స్వదేశీయుల విదేశీ జమల్లో ఇండియా టాప్
విదేశాలలో పని చేసే స్వదేశీయులు తమ తమ దేశాలలోని కుటుంబాలకు తమ సంపాదనలో కొంత భాగాన్ని పంపుతుంటారు. ఇలా పంపే మొత్తాల్లో భారతీయులు పంపే మొత్తం మిగతా అన్నీ దేశాల కంటే ఎక్కువని ప్రపంచ భ్యాంకు లెక్కలు చెబుతున్నాయి. 2012లో ఈ జమలు భారత దేశానికి 69 బిలియన్ డాలర్లు రాగా, చైనాకి వచ్చిన మొత్తం $60 బిలియన్లు. ఫిలిప్పైన్స్ ($24 B), మెక్సికో ($23 B), నైజీరియా ($21 B), ఈజిప్టు ($21 B) ఆ తర్వాత స్ధానాలను ఆక్రమించాయి.
భారత జి.డి.పి లో ఈ విదేశీ జమల భాగం 3.7 శాతమే ఐనా ఆర్ధిక వ్యవస్ధకు అవి చేస్తున్న మేలు మాత్రం ఎక్కువే. ఎందుకంటే ఇండియాకు వాణిజ్య లోటు చాలా ఎక్కువ. ఈ లోటు వలన విదేశీ మారక ద్రవ్య నిల్వలు తగ్గిపోయి భారత చెల్లింపుల సమతూకాన్ని (Balance of Payment) దెబ్బతీస్తుంది. 2012లో ఇండియా వాణిజ్య లోటులో 40 శాతం భాగాన్ని స్వదేశీయుల విదేశీ జమలు పూడ్చాయంటే అవి చేస్తున్న మేలు ఏపాటిదో అర్ధం చేసుకోవచ్చు.
భారతీయులు నైపుణ్యం అవసరం లేని రంగాల్లో కాకుండా నైపుణ్యం అవసరమైన సాఫ్ట్ ఫేర్ లాంటి రంగాల్లో పని చేస్తుండడం వలన ఇలాంటి జమలలో భారత్ ముందంజలో ఉన్నది. ఉత్తర అమెరికా, యూరప్ ల నుండి భారతీయుల జమలు మొత్తం జమల్లో 49 శాతం ఉండగా గల్ఫ్ దేశాల నుండి 31 శాతం ఉన్నది. గతంలో గల్ఫ్ దేశాల్లోని నైపుణ్యరాహిత్య శ్రమల్లో పని చేసే భారతీయుల నుండి ఎక్కువ జమలు అందేవి. సాఫ్ట్ వేర్ బూమ్ ఆ పరిస్ధితిని మార్చింది.
సరబ్ జిత్ కుటుంబీకుల పాక్ పయనం
సరబ్ జిత్ కుటుంబ సభ్యులు పాకిస్ధాన్ బయలుదేరి వెళ్తున్నారు. ఈ మేరకు ఇరు దేశాలు వారికి వీసాలు మంజూరు చేశాయి. నలుగురు కుటుంబ సభ్యులు సరబ్ జిత్ సింగ్ చికిత్స పొందుతున్న జిన్నా ఆసుపత్రికి వెళ్లనున్నారు. పాక్ ఖైదీల దాడిలో సరబ్ జిత్ సింగ్ తీవ్రంగా గాయపడి తీవ్ర స్ధాయి కోమాలోకి జారుకున్న సంగతి తెలిసిందే. ఆయన ఇప్పుడు వెంటిలేటర్ మద్దతుతో ఊపిరి తీసుకుంటున్నాడు. ఢిల్లీలోని పాకిస్ధాన్ రాయబార కార్యాలయం తమకు వీసాలు జారీ చేసిందని సరబ్ జిత్ సింగ్ సోదరి దల్బీర్ కౌర్ శనివారం తెలిపింది. సరబ్ జిత్ కూతుళ్ళు పూనమ్, స్వపన్ డీప్, భార్య సుఖ్ ప్రీత్ కౌర్ లు లోహార్ వెళ్తున్నవారిలో ఉన్నారు. ఎపుడు వెళ్తున్నది గోప్యంగా ఉంచుతున్నారు.
ఒక కుటుంబ సభ్యురాలిని సరబ్ జిత్ సింగ్ వద్ద ఉంచడానికి పాక్ ప్రభుత్వం అంగీకరించిందని తెలుస్తోంది. మిగిలిన ముగ్గురు ఇండియాకి తిరిగి రావలసి ఉంటుంది. శుక్రవారం దల్బీర్ కౌర్, ప్రధాని మన్మోహన్ కి తాము పాక్ వెళ్లడానికి అనుమతి ఇప్పించాలని విజ్ఞప్తి చేసింది. యు.పి.ఏ చైర్ పర్సన్ సోనియా గాంధీకి కూడా ఆమె విజ్ఞప్తి చేసింది. దానితో వారు పాక్ వెళ్ళి సరబ్ జిత్ సింగ్ ను చూడడానికి మార్గం సుగమం అయింది.
సిరియాపై అమెరికా అబద్ధపు ప్రచారం
సామూహిక విధ్వంసక మారణాయుధాలు ఉన్నాయంటూ అబద్ధాలు చెప్పి ఇరాక్ పై దురాక్రమణ దాడి చేసినప్పటి
పరిస్ధితులను అమెరికా జ్ఞప్తికి తెస్తోంది. తిరుగుబాటుదారులపై సిరియా ప్రభుత్వం తక్కువ స్ధాయిలో రసాయన ఆయుధాలు ప్రయోగించిందని చెప్పేందుకు తమ వద్ద కొద్దిగా ఆధారాలు ఉన్నాయని అయితే గట్టిగా నిర్ధారించేందుకు అవి సరిపోవని అమెరికా డిఫెన్స్ సెక్రటరీ (రక్షణ మంత్రి) చక్ హేగెల్ అదే పనిగా చెవి కోసిన మేకలా కేకలు వేస్తున్నాడు. ఈ కేకలని పశ్చిమ పత్రికలు అందిపుచ్చుకుని కధలు కధాలుగా ప్రచారం చేస్తూ ఇరాక్ దురాక్రమణ యుద్ధం ముందు పోషించిన పాత్రనే పోషించడానికి యధాశక్తి ప్రయత్నిస్తున్నాయి.
అయితే వీరి మాటలను అంతర్జాతీయ సమాజం నమ్మే పరిస్ధితులు ఇప్పుడు లేవు. లిబియాలో గడాఫీ తన ప్రజలపైన సామూహిక హత్యాకాండకు పాల్పడబోతున్నాడని అబద్ధం చెప్పి ఐరాస చేత తీర్మానం చేయించి ఆ దేశం పైన నిషిద్ధ గగనతలం అమలు చేయించాయి. అనంతరం వైమానికదాడులతో విరుచుకుపడి లిబియాను సర్వనాశనం చేశాయి. తీరా చూస్తే గడాఫీ హత్యాకాండ వార్త ఒట్టి అబద్ధమని తేలిపోయింది. ఇరాక్, లిబియా ల దురాక్రమణలకు అనుసరించిన ఎత్తుగడే మళ్ళీ సిరియా పైన అమలు చేయడానికి అమెరికా, ఐరోపాలు ప్రయత్నిస్తున్నాయి. రష్యా, చైనాలు సిరియాకు అండగా ఉండడంతో ఇప్పటివరకూ వాటి ఆటలు సాగలేదు. తాజాగా హెగెల్ చేస్తున్న ప్రచారం బట్టి ‘ఒబామా విధించిన రెడ్ లైన్ ను సిరియా దాటిందని’ సాకుచూపి అమెరికా ప్రత్యక్షంగా సైనిక జోక్యం చేసుకోవడానికి ఏర్పాట్లు చేసుకుంటోందని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.



If yu do not mind can u tell me or give me link top 10 remittence details source
Thanks in advance
The remittance buffer
America prapancha adhipathyam kosam chese prayathnamlo entho mandhi amaayakula praanalanu baligonadamey kakunda enno abhivrudhi chendhuthunna desala saamaajika,rajakeeya,arthika sthithigathulanu nasanam cheyadamo leka thanu anukulanga marchukovadaaniki cheyalsina panulanu,veyalsina yethugadalanu vesthuney vundhi.