‘యాక్సిడెంటల్ బిలియనీర్’ మార్క్ జుకర్ బర్గ్ స్ధాపించిన ‘ఫేస్ బుక్’ శుక్రవారం నుండి షేర్ మార్కెట్ లోకి ప్రవేశించిన సంగతి విదితమే. ‘ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్’ (ఐ.పి.ఒ) ద్వారా ‘ఫేస్ బుక్’ సోషల్ నెట్ వర్కింగ్ కంపెనీ షేర్ విలువ 38 డాలర్ల తో ప్రారంభం అయింది. అంటే దాని మార్కెట్ కేపిటలైజేషన్ విలువ దాదాపు 102 బిలియన్ డాలర్లు (ఇప్పటి రూపాయి విలువ ప్రకారం 5.5 లక్షల కోట్ల రూపాయలకు సమానం) అన్నమాట. ఐ.పి.ఒ ప్రకటించడం ద్వారా ఇంత సొమ్ముని మూట గట్టుకున్న ఫేస్ బుక్ కంపెనీ యజమానులు ప్రపంచ వ్యాపితంగా ఉన్న ఎనభై కోట్ల మంది వినియోగదారులకు ఒనగూరుస్తున్న ప్రయోజనం ఏమిటో ఈ కార్టూన్ తెలియజేస్తోంది.
–
ఎబౌట్ డాట్ కామ్ వెబ్ సైట్ ఈ కార్టూన్ అందించింది.
