–
భరత ఖండంబు చక్కని పాడియావు
హిందువులు లేగదూడలై యేడ్చు చుండ
తెల్లవారను గడుసరి గొల్లవారు
పితుకుచున్నారు మూతులు బిగియ బట్టి
చిలకమర్తి లక్ష్మీనరసింహం గారి పద్యం ఇది. భారత జాతీయోద్యమంలో, ఆ తర్వాత కూడా ఈ పద్యం బాగా ప్రసిద్ధి చెందింది. ఈ పధ్యంలో తెల్లవారి స్ధానంలో బడా ఫార్మసీ కంపెనీలను, లేగదూడలుగా రోగులను చేర్చి చదువుకుంటే చక్కగా సరిపోతుంది. ఈ కార్టూన్ కూడా అదే చెబుతోంది.
రాన్ బ్యాక్సీ కంపెనీ ఒక లైఫ్ సేవింగ్ డ్రగ్ లో ఔషధం స్ధానంలో గాజు పొడిలాంటిదానిని వేసి అమ్ముతున్నందుకు ఇటీవలే అమెరికా కోర్టు ఒకటి కొన్ని వందల మిలియన్ డాలర్లు జరిమానా విధించింది. భారత కంపెనీలు కొన్ని వేల ఖరీదుతో మాత్రమే తయారు చేయగల కేన్సర్ ఔషధం ఒకదాన్ని ఐ.పి.ఆర్ (Intellectual Property Rights) చట్టాన్ని అడ్డం పెట్టుకుని కొన్ని లక్షలకు అమ్ముతున్న వైనాన్ని భారత సుప్రీం కోర్టు చరిత్రాత్మక తీర్పు ద్వారా అడ్డుకుంది.
మరో కేసులో డిప్రెషన్ వ్యాధికి ఉపయోగించే సిటలోప్రామ్ అనే మందుకు చౌకయిన జెనెరిక్ వర్షన్ ఔషధం మార్కెట్ లోకి ప్రవేశపెట్టకుండా ఉద్దేశ్యపూర్వకంగా ఆలస్యం చేసినందుకు రేన్ బ్యాక్సీ తో పాటు లుండ్ బెక్ (జర్మనీ కంపెనీ), మెర్క్ (బ్రిటన్), యారో (ఫ్రాన్స్) తదితర 9 బడా కంపెనీలకు 146 మిలియన్ యూరోల జరిమానాను యూరోపియన్ కమిషన్ (ఇ.సి) విధించింది. చౌక మందును ఆలస్యం చేసి తద్వారా ఖరీదైన మందు అమ్ముతున్న కంపెనీకు లబ్ది చేకూర్చేందుకు ఈ కంపెనీలు కుమ్మక్కయ్యాయని ఇ.సి నిర్ధారించి ఈ జరిమానా విధించింది.
ఇలాంటి కేసులు అనేకం ప్రపంచ వ్యాపితంగా వెలుగు చూస్తున్నాయి. క్రిమినల్ చర్యలు తీసుకోవడం మాని ప్రభుత్వాలు జరిమానాలు విధించి ఊరుకుంటున్నాయి. దానితో కంపెనీలు మళ్ళీ యధావిధిగా అక్రమ చర్యలకు పాల్పడుతూ బిలియన్ల కొద్దీ సొమ్మును రోగుల నుండి గుంజుతున్నాయి.
ఇది సర్వ వ్యాపితం. ప్రాణాలు కాపాడుకోవడానికి రోగులు, కాపాడడానికి వారి బంధువులు ఎంతకైనా తెగించే ధోరణిలో ఉంటారు. సరిగ్గా ఈ బలహీనతనే బడా ఫార్మా కంపెనీలు సొమ్ము చేసుకుంటున్నాయి. తక్కువ ధరకు తయారు చేయగల కంపెనీలను వివిధ ఐ.పి.ఆర్ లాంటి అనేక పద్ధతుల ద్వారా తోక్కేస్తున్నాయి. ఇది జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాలది. కానీ కంచే చేను మేస్తోంది.

దోచుకోవడానికి ఏ అవకాశం ఉన్నా….దోపిడీ దారులు వదులుకోరు కదా. అలాగే ప్రజలకు ఎంతో ప్రధానమైన వైద్య రంగాన్ని పూర్తిగా వ్యాపారమయం చేశారు.
వైద్యో నారాయణో హరి అంటూ….వైద్యుడ్ని దేవుడి స్థానంలో నిలబెట్టింది మన సంస్కృతి. దాన్ని విస్మరించిన మన ప్రభుత్వాలు క్రమంగా….ఫార్మా కంపెనీలకు అనుగుణంగా పాలసీలను రూపొందిస్తున్నాయి.
అసలు ఇప్పటికీ వైద్య రంగంలోని అవినీతి పూర్తిస్థాయిలో ఫోకస్ కాలేదు.
వైద్య రంగంలోని వారే దాన్ని బట్టబయలు చేయాల్సి ఉంది.
ప్రాణాలు కాపాడుకోవడానికి రోగులు, కాపాడడానికి వారి బంధువులు ఎంతకైనా తెగించే ధోరణిలో english medicines vadutoo ayurveda yunani sidda homeo lanti vatini vadileste paristiti inte
While generic medicines are freely and cheaply available, people are still going for costly medicines. I dont know the reason why?