
Netanyahu addressing U.S. Congress on July 24, 2024
అమెరికా తోక ఇజ్రాయెల్ అన్న సంగతి ఈ బ్లాగ్ లో చాలా సార్లు చెప్పుకున్నాం. అమెరికా తోకకి ఒక ప్రత్యేకత ఉంది. అమెరికాకి ఎంతయితే దుష్టబుద్ధితో కూడిన మెదడు ఉన్నదో దాని తోక ఇజ్రాయెల్ కి కూడా అంతే స్థాయి దుష్ట బుద్ధితో కూడిన మెదడు ఉండడం ఆ ప్రత్యేకత. ఒక్కోసారి అమెరికా తలలో ఉన్న మెదడు కంటే దాని తోకలో ఉన్న మెదడుకే ఎక్కువ దుష్టబుద్ధి ఉన్నట్లుగా అనిపిస్తుంది.
ఇంకో విధంగా చెప్పాలంటే అమెరికా తన తోక ఇజ్రాయెల్ ని ఆడిస్తున్నదా లేక ఆ తోకే అమెరికాని ఆడిస్తున్నదా అన్న అనుమానం కలుగుతుంది. అమెరికా లోని ఇజ్రాయెల్ లాబీ ఏ.ఐ.పి.ఏ.సి (అమెరికన్ ఇజ్రాయెల్ పబ్లిక్ ఎఫైర్స్ కమిటీ) అమెరికా సెనేట్ మరియు హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ లను ప్రభావితం చేసే లాబీల్లో అత్యంత శక్తివంతమైన లాబీ.
హాలీవుడ్ సినిమా దర్శకుల నుండి, అనేక అసత్య, అర్ధ సత్య వార్తలని సృష్టించి ప్రపంచం అంతటా ప్రచారం చేసే బడా కార్పొరేట్ మీడియా కంపెనీల నుండి బడా బడా ఫైనాన్స్ కార్పొరేట్ బ్యాంకుల వరకు అమెరికాలోని శక్తివంత మైన సంస్థలన్నీ ఇజ్రాయెలీయుల లేదా యూదుల ఆధిపత్యంలో ఉన్నాయి. ఇవన్నీ అమెరికన్ డీప్ స్టేట్ (రాజ్యం లోపల రాజ్యం అన్నమాట!) లో భాగం. ఈ డీప్ స్టేట్ అమెరికాలోని రెండు రాజకీయ పార్టీలని తన కంట్రోల్ లో ఉంచుకుంటుంది. తద్వారా అధ్యక్షుడు, హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్ స్పీకర్, సెనేట్ మెజారిటీ మైనారిటీ లీడర్లు అందరూ డీప్ స్టేట్ కంట్రోల్ లో ఉంటారు.
డీప్ స్టేట్ నియంత్రణలో ఉండేందుకు అంగీకరించకపోతే వాళ్ళు అధ్యక్షుడైనా లేక స్పీకర్ ఐనా లేదా ఇతర ప్రభుత్వ అధికారులు ఎవరైనా సరే వారికి మూడినట్లే. ఉదాహరణకి ఇజ్రాయెల్ అణు బాంబులని నిర్మించుకున్నదో లేదో (ఐఏఇఏ నిబంధనల ప్రకారమే) తెలుసుకునేందుకు ఆ దేశం లోని అణు రియాక్టర్లని, అణు కర్మాగారాలని తనిఖీ చేయాలని 1960లలో అధ్యక్షుడు జాన్ ఎఫ్. కెన్నడీ గట్టిగా పట్టుబట్టాడు. ఎవరు చెప్పినా వినలేదు. దానితో 1963లో ఆయన హత్యకు గురయ్యాడు. సి.ఐ.ఏ, మొస్సాద్ లు ఈ హత్యకు పధకం రచించి అమలు చేశాయన్నది ఇప్పుడు బహిరంగ రహస్యం.
ఇలా డీప్ స్టేట్ కంట్రోల్ లో ఉండడానికి డొనాల్డ్ ట్రంప్ కాస్త నిరాకరించాడు. అమెరికాకి ఏది మంచిదో అధ్యక్షుడిగా తాను నిర్ణయిస్తాను తప్ప మీ గోలేంటి మధ్యలో అని డీప్ స్టేట్ ని ఒక రకంగా నిలదీశాడు. ఇది డీప్ స్టేట్ కి సుతరామూ నచ్చలేదు. అందుకే డొనాల్డ్ ట్రంప్ పైన ఇటీవల హత్యా ప్రయత్నం జరిగింది. డొనాల్డ్ ట్రంప్ జరిపిన ఒక ఎన్నికల సభకు హాజరైన ట్రంప్ అభిమాని ఒకరు, ఒక ఆగంతకుడు స్నైపర్ తుపాకి పట్టుకుని ఒక భవనంలో ఉన్న సంగతి గమనించి అక్కడే ఉన్న ఇంటలిజెన్స్ పోలీసులకి చెప్పినా కూడా వాళ్ళు పట్టించుకోలేదు. ఆ స్నైపర్ కాల్పుల్లో ఒక బులెట్ ట్రంప్ చెవిని తాకుతూ దూసుకెళ్లడంతో ట్రంప్ అప్రమత్తమై కిందకి కూర్చోవడంతో బ్రతికి పోయాడు. చెవి గాయంతో బైటపడ్డాడు.

ఆ ఆగంతకుడు వరస బెట్టి 10 రౌండ్లు కాల్చాక ట్రంప్ సెక్యూరిటీగా ఉన్న ఎఫ్.బి.ఐ, ఇతర ఇంటలిజెన్స్ వేగులు వాడిపైన కాల్పులు జరిపి చంపేశారు. ఆ విధంగా కాల్పుల వెనుక ఎవరు ఉన్నదీ తెలియకుండా జాగ్రత్త పడ్డారు. కానీ రెండు రోజుల క్రితం ఒక వీడియో బైటికి వచ్చింది. ఎఫ్.బి.ఐ పోలీసులే సభా స్థలి వద్ద ఒక పైప్ బాంబు అమర్చడాన్ని ఆ వీడియోలో బైట పడింది. ఇప్పుడు ఈ వీడియో గురించిన వార్తని మెయిన్ స్ట్రీమ్ పత్రికలు, ఛానెళ్లు ఏవీ మాట్లాడ్డం లేదు.
సరే. అమెరికా హౌస్ (దిగువ సభ) లో నెతన్యాహూ చెప్పిన అబద్ధాలలో కొన్ని ఇవి:
- పౌరులకు నష్టం జరగకుండా (గాయ పడడం, చనిపోవడం) ఉండేందుకు చరిత్రలో ఏ మిలటరీ తీసుకోనన్ని జాగ్రత్తలను ఇజ్రాయెల్ తీసుకుంది.
- అక్టోబర్ 7 తేదీన హమాస్ యూదు పసి పిల్లల్ని మంటల్లో వేసి కాల్చింది.
- అక్టోబర్ 7 నాడు హమాస్ 1200 మంది ఇజ్రాయేలీయులను చంపేసింది.
- అమెరికాలో జరుగుతున్న ఇజ్రాయెల్ వ్యతిరేక ఆందోళనలకు ఇరాన్ నిధులు సమకూర్చుతోంది.
- ఇజ్రాయెల్ వ్యతిరేక ఆందోళనకారులు యూదులపై సామూహిక హత్యాకాండ (జీనోసైడ్) జరపాలని పిలుపు ఇస్తున్నారు.
- ఇజ్రాయెల్ ఉద్దేశ్యపూర్వకంగా పౌరులను టార్గెట్ చెయ్యటం లేదు.
- రఫా పైన మేం చేసిన దాడుల్లో ఒక్క పౌరుడు కూడా మరణించలేదు.
- గాజాలో ప్రవేశిస్తున్న మానవతా సాయం అంతటినీ హమాస్ దొంగిలిస్తోంది.
- ఇజ్రాయెల్ కి జెరూసలేము శాశ్వత రాజధాని.
———————ద క్రాడిల్ వెబ్ సైట్ నుండి