విభజన ‘గీత’ -తమాషా శ్లోకం


t-tel1

ఇది ఫేస్ బుక్ లో లభించింది. చాలా తమాషాగా ఉంది. కొంత అరాచకం అనిపిస్తున్నప్పటికీ ఇందులో వ్యక్తమయిన సృజనాత్మకత మాత్రం బాగుంది. మీరే చదవండి!

పేరెంట్సో జన్మహ పేమెంట్సో విద్యతి! వన్ బై వనేస్య వరసస్య సంభవామి దగే దగే!
ఇంతోహి బతుకు ఇంటెనక మరణస్య! చర్చా ప్రహసనన కరిష్యాం జిల్ జిల్ జిగే!!!!

అపార్థా!

పేరెంట్స్ వలన జన్మము, పేమెంట్స్ వలన చదువు, చదువు వలన ఉద్యోగము, ఉద్యోగము వలన లంచము, లంచము వలన నేరము, నేరము వలన అరెస్టు, అరెస్టువలన బెయిలు,బెయిలు వలన పునర్జన్మము సంభవమగుచున్నవి.

అంతియె కాని ఉద్యోగ సంఘముల సమ్మె వలన సమైక్యాంధ్ర సిద్ధించునని ఎచటయునూ లిఖించబడలేదు. ఇంత బతుకు బతికి గృహము వెనుక మరణించినయట్లు… అను సామెతను అనుసరించి ఇంత సమ్మె జేసి సింపుల్ గా సైలెంటై పోవుట పరువుతక్కువ పనిగా భావించబడుచున్నది.

కనుకనే ముఖ్యమంత్రితో చర్చలు అను ప్రహసనము రచింపబడుచున్నది. చర్చలు జరుగుట , అవి సఫలమైనవని మీడియా ఎదుట పళ్ళికిలించుట, ఒకవేళ ప్రభుత్వం గనక మాట తప్పితే సమ్మెను ఉధృతం చేస్తామని తాళపత్ర ధ్వనులు [తాటాకు చప్పుళ్ళు] సృష్టించుట సహజాతి సహజం.

అనివార్యంబగు ఇట్టి లత్తుకోరు చేష్టలను గాంచి నీవు చింతింపతగదు. పండగ చేసికొనుము.

టిటిటిటిటీం టుట్టూం టుయ్యూం [ఇది విచిత్ర వీణానాదము]

(తెరేష్ బాబు పైడి దీనికి రచయితలా కనిపిస్తోంది. ఆయన పేజీ ఇక్కడ. ఇలాంటివి తమాషా శ్లోకాలు అక్కడ ఇంకా ఉన్నాయి. చూసి నవ్వుకోవచ్చు.)

One thought on “విభజన ‘గీత’ -తమాషా శ్లోకం

  1. విభజన ఆస్థాన,భజన ప్రస్థాన, రాజకీయంభజే,
    పార్టీ తీర్థహ, పదవి ప్రసాదహ, బిల్లు దహనహ,
    సారాయి,బిరియాని, ఐదువందల నోటు కహా,
    వానర నాయక వికృత చేష్టహ,ప్రకృతి సహజహ.
    ఓటుపోయిన జీవి,ఓటరుగా ఐదేళ్ళు నిలువగ!!

వ్యాఖ్యానించండి