మరో వందేళ్లకు గాని సంభవించని ఖగోళ అద్భుతం జూన్ 5, 6 తేదీలలో ప్రపంచ ప్రజలకు దర్శనం అయింది. ఎనిమిది సంవత్సరాల తేడాతో సూర్య తలంపై జంట మార్గాల్లో ప్రయాణం చేసే శుక్ర గ్రహం ఎనిమిదేళ్ల క్రితం జూన్ 8, 2004 తేదీన మొదటి ప్రయాణం పూర్తి చేసుకుంది. మళ్ళీ ఎనిమిదేళ్లకు రెండవ ప్రయాణం పూర్తి చేసింది. (భూగ్రహ వాసుల కంటిని రిఫరెన్స్ గా తీసుకున్నందున ఇక్కడ జంట ప్రయాణాలుగా ఉపమానీకరించడం.) మామూలు జనానికి ఇదేమీ పెద్ద సంగతి కాదు గానీ ఖగోళ శాస్త్రజ్ఞులు దీనిని గొప్ప అవకాశంగా భావించారు. ఈ సందర్భంగా శుక్ర గ్రహం వ్యాసం కొలిచి ఇప్పటికే తెలిసిన కొలతతో సరిపోల్చవచ్చని వారు భావిస్తున్నారు. తద్వారా సూర్య కుటుంబం బయట ఉంటే గ్రహాల పరిమాణాల్ని మరింత ఖచ్చితంగా తెలుసుకోవచ్చు. వీనస్ వాతావరణం గురించి కూడా మరింత సమాచారం తెలుసుకోవచ్చని తెలుస్తోంది. ప్రపంచ వ్యాపితంగా వివిధ వార్తా సంస్ధలు అందించిన ఫొటోలు ఇక్కడ ఉన్నాయి. నాసా అందించిన వీనస్ ప్రయాణ మార్గం కూడా ఒక ఫోటోలో చూడవచ్చు.
–























ఫొటోలు చాలా బాగున్నాయి. ముఖ్యంగా సూర్యుడి మీదుగా సాగే శుక్ర యానంలో పక్షులను జోడించి అత్యద్భుతంగా తీశారు పొటోగ్రాఫర్లు! శుక్రుడి సంగతేమో కానీ, సూర్యుడి ఉగ్ర స్వరూపం భయానకంగా, ఆకర్షణీయంగా కనిపిస్తోంది.
ఓ పిడకల వేట…! పోల్చి చెప్పటాన్ని ‘ఉపమించటం’ అనాలి. ఉపమానించటం/ ఉపమానీకరించటం అనే ప్రయోగాలు లేవు!
అవునా వేణు గారూ, నిజానికి ‘ఉమానీకరించడం’ అన్న పదం ఉందో లేదో నాకు తెలియదు. ఘటోత్కచుడ్ని తలచుకుని ధైర్యం చేసేశాను. దానివల్ల కనీసం ఉన్న పదమేంటో తెలిసింది కదా (మీ ద్వారా). అయితే సవరణ చేయబోవడం లేదు. తప్పేదో, ఒప్పేదో ఇతరులకి తెలిసొస్తుంది కనుక అలానే ఉంచుతున్నాను.