స్పెయిన్ రైలు ప్రమాదం చివరి క్షణాలు, చూసి తీరాలి -వీడియో


బహుశా ఇలాంటివి స్పెషల్ ఎఫెక్టులతో తీసే హాలీవుడ్ సినిమాల్లోనే చూడగలం. ఈ వీడియో తీసిన వ్యక్తి ఆ క్షణాల్లో అక్కడ ఎందుకు ఉన్నాడో గానీ స్పెయిన్ లో రైలు పట్టాలు తప్పిన చివరి క్షణాలని వీడియోలో బంధించగలిగాడు. గంటకు 180 కి.మీ వేగంతో వస్తున్న హై స్పీడ్ రైలు పట్టాలు తప్పుతున్న దృశ్యాన్ని సజీవంగా బంధించడం ఎలా సాధ్యం?

వంపు ఉన్న చోట గంటకి 90 కి.మీ వేగాన్ని మించకూడదని స్పెయిన్ చట్టాలు ఉన్నాయట. ఆ చట్టాన్ని ఉల్లంఘిస్తూ గంటకి 180 కి.మీ వేగంతో రావడం వల్ల రైలు పట్టాలు తప్పి ఉండవచ్చని పత్రికలు చెబుతున్నాయి. కానీ ఇంజనీరింగ్ నిపుణుల ప్రకారం వేగం ఒక్కటే ప్రమాదానికి కారణం కాకపోవచ్చు. ఇంకేదో కారణం జత కలిస్తే తప్ప ఇలాంటి ప్రమాదం జరిగే అవకాశం లేదని వారు చెబుతున్నారు.

స్పెయిన్ హోమ్ మంత్రి చెప్పినట్లు ఈ ప్రమాదానికి కారణం టెర్రరిస్టు చర్య కాకూడదని ప్రస్తుతానికి ఆశిద్దాం. ఈ వీడియోను కూడా రష్యా టుడే అందించింది. ఆ సైట్ నుండి డౌన్ లోడ్ చేసి, దానిని యూ ట్యూబ్ కి అప్ లోడ్ చేశాను.

78 మంది మృతికి, మరో 178 మంది తీవ్రంగా గాయపడడానికి కారణం అయిన ఈ ప్రమాదం స్పెయిన్ లోని శాంటియాగో నగరంలో జరిగింది. ‘శాంటియాగో డే’ రోజునే ఈ ప్రమాదం జరగడం ఒక విషాదం.

4 thoughts on “స్పెయిన్ రైలు ప్రమాదం చివరి క్షణాలు, చూసి తీరాలి -వీడియో

వ్యాఖ్యానించండి