సమాచార సేకరణకు చక్కని దారులు -ఈనాడు ఆర్టికల్ రెండో భాగం


ఈనాడు పత్రికలో ప్రచురించబడిన నా ఆర్టికల్ రెండో భాగం ఇది. సమాచార సేకరణ ఎలా చేయవచ్చు అన్న అంశం ఈ భాగంలో వివరించబడింది.

జాతీయ అంతర్జాతీయ పరిస్ధితులపై అవగాహన సాధించడమెలా? -2

బొమ్మ పైన క్లిక్ చేస్తే మేటర్ ను పి.డి.ఎఫ్ ఫార్మాట్ లో చూడవచ్చు. నెట్ లో చూడాలనుకుంటే ఇక్కడ ఈ లంకెను క్లిక్ చేయండి.

Enadu 2

5 thoughts on “సమాచార సేకరణకు చక్కని దారులు -ఈనాడు ఆర్టికల్ రెండో భాగం

  1. Unknown గారు, మీరు చెప్పింది నిజమో కాదో నాకు తెలియదు. కాని advertise చెయ్యడం కోసమని కాదు. బ్లాగ్ లో పోస్ట్ చేస్తే ఇంకొన్ని ప్రయోజనాలు కూడా ఉంటాయి కదా. భద్రపరచడం, తేలికగా అందుబాటులో ఉంచుకోవడం, ఫేస్ బుక్ లాంటి చోట్ల షేర్ చెయ్యడానికి అందుబాటులో ఉంచడం లాంటివి.

  2. ఆదిత్య గారు, ఈ ప్రశ్న ఎవరూ అడగలేదేమిటా అనుకున్నాను.

    అమెరికా, యూరప్ ల శిబిరానిది ఇపుడు ప్రపంచంలో ఏకచ్ఛత్రాధిపత్యంగా ఉంది. మీడియాలో కూడా వారిదే ఆధిపత్యం. వారు రాసిందే చెల్లుబాటులో ఉంది. పెట్టుబడి, వాణిజ్యం వారి చేతుల్లో ఉన్నాయి కనుక ఆ పరిస్ధితి ఉంది. ఈ నేపధ్యంలో ప్రత్యామ్నాయ మీడియా సంగతి అటుంచి పక్షపాతరహితంగా వార్తలు అందించి పాఠకుల ఆకట్టుకోవడం ఒక సవాలుగా ఉంటుంది. మా వ్యతిరేకులు గనుక మాకు వ్యతిరేకంగా రాస్తున్నారు అని పశ్చిమ మీడియా ప్రచారం చేసుకుని తేలికగా ఆమోదం పొందుతుంది.

    ఆ పరిస్ధితుల్లో పక్షపాత రహితంగా రాస్తూ పాఠకులను ఆకట్టుకోవడం, రీడర్‌షిప్ పెంచుకోవడం పశ్చిమ మీడియా పోటీదారులకు తక్షణ అవసరంగా ఉంటుంది. రష్యా టైమ్స్ అవసరం అలాంటిదే.

    రీడర్‌షిప్ పెరిగి నమ్మకమైన ఆధిపత్యం వచ్చాక రష్యా టైమ్స్ కి ఇక పక్షపాతరహితంగా ఉండవలసిన అవసరం తప్పుతుంది. తమ శిబిరానికి అనుకూలంగా వార్తలు రాయడం మొదలవుతుంది. అలా సొంత ప్రయోజనాల కోసం రాసుకోగల అవకాశం ఎప్పుడు వస్తుంది, అసలు వస్తుందా, రాదా అన్నది వేరే చర్చ.

    ఆర్ధిక, వాణిజ్య అవసరాలు, తద్వారా ఉనికిలోకి వచ్చే రాజకీయ, సాంస్కృతిక అవసరాలు వారి వారి స్ధానాలను నిర్ణయిస్తాయి.

    ఏదీ ఆబ్సల్యూట్ కాదు, కొన్ని హెచ్చు తగ్గులతో ప్రతీదీ సాపేక్షికమే (రెలిటివ్).

వ్యాఖ్యానించండి