రష్యన్ పి‌ఎం‌సిలు: సబ్ సహారన్ ఆఫ్రికా దేశాల్లో తిష్ట -3

సబ్-సహారా ఆఫ్రికా సబ్ సహారన్ ఆఫ్రికా దేశాలు సంపద్వంతమైన ఖనిజ వనరులకు నిలయం. సహారా ఎడారికి దక్షిణాన ఉన్న దేశాలను సబ్-సహారా ఆఫ్రికా గా పరిగణిస్తారు. ఉత్తరాన సహారా ఎడారి దేశాలు, దక్షిణాన అడవులతో నిండిన ఇతర ఆఫ్రికా దేశాలకు మధ్య అటు పూర్తిగా ఎడారి కాకుండా, ఇటు పూర్తిగా పంటలు సమృద్ధిగా పండేందుకు వీలు లేకుండా ఉన్న ప్రాంతాన్ని సహేలి ప్రాంతం అంటారు. పశ్చిమాన సెనెగల్ నుండి తూర్పున సోమాలియా వరకు ఒక బెల్ట్ లాగా…

విస్తరిస్తున్న రష్యన్ ప్రైవేట్ మిలట్రీ కార్యకలాపాలు -2

అనధికారికంగానే అయినా రష్యన్ పి‌ఎం‌సి లు రష్యాకు చెందిన పలు వ్యూహాత్మక, ఆర్ధిక, రాజకీయ లక్ష్యాలను నెరవేరుస్తున్న సంగతి కాదనలేనిది. ఈ ప్రయోజనాలు: 1. విదేశీ విధానం:. పి‌ఎం‌సిల ద్వారా రష్యా ప్రభావం విస్తరిస్తోంది. ముఖ్యంగా భద్రతా రంగంలో. దానితో పాటు వివిధ దేశాల ప్రభుత్వాలతో పాటు ప్రభుత్వేతర శక్తులతోనూ స్నేహ సంబంధాలు పెంపొందుతున్నాయి. 2. మిలట్రీ ప్రయోజనాలు: ప్రత్యేక బలగాల (స్పెషల్ ఫోర్సెస్) ద్వారా శిక్షణ పొందిన ప్రైవేటు బలగాలు ప్రత్యేకమైన నైపుణ్యం, సామర్ధ్యం కలిగి…

విస్తరిస్తున్న రష్యన్ ప్రైవేట్ మిలట్రీ కార్యకలాపాలు

“నువ్వు రాళ్ళు విసిరితే చుట్టూ గోడ కట్టుకుంటా…” అంటూ సాగుతుంది ఒక కొటేషన్. ఉక్రెయిన్ సంక్షోభం దరిమిలా, అమెరికా ప్రపంచాధిపత్యాన్ని ఎదుర్కొనే క్రమంలో రష్యా ఈ సూత్రాన్నే పాటించింది. అమెరికా విసిరిన వ్యూహాన్ని ప్రయోగించి తన వరకు గోడ కట్టుకోవడంతో పరిమితం కాకుండా తన సహాయం అర్ధించిన ఇతర దేశాలకు కూడా గోడలు కట్టి ఇస్తోంది రష్యా. పనిలో పనిగా తన ప్రభావాన్ని ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాల్లో సాపేక్షికంగా గణనీయంగా విస్తరించుకుంటోంది. 2014 వరకు…

కరోనా వైరస్ బయోవెపన్ కాదు -అమెరికా ఇంటలిజెన్స్

కరోనా వైరస్ ను చైనా ఉద్దేశ్యపూర్వకంగా తయారు చేసిన జీవాయుధం అని చెప్పడం పూర్తిగా అశాస్త్రీయం (unscientific) అని అమెరికాకు చెందిన 17 గూఢచార సంస్ధలు నిర్ధారించాయి. కరోనా వైరస్ జీవాయుధం అని చెప్పేందుకు తగిన శాస్త్రీయ ఆధారాలు లేవని, అటువంటి వాదనలు శాస్త్రీయ పరీక్షలకు నిలబడవని అమెరికా ఇంటలిజెన్స్ ఏజన్సీలు స్పష్టం చేశాయి. అధ్యక్షుడు జో బైడెన్ ఆదేశాల మేరకు అమెరికా గూఢచార ఏజన్సీలు పరిశోధన చేసి నివేదిక సమర్పించాయి. సదరు నివేదిక సారాంశాన్ని గత…

ఫ్రాన్స్-బ్రిటన్ మధ్య తీవ్రమైన చేపల తగాదా: ఆకస్ పుణ్యం?

ఆస్ట్రేలియా, యూ‌కే, అమెరికాలు కలిసి ఇండో-పసిఫిక్ ప్రాంతం లక్ష్యంగా ‘ఆకస్’ కూటమి ఏర్పడిన నేపధ్యంలో ఫ్రెంచ్, బ్రిటిష్ దేశాల మధ్య చేపల వేట తగాదా మరింత తీవ్రం అయింది. డిసెంబర్ 31, 2020 నాటితో బ్రెగ్జిట్ ప్రక్రియ పూర్తయినప్పటి నుండి అడపా దడపా ఇరు దేశాల ఫిషింగ్ బోట్లు చేపల వేట హక్కుల విషయమై తగాదా పడుతూ వచ్చాయి. నేడు ఆ తగాదా ఫ్రెంచి ప్రభుత్వమే ప్రత్యక్ష చర్య తీసుకునే వరకూ వెళ్లింది. ఆకస్ ఏర్పాటు ఫలితంగా…

మీ దాష్టీకం యూ‌పిలో చెల్లవచ్చేమో, ఇక్కడ కాదు -యూ‌పి పోలీసుల్తో ఢిల్లీ హై కోర్టు

ఉత్తర ప్రదేశ్ పోలీసులకి ఢిల్లీ హై కోర్టు గడ్డి పెట్టింది. మతాంతర వివాహాలకు వ్యతిరేకంగా అత్యంత అప్రజాస్వామిక చట్టం చేయడమే కాకుండా సదరు చట్టం పేరుతో విచక్షణారహితంగా వివాహితులను వారి కుటుంబ సభ్యులను అరెస్టులు చేసి జైళ్ళలో తోస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్న యూ‌పి ప్రభుత్వానికి కూడా ఢిల్లీ హై కోర్టు పరోక్షంగా జ్ఞాన బోధ చేసింది. “ఇక్కడ ఢిల్లీలో మీ చర్యలు చెల్లబోవు. ఎలాంటి చట్ట వ్యతిరేక చర్యలైనా సరే చెల్లవు. ఢిల్లీ నుండి జనాన్ని…

ఉత్తరఖండ్ వరదలు: పాఠాలు నేర్చేదే లేదు!

ఉత్తర ఖండ్ లో 4 రోజుల పాటు కురిసిన అతి భారీ వర్షాలకు నదులు, వాగులు పొంగి పోర్లాయి. ఎప్పటిలాగే పల్లెలు, పట్టణాలు తేడా లేకుండా నీట మునిగాయి. వంతెనలు తెగిపోయాయి. కొన్ని చోట్ల అవి కూలిపోయి కొట్టుకుపోయాయి. కడపటి వార్తలు అందేసరికి  52 మంది మరణించారు. కొండల మీద నుండి రాళ్ళు, భారీ మట్టి పెళ్ళలు జారిపడి రోడ్లను కప్పేసాయి. కొండ చరియలు విరిగిపడి రోడ్డు మార్గాలను తెంపేశాయి. ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి వరదల…

గల్ఫ్ లో భారత ప్రయోజనాలకు ‘అబ్రహాం ఎకార్డ్స్’ గండం!

(రెండవ భాగం తర్వాత….) సైప్రస్ సమావేశంలో పాల్గొన్న నాలుగు దేశాలకూ టర్కీతో విభేదాలు ఉన్నాయి. యూ‌ఏ‌ఈ, ఇజ్రాయెల్ పాల్గొన్న ప్రతి సమావేశంలో ఇరాన్ గురించి తప్పనిసరిగా చర్చ జరుగుతుంది. అయితే ఇటీవల కాలంలో టర్కీ విస్తరణ వాదంతో దూకుడుగా వ్యవహరిస్తుండడంతో ఇవి టర్కీతో మరింత జాగ్రత్త పడుతున్నాయి. ఇక టర్కీ దూకుడు అమెరికాకు అసలే గిట్టదు. సైనిక కుట్ర ద్వారా ఎర్దోగన్ ను పదవీచ్యుతుడిని చేసేందుకు జులై 2016లో విఫలయత్నం చేసింది. రష్యా గూఢచార సమాచారంతో ఎర్డోగన్…

అబ్రహాం ఎకార్డ్స్: పశ్చిమాసియాలో నూతన భాగస్వామ్యాలకు తెరతీసిన అమెరికా -2

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆతిధ్యంలో సెప్టెంబర్ 15, 2020 తేదీన నూతన అరబ్-యూదు శాంతి ఒప్పందానికి వైట్ హౌస్ వేదిక అయింది. అరబ్బు దేశాలు యూ‌ఏ‌ఈ, బహ్రయిన్ లు యూదు దేశం ఇజ్రాయెల్ తో శాంతి ఒప్పందం చేసుకున్నాయి. ఈ ఒప్పందం ‘అబ్రహాం ఎకార్డ్స్’ పేరుతో పిలవబడుతోంది. ఇది దాదాపు 26 సంవత్సరాల తర్వాత కుదిరిన మొట్టమొదటి అరబ్-యూదు శాంతి ఒప్పందం. ఇది ఎకార్డ్ (అంగీకారం), అగ్రిమెంట్ (ఒప్పందం) కాదు. దీని ప్రకారం యూ‌ఏ‌ఈ,…

ఆసియాలో ఇండియా సభ్య దేశంగా మరో ‘క్వాడ్’ కూటమి

చైనా, రష్యాలకు వ్యతిరేకంగా… ముఖ్యంగా చైనాకు వ్యతిరేకంగా అమెరికా ఏర్పాటు చేస్తున్న వ్యూహాత్మక కూటముల సంఖ్య పెరుగుతూ పోతోంది. ఇండో-పసిఫిక్ ప్రాంతం లోని ఇండియా, ఆస్ట్రేలియా, జపాన్ లతో కలిపి ‘క్వాడ్’ కూటమిని తయారు చేసిన అమెరికా ఇప్పుడు పశ్చిమాసియా కేంద్రంగా మరో క్వాడ్ కూటమిని ఏర్పాటు చేసింది. ఇందులో అమెరికా, ఇండియాలతో పాటు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూ‌ఏ‌ఈ), ఇజ్రాయెల్ లు సభ్య దేశాలుగా ఉన్నాయి. గత సంవత్సరం సెప్టెంబర్ లో అమెరికా ఆశీస్సులతో వైట్…

అది మిసైల్ కాదు, స్పేస్ వెహికల్ -చైనా

హైపర్ సోనిక్ మిసైల్ ను తాము పరీక్షించామంటూ వచ్చిన వార్తలు నిజం కాదని చైనా ప్రకటించింది. “అది అంతరిక్ష వాహకం, మిసైల్ కాదు” అని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి ఝావో లిజియాన్ సోమవారం విలేఖరుల ప్రశ్నలకు బదులు ఇస్తూ చెప్పాడు. తాము హైపర్ సోనిక్ వాహకాన్ని ప్రయోగించి పరీక్షించామే తప్ప హైపర్ సోనిక్ మిసైల్ ని పరీక్షించలేదని ఝావో వివరించాడు. “అది కూడా ఫైనాన్షియల్ టైమ్స్ చెప్పినట్లు ఆగస్టులో కాదు, జులైలో ఆ పరీక్ష జరిగింది”…

హైపర్ సోనిక్ మిసైల్: అమెరికాను మించిపోయిన చైనా

హైపర్ సోనిక్ మిసైల్ తయారీలో చైనా అనూహ్య రీతిలో పురోగతి సాధిస్తున్న వార్తలు అమెరికాకు చెమటలు పట్టిస్తున్నాయి. మొట్టమొదటి హైపర్ సోనిక్ మిసైల్ పరీక్షను చైనా విజయవంతంగా పరీక్షించిన సంగతి వెల్లడి అయింది. గత ఆగస్టు నెలలో జరిగిన ఈ పరీక్ష సంగతిని చైనా రహస్యంగా ఉంచడంతో అది ఎవరికీ తెలియలేదు. చైనా జరిపిన హైపర్ సోనిక్ మిసైల్ అణు బాంబులను మోసుకెళ్లే సామర్ధ్యం కలిగినది. చైనా ఈ పరిజ్ఞానం కోసం ప్రయత్నిస్తున్న సంగతి తెలిసినప్పటికీ, ఆ…

రక్షణ మంత్రి గారూ మీరు చెప్పింది నిజం కాదు. ఇదిగో సాక్ష్యం!

భారత రక్షణ మంత్రి రాజ్ నాధ్ సింగ్ ఆర్‌ఎస్‌ఎస్-బి‌జే‌పి సంస్ధల తరపున, జరిగిన చరిత్రను తిరగ రాసే ప్రయత్నం చేశారు. ప్రధాని మోడి మంత్రివర్గంలో కాస్తంత మౌనంగా, ఆర్‌ఎస్‌ఎస్ భావజాల ప్రచారాలకు, అబద్ధపు ఉల్లేఖనలకు దూరంగా ఉన్నట్లు కనిపించే ఆయన తాను సెపరేట్ కాదనీ, ఆ తానులో ముక్కనేనని గుర్తు చేశారు. ఆర్‌ఎస్‌ఎస్ పితామహుల్లో ఒకరైన వీర సావర్కార్ భారత దేశాన్ని బ్రిటిష్ పాలన నుండి విముక్తి చేయడానికి కృషి చేసిన తొలి తరం యువకుల్లో ఒకరు.…

ప్రశ్న: గ్లోబల్ సౌత్, గ్లోబల్ నార్త్ గురించి వివరించండి

ప్రశ్న (పేరు ఇవ్వలేదు): క్యూబా వ్యాక్సిన్ ఆర్టికల్ లో గ్లోబల్ సౌత్ అన్న పదజాలం వాడారు. భూమధ్య రేఖకు దిగువ దేశాలు అంటూనే ‘కొన్ని పరిమితులతో’ అన్నారు. కాస్త వివరించగలరు. జవాబు: ఈ ప్రశ్నకు జవాబు తెలుసుకోవడం చాలా అవసరం. ప్రపంచ స్ధాయి పరిణామాలు, ముఖ్యంగా భౌగోళిక రాజకీయార్ధిక పరిణామాలు చోటు చేసుకున్నప్పుడు ఆంగ్ల పత్రికలు తరచుగా గ్లోబల్ నార్త్, గ్లోబల్ సౌత్ అన్న పదజాలాల్ని ఉపయోగిస్తాయి. ఈ పేర్లు సూచించే విధంగా ఉత్తరార్ధ గోళంలో ఉన్న…

క్యూబా వాక్సిన్ రెడీ: ఫార్మా కంపెనీల గుండెల్లో గుబులు

కోవిడ్ 19 (సార్స్-కోవ్-2) వ్యాధి నిర్మూలనకై పశ్చిమ దేశాలకు చెందిన బడా కార్పొరేట్ ఫార్మా కంపెనీలు అనేక వ్యాక్సిన్ లు తయారు చేశాయి. అవసరమైన 3 దశల పరీక్షలు జరిపినట్లు చెప్పాయి. ఇక వైరస్ చచ్చినట్లే అని నమ్మబలికాయి. ఆ మేరకు అమెరికా, బ్రిటన్, ఆస్ట్రియా, జర్మనీ తదితర ధనిక దేశాల అధిపతులు కూడా తమ తమ కంపెనీల తరపున సగర్వ ప్రకటనలు జారీ చేశారు. కానీ వైరస్ ఇంకా విస్తరిస్తూనే ఉన్నదని గణాంకాలు చెబుతున్నాయి. తయారైన…