అలా అయితే నేను బలమైన ప్రధానిని కాను -డా. మన్మోహన్

యుపిఏ 2.0 ప్రభుత్వ హయాంలో అప్పటి ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ అన్ని వైపుల నుండీ తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. 2జి సెక్ట్రమ్ స్కాం, బొగ్గు గనుల కేటాయింపుల స్కామ్, హెలికాప్టర్ స్కాం, ఇలా అనేక స్కాం లు వరస బెట్టి వెలుగు చూడటం వలన అసలు దోషులకు బదులు ప్రధాన మంత్రి పదవిలో ఉన్న డా. మన్మోహన్ సింగ్ పైనే విమర్శలు ఎక్కుపెట్టబడ్డాయి. ఎన్ని విమర్శలు వచ్చినా చాలా కాలం వరకు డా. మన్మోహన్ సింగ్…

డా|| ఎంఎంఎస్: హోమ్ శాఖ ఆంగ్ల పాండిత్యమా ఇది?

కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖలో కేంద్ర ప్రజా సమాచార కార్యాలయం నుండి వెలువడిన లేఖ ఒకటి ట్విట్టర్ లేదా ఎక్స్ లో చక్కర్లు కొడుతోంది. సెంట్రల్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీస్ లో జాయింట్ సెక్రటరీ అయిన జి.పార్ధ సారధి సంతకంతో వెలువడిన ఈ లేఖలో ఆంగ్ల భాషకు సంబంధించి దొర్లిన తప్పులు భారత కేంద్ర మంత్రిత్వ శాఖలో పని చేస్తున్న ఉన్నతశ్రేణి అధికారుల భాషా పరిజ్ఞానంపై అనుమానాలు కలుగ జేస్తున్నాయి. ఈ లేఖ, ఎవరైనా ఆర్.టి.ఐ దరఖాస్తు…

ఇజ్రాయెల్ ప్రధానిపై ఐసిసి అరెస్ట్ వారంట్!

Yoav Gallant and Benjamin Netanyahu ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు ఎట్టకేలకు ఇజ్రాయెల్ ని ఏలుతున్న టెర్రరిస్టు ప్రధాన మంత్రి బెంజిమిన్ నెతన్యాహూ అరెస్టుకు, ఈ రోజు అనగా నవంబర్ 21 తేదీన, అరెస్ట్ వారంట్ జారీ చేసింది. ప్రధాని నెతన్యాహూతో పాటు ఇటీవలి వరకు ఇజ్రాయెల్ రక్షణ మంత్రిగా పని చేసిన యెవ్ గాలంట్ అరెస్టుకు కూడా ఐసిసి వారంట్ జారీ చేసింది. ఇజ్రాయెల్ బాంబు దాడుల్లో చనిపోయిన హమాస్ సంస్థ రాజకీయ నేత ఇస్మాయిల్…

బ్రిక్స్ దేశాలకు ఉమ్మడి కరెన్సీ?

– బ్రిక్స్ కూటమి 16వ సమావేశాల్లో రష్యా అధ్యక్షుడు పుటిన్ కు బ్రిక్స్ కరెన్సీ పేరుతో ఒక నమూనా నోట్ ను బహూకరించటం ఇండియాలో కలకలం రేగటానికి కారణం అయింది. కరెన్సీ నోట్ నమూనా పైన భారత దేశం తరపున భారత జాతీయ పతాకంతో పాటు తాజ్ మహల్ బొమ్మ కూడా ఉండటం ఈ కలకాలానికి ప్రధాన కారణం. ప్రధాన మంత్రి నరేంద్ర మోడి 2014 లో అధికారం చేపట్టిన తర్వాత వివిధ ముస్లిం మత నిర్మాణాలకు,…

బ్రిక్స్: ద్రవ్య ఏకీకరణ జరగాలి -మోడి

రష్యా నగరం కాజన్ లో జరుగుతున్న ‘బ్రిక్స్ కూటమి’ 16వ సమావేశాల్లో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడి బ్రిక్స్ సభ్య దేశాల మధ్య ద్రవ్య ఏకీకరణ (Financial Integration) జరగాలని, ద్రవ్య ఏకీకరణకు ఇండియా మద్దతు ఇస్తుందని ప్రకటించాడు. బుధవారం అక్టోబర్ 23 తేదీన సమావేశాల్లో ఆయన పాల్గొంటూ అంతర్జాతీయ ఉగ్రవాదం విషయమై తయారు చేసిన పత్రాన్ని ప్లీనరీ సెషన్ లో ప్రవేశ పెట్టాడు. అంతర్జాతీయ ఉగ్రవాదం విషయంలో ఇండియా రాజీలేని ధోరణి అవలంబిస్తుందని మోడి…

బ్రిక్స్: ఇండియాపై అమెరికా ఆశలు నిలిచేనా?

పశ్చిమాసియాలో అరబ్ పాలస్తీనా ప్రజలపై ఇజ్రాయెల్ జరుపుతున్న సామూహిక దారుణ మారణకాండ, ఉక్రెయిన్-రష్యా యుద్ధంల పుణ్యమాని ఇరుగు పొరుగు దేశాలైన ఇండియా, చైనాల మధ్య సంబంధాలు మెరుపడే సూచనలు కనిపిస్తున్నాయి. ఇవి కేవలం సూచనలేనా లేక వాస్తవ రూపం దాల్చేనా అన్న సంగతి మాత్రం ఇప్పుడప్పుడే తెలిసే అవకాశం మాత్రం లేదు. రష్యన్ నగరం కాజన్ లో ఈ రోజు (అక్టోబర్ 23) బ్రిక్స్ కూటమి దేశాల సమావేశాలు ప్రారంభం అయ్యాయి. విశ్లేషకులు ఊహించినట్లుగానే ఇండియా, చైనా…

తూర్పు లడఖ్: చైనా, ఇండియా మధ్య కుదిరిన ఒప్పందం!

10 దేశాల బ్రిక్స్ కూటమి సమావేశాలు రష్యన్ నగరం కాజన్ లో ప్రారంభం కావటానికి రెండు రోజుల ముందు తూర్పు లడఖ్ సరిహద్దు కాపలా విషయంలో ఇరు దేశాల మధ్య ఒప్పందం కుదిరిన మాట నిజమేనని ఈ రోజు (అక్టోబర్ 22) చైనా ధృవీకరించింది. ఒప్పందం కుదిరిన సంగతిని సోమవారమే (అక్టోబర్ 21) ఇండియా ప్రకటించింది. ఇండియా ప్రకటనను చైనా ఈ రోజు ధృవీకరించింది. లడఖ్ ప్రాంతంలో చైనా, ఇండియా దేశాల మధ్య ఉన్న సరిహద్దు రేఖను…

ఓ అద్భుతమైన లోకంలో మనం బ్రతుకుతున్నాం!

ఒక అద్భుతమైన లోకంలో మనం బ్రతుకుతున్నాం ఇక్కడ శాస్త్రవేత్తలు జ్యోతిష్యం మాట్లాడతారు బాబాలు సైన్స్ బోధిస్తారు ఇతిహాసకులు చరిత్రను రాస్తారు సినీ నటులు భక్తిని వ్యాప్తి చేస్తారు ధనవంతులు సాదా జీవనం గురించి పాఠాలు చెబుతారు ప్రవాస భారతీయులు దేశాన్ని ఎలా ప్రేమించాలో చెబుతారు నేరగాళ్ళు విలువలను బోధిస్తారు రాజకీయ నాయకులు దేవుడి గురించి మాట్లాడతారు దేవుడు మాత్రం నిశ్శబ్దం పాటిస్తాడు – పై పాఠ్యం వాట్సప్ మెసేజ్ గా నా మిత్రుడొకరు పంపారు. పాఠ్యాన్ని ప్రముఖ…

ఇజ్రాయెల్ పై ఇరాన్ ముందస్తు దాడి? రష్యా మద్దతు?

అక్టోబర్ 1 తేదీన ఇరాన్ దాదాపు 180 కి పైగా మిసైళ్లతో ఇజ్రాయెల్ పై విరుచుకుపడింది. హమాస్ రాజకీయ నేత ఇస్మాయిల్ హనీయేను ఇరాన్ లో ఉండగా మిసైల్ దాడితో ఇజ్రాయెల్ హత్య చేసింది. హమాస్ సుప్రీం నేత హసన్ నాసరల్లా తో పాటు మరో 7 గురు హిజ్బోల్లా టాప్ కమాండర్లు బీరూట్ లోని బంకర్లలో సమావేశమై ఉండగా వరుస మిసైల్ దాడితో ఇజ్రాయెల్ హత్య చేసింది. ఈ హత్యలకు ప్రతీకారంగా ఇరాన్ ఇజ్రాయెల్ రాజధాని…

గాజా: నేను చాలా మంది విగత బాలల లోపలి భాగాల్ని చూశాను!

యధాతధ రాజకీయాల్ని, సెంట్రిస్ట్ ఇంక్రిమెంటలిజాన్ని భరించే ఓపిక కలిగి ఉండటానికి, నేనిప్పటికే చాలా మంది విగత బాలల లోపలి భాగాల్ని చూశాను. నవంబర్ లో అమెరికన్లు ఎవర్ని ఎన్నుకుంటారో పట్టించుకోటానికి నేనిప్పటికే చాలా మంది విగత బాలల లోపలి భాగాల్ని చూశాను. డెమొక్రాట్లకు ఓటు వేస్తే “అపాయం తగ్గుతుందన్న” ఐడియాను సీరియస్ గా తీసుకోటానికి నేనిప్పటికే చాలా మంది విగత బాలల లోపలి భాగాల్ని చూశాను. ఇజ్రాయెల్, దాని పశ్చిమ మిత్ర దేశాల్ని ఎప్పటికైనా క్షమించటానికి నేనిప్పటికే…

హర్యానాలో అనూహ్య ఫలితాలు!

హర్యానా రాష్ట్ర ఎన్నికల ఫలితాలు ప్రస్తుతం ఒక మాయగా కనిపిస్తున్నాయి. దాదాపు ఎగ్జిట్ పోల్ నిర్వహించిన ప్రతి ఒక్క సంస్థా ఎలాంటి అనుమానం లేకుండా కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టి తీరుతుందని ఢంకా బజాయించాయి. తీరా ఫలితాలు చూస్తే సరిగ్గా ఎగ్జిట్ ఫోల్ ఫలితాలకు పూర్తి భిన్నంగా వాస్తవ ఫలితాలు ఉండటం ఒక అర్ధం కానీ వ్యవహారంగా ఉండిపోయింది. సాయంత్రం 4 గంటల 4 నిమిషాల సమయానికి బిజెపి 17 స్థానాలు గెలుచుకోగా 33 స్థానాల్లో లీడింగ్…

మార్కెట్లో ‘బై చైనా, సెల్ ఇండియా’ సెంటిమెంట్!

గోల్డెన్ వీక్ సెలవులు (అక్టోబర్ 1 నుండి 7 వరకు) ముగిసిన అనంతరం మంగళవారం చైనా స్టాక్ మార్కెట్లు వ్యాపారం నిమిత్తం తెరుచుకోనున్న నేపధ్యంలో మార్కెట్లో “బై చైనా, సెల్ ఇండియా” సెంటిమెంట్ జోరందుకుంది. గత 6 ట్రేడింగ్ రోజుల్లో 30 షేర్ల ఇండియన్ స్టాక్ మార్కెట్ సెన్సెక్స్ ఏకంగా 4,786 పాయింట్లు కోల్పోవడంతో బేర్ సెంటిమెంట్ బలంగా ఉన్నదనీ ఎఫ్.ఐ.ఐ లు ఇండియన్ షేర్ మార్కెట్ల నుండి చైనా స్టాక్ మార్కెట్ కు తరలిపోయేందుకు సిద్ధంగా…

తుఫాను సాయం ప్లీజ్ -ఆగ్నేయ అమెరికా!

– ఆగ్నేయ అమెరికన్లు: హెలెనే తుఫాను సాయం చేయండి, ప్లీజ్! వాషింగ్టన్: సారీ, ఇజ్రాయెలీ యుద్ధ పిపాసులకు మద్దతుగా మరిన్ని వేల మంది అమెరికా సైన్యాన్ని పంపించాలనా మీరు అడుగుతున్నది? ఆగ్నేయ అమెరికన్లు: కాదు మహా ప్రభో! హెలెనే హరికేన్ వల్ల తీవ్రంగా దెబ్బ తిన్నాం, కాస్త సాయం చేయమని అడుగుతున్నాం. వాషింగ్టన్: ఒకే. మీకు పరిస్ధితి ఏమీ అర్ధం అవుతున్నట్లు లేదు. కానీ మన సైన్యం ఇప్పటికే ఇజ్రాయెల్ చేస్తున్న మారణకాండలో ఒక చెయ్యి వేసేందుకు…

మీ ఇష్టారీతిన జోక్యం చేసుకుంటే ప్రజాస్వామ్యం ఉంటుందా? -సుప్రీం కోర్టు

బిజెపి నేతృత్వం లోని కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఏఏపి ఆధ్వర్యం లోని ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వాన్ని, మునిసిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ ని ఇబ్బంది పెట్టడమే పనిగా పెట్టుకున్నట్లు కనిపిస్తున్న ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనాను ఈ రోజు సుప్రీం కోర్టు ధర్మాసనం తీవ్రంగా అభిశంచింది. (అభిశంసన అన్న పదాన్ని టెక్నికల్ అర్ధంలో రాయలేదు. పాఠకులు గమనించగలరు.) మునిసిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ (ఎంసిడి) కి చెందిన స్టాండింగ్ కమిటీ లో 6వ…

లడ్డు వివాదం: సి.బి.ఐ పర్యవేక్షణలో స్వతంత్ర సిట్

తిరుపతి లడ్డు వివాదం పైన సుప్రీం కోర్టు స్వతంత్ర స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం చేత దర్యాప్తు జరిపించాలని ఆదేశించింది. లడ్డు వివాదం పైన ఎలాంటి కమిటీ వేయాలో కేంద్ర ప్రభుత్వాన్ని అడిగి తెలుసుకొమ్మని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను గత హియరింగ్ సందర్భంగా సుప్రీం కోర్టు ద్విసభ్య ధర్మాసనం, కోరిన సంగతి తెలిసిందే. అక్టోబర్ 4 తేదీన (ఈ రోజు) ధర్మాసనం తిరిగి విచారణ జరిపింది. సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ఓ పక్క రాష్ట్ర ప్రభుత్వం…