ఇరాన్ యుద్ధం, సీజ్ ఫైర్: నోట్స్ & అప్ డేట్స్ 5


ఇరాన్ ప్రతినిధి బృందం ఇస్లామాబాద్ కు వచ్చిన విమానం లోపలి దృశ్యం

09/04/2026

  • చర్చలకు ఒప్పందానికి వచ్చామని అమెరికా ప్రకటించిన తర్వాత కూడా ఇజ్రాయెల్, ఇరాన్ పైన మిసైల్ దాడులు కొనసాగించగా ఈ దాడుల్లో అతి ముఖ్యమైన ఇరానియన్ అని శాస్త్రవేత్త ను ఇజ్రాయెల్ చంపేసింది. అంటే సీజ్ ఫైర్ ఒప్పందం జరిగిన తర్వాత క్షణాల్లో సైంటిస్టు ఆచూకీ ఇజ్రాయెల్ కు లభ్యమై వెంటనే ఆయన్ని చంపటానికి వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుని ఉండొచ్చు. లేదా సీజ్ ఫైర్ ఒప్పందాన్ని, చర్చలను విఫలం చేసే లక్ష్యంతో ఇజ్రాయెల్ ఈ దాడి చేసి ఉండవచ్చు. ఇజ్రాయెల్ దాడులు కొనసాగే అవకాశం ఎక్కువగా ఉన్నది.
  • ఒప్పందం ప్రకటన తర్వాత కూడా ఇరాన్ దాడి చేసిందని అందుకే ప్రతి దాడి చేశామని ఇజ్రాయెల్ బొంకింది. ఇరు దేశాలు బాంబు దాడులు ఆపాలని ట్రంప్ కోరుతూ ముఖ్యంగా ఇజ్రాయిల్ అదుపులో ఉండాలని కోరాడు. “హేయ్, ఇజ్రాయెల్! వెంటనే బాంబింగ్ ఆపేయ్. నీ విమానాల్ని వెనక్కి రమ్మని చెప్పు!” అని ట్రంప్ తన సోషల్ మీడియా ట్రూత్ సోషల్ లో పోస్ట్ చేశాడు.
  • సీజ్ ఫైర్ ఒప్పందాల తర్వాతకూడా దాడులు కొనసాగించటం ఇజ్రాయెల్ కు అలవాటే. గాజా పై అనేకసార్లు దాడులు చేసినప్పుడు, ఆ తర్వాత కుదిరిన సీజ్ ఫైర్ ఒప్పందాలను ఇజ్రాయెల్ ఎన్నడూ గౌరవించలేదు. గాజా సీజ్ ఫైర్ ఒప్పందం జరిగినా, అది ఇంకా గాజా పై అడపా దడపా దాడులు చేస్తూనే ఉంది. హిజ్బొల్లా పైన దాడుల విషయంలో కూడా ఇజ్రాయెల్ పదే పదే ఒప్పందాలను ఉల్లంఘించటం జరిగింది. ఒకోసారి ఇజ్రాయెల్ అమెరికా కంటే పెద్ద రోగ్ స్టేట్ అనిపించేలా ఆ దేశ ప్రవర్తన ఉంటుంది. పాలస్తీనా ప్రజల ప్రాణాలు అంటే దానికి ఏ మాత్రం లెక్కలేదు. ఇజ్రాయెల్ ప్రజల్లో మెజారిటీ గాజా, వెస్ట్ బ్యాంక్ లలో పాలస్తీనా అరబ్బులు అందరినీ సమూలంగా చంపేయాలని భావిస్తారని అనేక సర్వేల్లో తెలిసింది.
  • 10 అంశాలను చూస్తే గనక ఒప్పందానికి ట్రంప్, ఇజ్రాయెల్ లు ఎంతగా మొఖం వాచి ఉన్నాయో తెలుస్తుంది. ఇరాన్ దాడుల విస్తృతి, తీవ్రత అవి ఊహించ లేదని అర్ధం అవుతుంది. ఇది ఇరాన్ 40 ఏళ్ల ఓపికకు, డిటర్మినేషన్ కు, ఆధిపత్య వ్యతిరేక నిబద్ధతకు, రాజీ లేని తత్వానికి తార్కాణం.
  • ఇజ్రాయిల్, లెబనాన్ పై దాడులు కొనసాగిస్తోంది.
  • అసోసియేటెడ్ ప్రెస్ (AP) వార్తా సంస్థ ప్రకారం, ఇరాన్ తయారు చేసిన 10 పాయింట్ల ఒప్పందం ఫైనల్. ట్రంప్ మాటలు అమెరికన్ ప్రజలను ఉద్దేశించిన వాగుడు గా కనిపిస్తోంది. స్పష్టత రావటానికి ఒకటి రెండు రోజులు పట్టొచ్చు.
  • హార్ముజ్ జల సంధి గుండా జరిగే నౌకల ట్రాఫిక్ నుండి టోల్ వసూలు చేసే అవకాశం ఇరాన్ కి సీజ్ ఫైర్ ఒప్పందం కల్పించింది అని AP చెబుతోంది. ఈ ట్యాక్స్ ద్వారా ఇరాన్ పునర్నిర్మాణ ఖర్చులు సమీకరించుకోవాలని ఒప్పందం ఇచ్చిన అవకాశం.
  • సీజ్ ఫైర్ మొదలు కాక ముందే విఫలం అయినట్లు బలమైన సూచనలు కనిపిస్తున్నాయి. చర్చలు మొదలు కాక ముందే పది అంశాల్లో మూడింటిని ట్రంప్, ఇజ్రాయెల్ ఉల్లంఘించారని ఇరాన్ ఆరోపించింది. ఈ పరిస్థితిలో సీజ్ ఫైర్ “unreasonable” అని స్పష్టం చేసింది. ఉల్లంఘనలు:
    1 లెబనాన్ పై దాడులు కొనసాగుతున్నాయి.
    2 ఇరాన్ గగనతలం లోకి శత్రువు డ్రోన్లు చొచ్చుకు వస్తున్నాయి.
    3 యురేనియం శుద్ధి చేసేందుకు ఇరాన్ కి ఉన్న హక్కును అమెరికా, ఇజ్రాయెల్ లు నిరాకరించాయి
  • లెబనాన్ పై ఇజ్రాయెల్ చేసిన దాడిలో 180 మందికి పైగా ప్రజలు, స్త్రీలు పిల్లలతో సహా, చనిపోయారు.
  • ఫ్రాన్స్, యు కె, చైనాలు ఇజ్రాయిల్ దాడులను ఖండించాయి.
  • నిజమైన ఒప్పందం జరిగే వరకు ఇరాన్ సమీపంలో ఉన్న అమెరికా బలగాలు, యుద్ధ సామాగ్రి అక్కడే కొనసాగుతాయని ట్రంప్ ప్రకటించాడు. “అమెరికాకి చెందిన అన్ని యుద్ధ నౌకలు, విమానాలు, మిలట్రీ సైనికులు, అదనపు మందుగుండు సామాగ్రి, ఆయుధాలు మొదలైనవి అన్నీ అక్కడే కొనసాగుతాయి. ఇప్పటికే బలహీనపడిన శత్రువు ను ఇంకా బలహీన పరిచేందుకు, యుద్ధ నిర్వహణకు అవసరమైనవన్నీ నిజమైన ఒప్పందం కుదిరి దానిని అమలు చేసే వరకు ఇరాన్ చుట్టుపక్కల ఉండటం కొనసాగుతుంది” అని డొనాల్డ్ ట్రంప్ ప్రకటించాడు.
  • సీజ్ ఫైర్ ఒప్పందాన్ని విఫలం చేసే లక్ష్యం తోనే ఇజ్రాయెల్ లెబనాన్ పై దాడులు కొనసాగుతాయని చెబుతూ దాడులు చేస్తున్నదని విశ్లేషకులు భావిస్తున్నారు. ఒప్పందం కుదిరే ముందు తమ అభిప్రాయం ఎవరూ కోరలేదని ఇజ్రాయెల్ ఆరోపించింది.
  • నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రట్టె తో ట్రంప్ సమావేశం జరిగింది. సమావేశానికి ముందు నాటో నుండి అమెరికా వైదొలగే అంశాన్ని పరిశీలిస్తున్నామని ట్రంప్ చెప్పాడు. సమావేశం తర్వాత కూడా వెనక్కి తగ్గలేదు. “మాకు అవసరం వచ్చినపుడు నాటో దేశాలు మాకు ఎలాంటి సాయం చెయ్యలేదు. మళ్ళీ మాకు భవిష్యత్ లు వారి అవసరం వచ్చినా ఉండబోరు” అని ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశాడు.

10/01/2026

  • ఫైనాన్షియల్ టైమ్స్ పత్రిక ఓ ముఖ్య విషయం ను వెల్లడి చేసింది. సీజ్ ఫైర్ కోసం అమెరికా కొన్ని వారాల ముందు నుండే, మార్చి మధ్య నుండే, ఇరాన్ ను కోరుతోంది. పాకిస్తాన్ ద్వారా వర్తమానం పంపుతూ వస్తోంది. కానీ ఇరాన్ ట్రంప్ ప్రయత్నాలను తిప్పి కొడుతూ వచ్చింది. ఇరాన్ అధ్యక్షుడు సీజ్ ఫైర్ కి ఆలోచిస్తున్నా కూడా ఐ ఆర్ జి సి ఒప్పుకోలేదు. తాను ఇచ్చిన అల్టిమేటం టైం ముగుస్తుండటంతో ట్రంప్, పాకిస్తాన్ ప్రధానికి కబురు చేశాడు. అంతకు ముందే తాను తిరస్కరించిన ఇరాన్ ప్రతిపాదనలకు చర్చల పునాదిగా ఒకే చెప్పాడు. అంతే గానీ పాకిస్తాన్ ప్రధాని, మిలట్రీ నేత ట్రంప్ కి విజ్ఞప్తి చేయటం జరగ లేదు. పాకిస్తాన్ నేతలకు అంత సీన్ కూడా లేదు. యుద్ధం కొనసాగించి పరిస్థితి లో, తన వాగాదంబరాన్ని వార్నింగ్ లను అమలు చేయలేక పాకిస్తాన్ ను అడ్డం పెట్టుకున్నాడు.
  • అప్పటికి కూడా ఐ ఆర్ జి సి, సీజ్ ఫైర్ కి ఒప్పుకోలేదు. చివరికి అయితుల్లా ఖమెనీ మోజ్తాబా సీజ్ ఫైర్ కి అవకాశం ఇద్దామని ఐ ఆర్ జి సి కి నచ్చజెప్పి ఒప్పించాడు.
  • లెబనాన్ తో నేరుగా చర్చలు జరిపేందుకు సుముఖంగా ఉన్నానని ఇజ్రాయెల్ ప్రధాని నేతన్యాహు ప్రకటించాడు. లెబనాన్ తో అంటే లెబనాన్ ప్రభుత్వంతో అని అర్ధం. సౌత్ లెబనాన్ పైన పట్టు కలిగి ఉన్న హిజ్బొల్లా తో కాదు.
  • హిజ్బోల్లా ను నిరాయుధం చేసే విషయమై లెబనాన్ ప్రభుత్వంతో చర్చిస్తామని ఇజ్రాయెల్ ప్రధాని అన్నాడు. హిజ్బొల్లాను నిరాయుద్ధం చేసే కుట్రలను నెతన్యాహు కొన్ని నెలల క్రితమే మొదలు పెట్టాడు. అందుకు లెబనాన్ ప్రభుత్వం లోని క్రిష్టియన్ ఫ్యాక్షన్ ను లోపాయకారీగా సిద్ధం చేశాడు కూడా. అందులో భాగం గానే సౌత్ లెబనాన్ పైన ఇరాన్ పై దాడికి ముందే దాడులు చేస్తున్నది ఇజ్రాయెల్. హిజ్బోల్లా ను నిరాయిధం చెయ్యమని, తిరగబడండి అని హెలికాప్టర్లలో లక్షల కరపత్రాలు వెదజల్లించాడు. కానీ సౌత్ లెబనాన్ లో ప్రతి వ్యక్తి హిజ్బోల్లా సైనికుడే. ప్రతి యిల్లు వారికి స్థావరమే. లెబనాన్ సైన్యం పైన కూడా ఇజ్రాయెల్ మిసైల్ దాడులు చెయ్యటంతో వారిని కాపాడే పని మళ్ళీ హిజ్బోల్లా యే చేపట్టాల్సి వచ్చింది. అలాంటి హిజ్బోల్లా ను నిరాయుధం చెయ్యటం ఇజ్రాయెల్ వల్ల కాని పని.
  • లెబనాన్ ప్రభుత్వం లో మూడు ఫ్యాక్షన్ లు ఉంటాయి. సున్నీ ఫ్యాక్షన్, క్రిష్టియన్ ఫ్యాక్షన్, షియా ఫ్యాక్షన్ సమానంగా అధికారం పంచుకోవాలని 1980 లలో ఒప్పందం జరిగింది. అది ఇంకా అమలులో ఉంది. క్రిష్టియన్ ఫ్యాక్షన్ అమెరికా ఐరోపా అదుపులో ఉంటే, సున్నీ ఫ్యాక్షన్ సౌదీ అదుపులో వెరసి అమెరికా – యూరాప్ అదుపులో ఉంటుంది. హిజ్బోల్లా, ఇరాన్ అదుపు కాదు గానీ, భాగస్వామి గా ఉంటుంది. ఇరాన్ డైరెక్షన్ మాత్రమే ఇస్తుంది. నిర్ణయాలు హిజ్బోల్లా స్వయంగా చేసుకుంటుంది.
  • లెబనాన్ లో మూడు మతాల మధ్య అధికారాన్ని సమానంగా పంచుకోవాలన్న ఒప్పందం 1980 ల నాటి ఇజ్రాయెల్-హిజ్బొల్లా యుద్ధం అనంతరం కుదిరింది. మెరోనైట్ క్రిస్టియన్ లెబనాన్ అధ్యక్షుడుగా ఉంటాడు. సున్నీ ఇస్లాం ప్రతినిధి లెబనాన్ ప్రధాన మంత్రిగా ఉంటాడు. షియా ముస్లింల ప్రతినిధి పార్లమెంటు స్పీకర్ గా ఉంటాడు. అంటే హిజ్బొల్లా ప్రతినిధి పార్లమెంటు స్పీకర్ గా ఉంటాడు.

11/04/2026

  • కతార్, ఇంకా ఇతర చోట్ల ఉన్న బ్యాంకుల్లో ఆంక్షల్లో భాగంగా స్తంభింప చేయబడ్డ ఇరానియన్ ఆస్తులను (పెట్టుబడి నిల్వలు) విడుదల చేసేందుకు అమెరికా అంగీకారం తెలిపిందని ఇరాన్ ప్రకటించింది. యుద్ధానికి ముందైతే ఇది ఊహించలేని చర్య. యుద్ధం ఇరాన్ అంతర్జాతీయ శక్తిని పెంచింది.
  • యుద్ధ కాలంలో ఇరాన్ చమురు ఆదాయం మామూలు కంటే రెట్టింపు అయింది. చిత్రం ఏమిటంటే యుద్ధం వల్ల చమురు రేటు బ్యారెల్ కు 100 డాలర్లు దాటి అమెరికాలో కూడా ఇన్ఫ్లేషన్ పెరిగే ప్రమాదం రావటంతో, అమెరికా, ధరలు తగ్గటానికి ఇరాన్ చమురు పై ఉన్న ఆంక్షలను కూడా ఎత్తివేయాల్సి వచ్చింది.
  • చర్చల కోసం అమెరికా ప్రతినిధి బృందం ఉపాధ్యక్షుడు జె డి వాన్స్ నాయకత్వంలో ఇస్లామాబాద్ కి చేరుకున్నట్లు తెలుస్తున్నది. ఇరాన్ కి యురేనియం శుద్ధి హక్కు నిరాకరిస్తే గనక ఇరాన్ బృందం చర్చలకు రాదని ఇరాన్, పాకిస్తాన్ కి కబురు పంపింది. ఇప్పుడు ఇరాన్ పరిస్థితి ఏమిటో తెలియాల్సి ఉంది.
  • సీజ్ ఫైర్ చర్చల ఒప్పందం లో భాగంగా హార్ముజ్ జలసంధి దాటే ప్రతి నౌకా ఇప్పుడు ఇరాన్ కి మిలియన్ డాలర్లు అది కూడా యువాన్ లలో చెల్లించాలి.
  • ఒక్క కతార్ బ్యాంకు లోనే ఇరాన్ డబ్బు 6 బిలియన్ డాలర్లు లాక్ అయి ఉంది. ఇది చర్చల షరతుగా విడుదల అవుతోంది.
  • ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్ బాగెర్ గాలిబాఫ్ నాయకత్వంలో ఇరాన్ డెలిగేషన్ ఇస్లామాబాద్ చేరింది. వారి విమానంలో ఫిబ్రవరి 28 దాడిలో చనిపోయిన 168 మంది ఇరానియన్ స్కూల్ పిల్లల ఫోటోలు, రక్తం మరకలు అంటిన స్కూల్ బ్యాగ్ లు, బూట్లు, తెల్ల పూలు, ఉంచారు.
  • ఇరాన్ డెలిగేషన్ ను తెచ్చిన విమానానికి మినాబ్ – 168 అని పేరు పెట్టారు. మినాబ్ అన్నది స్కూల్ పేరు.
  • చర్చలు సఫలం కావన్న అపనమ్మకంతో మేము ఈ చర్చల్లో పాల్గొంటున్నాము అని ఇరాన్ ఉపాధ్యక్షుడు స్పష్టం చేశాడు. రెండు ప్రతినిధి బృందాలు ప్రస్తుతం ఇస్లామాబాద్ లో ఉన్నాయి.

మినాబ్ స్కూల్ విద్యార్ధుల సమాధులు ఏరియల్ ఫోటో -ఎక్స్ నుండి

వ్యాఖ్యానించండి