్పు అమెరికా ఎగవేయొచ్చు జాగ్రత్త! ఇది బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ (బ్రిటన్ సెంట్రల్/రిజర్వ్ బ్యాంక్) మాజీ గవర్నర్ మెర్విన్ కింగ్ చేసిన హెచ్చరిక! “భవిష్యత్తులో ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు? కానీ తమ విదేశీ ఆస్తులు అన్నీ అమెరికాపైనే ఆధారపడి ఉండటం చైనా తదితర…

మోడీ చంచానే, అందుకు గర్విస్తున్నాను -సి‌బి‌ఎఫ్‌సి చైర్మన్

వ్యక్తి పూజ, పాద పూజ, సైకోఫేన్సీ, గుడ్డి అభిమానం, దురభిమానం మొదలైన లక్షణాలు మూర్తీభవిస్తే (మనిషి రూపం ధరిస్తే) ఆ మనిషి ఎలా ఉంటాడు? మామూలుగా అయితే ఈ ప్రశ్నకు సమాధానం చెప్పటం కష్టం. ఒకవేళ చెప్పినా దానికి ఆ వ్యక్తి నుండి ఆమోదం పొందటం కష్టం. “అవును. నరేంద్ర మోడీకి చంచానే. మోడీ చంచాగా ఉన్నందుకు గర్వపడుతున్నాను” అని ప్రకటించిన సి‌బి‌ఎఫ్‌సి (సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్) ఛైర్మన్ పహ్లాజ్ నిహలాని ని చూస్తే…

క్లుప్తంగా …8/6/2016

తిండి కోసం ఇసిస్ లొ చేరాము ! పోరాటం కొనసాగుతుంది -శాండర్స్ సౌదీలకు టార్చర్ టెక్నిక్ లు నేర్పుతున్న బ్రిటిషర్లు కేరళను తాకిన నైరుతి ఋతుపవనం రాజన్ భారతీయుడే -ఆర్‌బి‌ఐ తిండి కోసం ఇసిస్ లొ చేరాము ! మే 2014 నుండి ఇసిస్ ఆక్రమణ లో ఉన్న ఫలూజా నగరాన్ని ఇరాకీ బలగాలు విముక్తి చేస్తున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. ఇరాక్ ప్రభుత్వ బలగాలు పురోగమించే కొద్దీ స్ధానిక ప్రజలపై ఇసిస్ మూకలు సాగించిన దౌర్జ్యన్య కాండ…

రాజ్యసభ ఎన్నికలు: మండుతున్న ధరలు -కార్టూన్

గృహస్ధుడు & నాయకుడు: “అబ్బబ్బ! ధరలు మరీ అందుబాటులో లేకుండా పోయాయి!” ********* ప్రజల మేలు ఏనాడూ కోరని పార్టీలు, వాటి నాయకులు ఆ సంగతి మరిపించటానికి అలవి గాని వాగ్దానాలు చేయడం, అవి తీర్చలేక (ఆఫ్ కోర్స్! తీర్చే ఉద్దేశం లేక) ఎన్నికలలో అక్రమాలకు పాల్పడటం పరిపాటి. ఎన్నికల అక్రమాలలో పేరెన్నిక గన్నవి డబ్బు పంపిణీ, మద్యం తాగబోయించటం అని అందరికీ తెలిసిన సంగతే! కూలీనాలితో పొట్ట పోసుకునే శ్రామికులకు ప్రజాస్వామ్యం అంటే ఏమిటో తెలియదు.…

ఇంకా చావలేదా? అని మోడి ఫోన్ లో తిట్టారు! -ఇంటర్వ్యూ

రూపాబెహన్ మోడి పార్శీ కుటుంబానికి చెందిన మహిళ. గుల్బర్గ్ సొసైటీలోనే ఆమె ఇల్లు కూడా ఉన్నది. హిందూ మతం పేరుతో రెచ్చిపోయిన రౌడీ మూకల స్వైర విహారం నుండి రక్షించుకోవటానికి ఆమె తన కూతురు, కొడుకుతో కలిసి కాంగ్రెస్ ఎం‌పి ఎహసాన్ జాఫ్రీ ఇంటిలో తలదాచుకుంది. ముఖ్యమంత్రి మోడీకి ఫోన్ చేసి రక్షణ కోరాలని ఎహసాన్ జాఫ్రీకి చెప్పిన వారిలో రూప ఒకరు. గేటు పేల్చివేసి లోపలికి దూసుకు వచ్చిన హిందూ మూకలు ఎహసాన్ జాఫ్రీని బైటికి…

గుల్బర్గ్ హత్యాకాండ: దక్కని న్యాయం

గుల్బర్గ్ హత్యాకాండ బాధితులకు చివరికి తీరని శోకం, అసంతృప్తి, వేదన, నిస్పృహ మాత్రమే దక్కాయి. కాంగ్రెస్ పార్టీకి చెందిన పార్లమెంటు సభ్యుడు ఎహసాన్ జాఫ్రీతో సహా 69 మంది ముస్లింలను ఊచకోత కోసిన కేసులో 24 మందిని మాత్రమే దొషులుగా ట్రయల్ కోర్టు తేల్చింది. ఆ 25 మందిలో కూడా 11 మంది మాత్రమే హత్యలకు బాధ్యులుగా కోర్టు గుర్తించింది. పోలీసులు మొత్తం 60 మందిపై అభియోగాలు మోపగా 36 మందిని కోర్టు నిర్దోషులుగా తీర్పు చెప్పింది.…

పనామా పేపర్స్: అమెరికా ఫైనాన్స్ ప్రయోజనాలే లక్ష్యం -4

(3వ భాగం తరువాత………..) అమెరికా ఫైనాన్స్ కంపెనీలే లబ్దిదారులు ఒక నేరం జరిగినప్పుడు పోలీసులు లేదా నేర విచారణ సంస్థలు ఒక అంశంపై తప్పనిసరిగా దృష్టి పెడతాయి. ఆ నేరం వల్ల లబ్ది పొందేది ఎవరు? అని ప్రశ్నించుకుంటారు. ఆ ప్రశ్నకు సమాధానం దొరికితే నేర విచారణ అనేక కేసుల్లో పూర్తయి పోతుంది. అనేకానేకానేక పరిణామాలు నిత్యం విడివిడిగా, జమిలిగా చోటు చేసుకునే ప్రపంచ కార్యరంగంలో చోటు చేసుకునే పరిణామాలకు కారణాలు కనిపెట్టడం మామూలు కంటికి కష్ట…

పఠాన్ కోట్ దాడిలో పాక్ హస్తం: సాక్ష్యం లేదు  -ఎన్ఐఎ

నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ అథిపతి పొరపాటునో గ్రహపాటునో ఒక నిజం కక్కేశారు. “పఠాన్ కోట్ దాడి వెనుక పాక్ హస్తం లేదు” అని న్యూస్18 ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. దాడి వెనుక పాక్ ప్రభుత్వం  గానీ పాక్ ప్రభుత్వ ఏజెన్సీలు గానీ కుమ్మక్కు అయినట్లు తమ వద్ద ఎటువంటి సాక్షాలు లేవుఅని ఎన్ ఐ ఎ డైరెక్టర్ శరత్ కుమార్ స్పష్టం చేశారు.  ఎన్ ఐ ఎ వెల్లడి కేంద్రం లోని బిజెపి ప్రభుత్వాన్ని…

అక్రమ డబ్బు, పన్ను ఎగవేతలకు నూతన స్వర్గం అమెరికా! -3

– (2వ భాగం తరువాత………….) అక్రమ డబ్బుకు కొత్త స్వర్గం అమెరికా! 2008 ప్రపంచ ద్రవ్య-ఆర్ధిక సంక్షోభం తర్వాతి రోజుల్లో అమెరికా, ఐరోపాలు జి20 ని ప్రధానంగా రంగంలోకి దించాయి. జి20 పేరుతో సంక్షోభం భారాన్ని బ్రిక్స్ (బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా) దేశాలపై నెట్టడానికి ప్రయత్నాలు చేసింది. ముఖ్యంగా చైనా వద్ద ఉన్న అపారమైన విదేశీ మారక ద్రవ్య నిల్వలు లక్ష్యంగా పెట్టుకుంది. (ఐతే చైనా ఆ బుట్టలో పడకపోవడం వేరే సంగతి).…