MAలో మోడి సబ్జెక్టులు లేవు -ప్రొఫెసర్


Modi Degree row

ప్రధాన మంత్రి నరేంద్ర మోడి డిగ్రీ వివాదం ముదురుతుండగానే ఆయన పి‌జి గురించిన వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. నరేంద్ర మోడి గుజరాత్ యూనివర్సిటీలో ఎం‌ఏ చదివినప్పటి కాలంలో అక్కడ ప్రొఫెసర్/ఫ్యాకల్టీ మెంబర్ గా పని చేసిన జయంతి పటేల్ తన ఫేస్ బుక్ పేజీలో వెల్లడి చేశారు.

గుజరాత్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ నరేంద్ర మోడి తమ వద్ద పి‌జి పూర్తి చేశారని చెబుతూ పార్ట్ – 2 లో ఆయనకు ఏయే సబ్జెక్టులలో ఎన్నెన్ని మార్కులు వచ్చినదీ పత్రికలకు సమాచారం విడుదల చేశారు. ఆ సమాచారం ప్రకారం నరేంద్ర మోడి పార్ట్ – II లో మొత్తం 62.3% మార్కులు వచ్చాయి.

మే 5 తేదీన ఇండియన్ ఎక్స్ ప్రెస్ పేజీలో ప్రచురితం అయిన ఈ సమాచారం పట్ల జయంతి పటేల్ అనుమానాలు వ్యక్తం చేశారు. తాను 1969-1993 కాలంలో యూనివర్సిటీలో ‘పోలిటికల్ సైన్స్’ ఫ్యాకల్టీ గా పని చేశానని చెబుతూ ఆయన నరేంద్ర మోడి రెగ్యులర్ విద్యార్ధిగానే యూనివర్సిటీలో పి‌జి లో చేరారని తెలిపారు.

అయితే మోడి కాలేజీకి సరిగా హాజరు కాలేదని జయంతి పటేల్ తెలిపారు. పోలిటికల్ సైన్స్ క్లాసులకు ఆయన హాజరు కావలసినంత లేకపోవడంతో పార్ట్ II లోకి వెళ్ళే అవకాశం లేదని తెలిపారు. అయితే ఇతర సబ్జెక్ట్ లలో ఇతర ఫ్యాకల్టీ సభ్యులు ఆయనను పాస్ చేసి ఉండవచ్చు గానీ తన సబ్జెక్ట్ లో మాత్రం అలా జరగలేదని స్పష్టం చేశారు. అందువలన మోడి తర్వాత external విద్యార్ధిగా చదివి ఉండవచ్చని తెలిపారు.

“నరేంద్ర మోడి MA పార్ట్ – 1 లో పోలిటికల్ సైన్స్ లో రెగ్యులర్  విద్యార్ధిగా చేరారు. కానీ నా క్లాస్ లో ఆయన హాజరు సరిపోలేదు. అందువలన మొదటి టర్మ్ మంజూరు చేయడం సాధ్యం కాలేదు. ఆయన గైర్హాజరును నేను ఎప్పుడూ మాఫీ చేయలేదు. బహుశా ఇతరులు మాఫీ చేసి ఉండవచ్చు. ఆ తర్వాత external గా పరీక్షలు రాసుకోవాలని సలహా ఇచ్చాను” అని జయంతి పటేల్ తన ఫేస్ బుక్ వాల్ పై తెలియజేశారు.

ఎం‌ఏ లో మోడి సంపాదించిన మార్కుల వివరాలు ఇస్తూ గుజరాత్ యూనివర్సిటీ వి‌సి ఇలా తెలిపారు. “ఎం‌ఏ రెండో సంవత్సరంలో ఆయనకు సబ్జెక్టుల వారీగా వచ్చిన మార్కులు ఇలా ఉన్నాయి. పోలిటికల్ సైన్స్ – 64; యూరోపియన్ అండ్ పోలిటికల్ ధాట్స్ – 62; మోడ్రన్ ఇండియా / పోలిటికల్ అనాలసిస్ – 67.”

ఈ అంశాలతో ప్రొఫెసర్ జయంతి పటేల్ విభేదించారు.

“సబ్జెక్టుల పేర్ల విషయంలో ఏదో తప్పు దొర్లినట్లు కనిపిస్తోంది. నాకు తెలిసినంతవరకు పార్ట్ – 2 లో ఇంటర్నల్ విద్యార్ధులకు గానీ external విద్యార్ధులకు గానీ అలాంటి సబ్జెక్టులను యూనివర్సిటీ ఎప్పుడూ ఆఫర్ చేయలేదు. నేను పోలిటికల్ సైన్స్ డిపార్ట్ మెంట్ లో 1969-93 కాలంలో ఫ్యాకల్టీగా బోధించే వాడిని” అని జయంతి పటేల్ తెలిపారు.

కొన్ని యేళ్ళ క్రితం ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో మోడి చెప్పిన వివరాల ప్రకారం ఆయన హై స్కూల్ తోనే చదువు ఆపేశారు. ఆ తర్వాత ఆర్‌ఎస్‌ఎస్ పెద్దల ఆదేశాల మేరకు బి‌ఏ, ఎం‌ఏ లను రెండింటినీ external గా చదివి పూర్తి చేశారు.

బి‌ఏ కు సంబంధించి అమిత్ షా, అరుణ్ జైట్లీలు వెల్లడి చేసిన సర్టిఫికేట్ బూటకం అనీ, ఆయన పేరు, పూర్తి చేసిన సంవత్సరం తప్పుగా ఉన్నాయని ఏ‌ఏ‌పి నేతలు ఇప్పటికే ఆరోపించారు. వీటికి బి‌జే‌పి నుండి ఇంతవరకు సమాధానం లేదు. బి‌ఏ పట్టా ఫోర్జరీ కనుక ఫోర్జరీ పట్టా ఆధారంగా పూర్తి చేసిన (ఒకవేళ పూర్తి చేస్తే) ఎం‌ఏ చెల్లదని కేజ్రీవాల్ వాదిస్తున్నారు.

ఎం‌ఏ పట్టాలో చోటు చేసుకున్న మరో విచిత్రం ‘Entire Political Science’. ఇటువంటి సబ్జెక్ట్ ని ప్రపంచంలో ఏ యూనివర్సిటీ అయినా ఆఫర్ చేస్తుందా అన్నది అనుమానం. కాగా పార్ట్ 2 లో యూనివర్సిటీ చెప్పిన సబ్జెక్ట్ లు అసలే లేవని యూనివర్సిటీ మాజీ ఫ్యాకల్టీ (మోడీ విద్యార్ధిగా ఉన్నప్పటి ఫ్యాకల్టీ) చెబుతుండడంతో అనుమానాలు మరింత బలపడ్డాయి.

మోడీ బి‌ఏ, ఎం‌ఏ విద్యార్ధులు కలిగి ఉన్నారా లేదా అన్నది సమస్య కానే కాదు. ఆయన చదవ కుండానే చదివానని చెప్పడమే సమస్య. తన విద్యార్హతలపై అబద్ధం ఆడారా లేదా అన్నదే సమస్య. సదరు విద్యార్హతలు లేనంత మాత్రాన ఆయన ప్రధాని పదవి ఊడిపోదు. కనుక నరేంద్ర మోడి తన విద్యార్హతలపై ఉన్న అనుమానాలను స్వయంగా నివృత్తి చేయాలి. ఏ‌ఏ‌పి ఢిల్లీ మంత్రులు ఎదుర్కొన్నట్లు విచారణ ఎదుర్కోవాలి.

2 thoughts on “MAలో మోడి సబ్జెక్టులు లేవు -ప్రొఫెసర్

  1. What a joke. It seems you did not watch yesterday times now news hour as well as CNN IBN. People laughed at AAP members Ashish khetan and Raghav cedda. Me. Bhupendra chaubey concluded that program, in my career (20 years) I have not come across such a baseless alegation, which does not have any substance. He told BJP should have ignored AAP allegations unnecessarily conducted meeting with Amit Shah and Arun Jaitly.

    If you want TV show links I would provide. Watch it. Going forward nobody will take AAP alegation seriously.

  2. Since when Times Now became authority to decide on Modi’s doings?

    మీరు టైమ్స్ నౌ వార్తలు చూసుకోవలసిందే. CNN IBN అంబానీ చేతి పనిముట్టు. తమకు అవసరం అయినట్లు వార్తలు తయారు చేసుకుంటారు.

    Why don’t you watch NDTV & India Today?

    జయంతి పటేల్ ఏ వార్తా చానెల్ లోనూ కనపడి చెప్పలేదు. ఎవరూ అడగకుండానే తన ఫేస్ బుక్ పేజీలో రాసుకున్నారు. మోడీ ఆయన విద్యార్ధి. అంతకంటే authenticity ఏం కావాలి? కాకపోతే మీరు మూఢంగా నమ్మినదానికి వ్యతిరేకంగా ఉన్నది ఏదైనా నవ్వబుల్. అనుకూలంగా ఉన్నది ఏదైనా ఆరాధ్యనీయం.

    జనానికి కావలసింది వాస్తవాలు. మీ, నా నమ్మకాలు కాదు.

వ్యాఖ్యానించండి