స్టేటస్!


గత పది రోజుల నుండి టపాలు లేకపోవడంతో మిత్రులు ఆందోళన తెలియజేస్తున్నారు. రాయడం లేదేమని అడుగుతున్నారు. నేను మళ్ళీ అనారోగ్యం పాలయ్యానేమోనని ఎంక్వైరీ చేస్తున్నారు. చొరవ చేసి అడుగుతున్న వారి వెనుక మరింత మంది పాఠకుల ఆందోళన ఉంటుందని నేను ఊహించగలను.

మొదటి విషయం: నేను ఎలాంటి అనారోగ్యానికి గురి కాలేదు. రోజూ ఆఫీస్ కి వెళ్ళి వస్తున్నాను.

రెండవది: బ్లాగ్ అప్ డేట్ కాకపోవడానికి కారణం నేను మరొక రాత పనిలో ఉండటమే.

ఈ అక్టోబరుతో రష్యా సోషలిస్టు విప్లవానికి 99 యేళ్ళు నిండాయి. 100వ సంవత్సరం లోకి ప్రవేశించింది. ఈ సందర్భంగా రష్యన్ విప్లవం గురించి ఓ రచన చేస్తున్నాను.

ఇది కాస్త సిద్ధాంతంతో కూడుకున్నది. ఏకాగ్రతతో చేయవలసిన పని. అదే పనిగా చేయవలసిన పని. బుర్ర వేడెక్కిపోయే పని. ఎంత వేడి అంటే మధ్య మధ్యలో సినిమాలు డౌన్ లోడ్ చేసుకుని చూసి చల్లబడటానికి ప్రయత్నించేటంత!

అందువల్ల బ్లాగ్ పైన శ్రద్ధ పెట్టలేకపోతున్నాను. రాత పని పూర్తయ్యాక ఎప్పటిలాగా బ్లాగ్ లోకి వస్తాను.

మూడవది: మరో వారం రోజుల పాటు నేను బ్లాగ్ అప్ డేట్ చేయలేకపోవచ్చు. కాబట్టి పాఠకులు మన్నించగలరు.

బ్లాగ్ నాకు ఎంతో ఇష్టమైన పని. దానిని నేను వదిలి పెట్టే సమస్యే లేదు.

మెయిల్ ద్వారా పలకరించినవారికి ధన్యవాదాలు.

అభినందనలతో,

నమస్కారాలతో,

విన్నపాలతో,

విశేఖర్

2 thoughts on “స్టేటస్!

వ్యాఖ్యానించండి