నైజీరియాలో లాగోస్ పట్టణంలో ప్రయాణికుల విమానం ఒకటి నివాస భవనాలపై కూలిపోవడంతో అనేక మంది చనిపోయారు. విమానంలో ప్రయాణిస్తున్న మొత్తం 153 మందీ చనిపోయారని నైజీరియా ప్రభుత్వ వర్గాలు తెలిపాయని ‘ది హిందూ’ తెలిపింది. నివాస భవనాల్లో చనిపోయినవారిని కూడా కలుపుకుంటె మృతుల సంఖ్య పెరగవచ్చని తెలుస్తోంది. ప్రమాదానికి కారణం ఇంకా తెలియలేదు. నీటి లభ్యత తక్కువ కావడంతో మంటలు ఆర్పడం కష్టమైంది. బోయింగ్ విమానం కూలివడానికి కొద్ది నిమిషాల ముందు ఇంజన్ లో సమస్య వచ్చిందని లాగోస్ కంట్రోల్ రూం కి పైలట్ సమాచారం ఇచ్చినట్లు తెలుస్తొంది. విమానం తాకిడికి రెండు పెద్ద అపార్ట్ మెంట్లతో పాటు ఇతర చిన్న భవనాలు బాగా దెబ్బతిన్నాయనీ అపార్ట్ మెంట్లలో ఉన్నవారిలో కొందరు చనిపోయి ఉండవచ్చని చెబుతున్నారు. ప్రమాదానికి సంబంధించి డెయిలీ మెయిల్, సి.ఎన్.ఎన్, ది హిందూ పత్రికలు అందించిన ఫోటోలివి.
–
–















