అమెరికా మాంద్యం (రిసెషన్) తీవ్రమవుతోందని ఆర్ధికవేత్తలు, రేటింగ్ సంస్ధలు హెచ్చరికలు తీవ్రం చేస్తున్నాయి. నిరుద్యోగం స్వల్పంగా తగ్గుతున్నట్లు ప్రభుత్వ లెక్కలు చూపుతున్నప్పటికీ ఉద్యోగాలు వస్తాయన్న ఆశలు వదులుకుని అనేకమంది దరఖాస్తు చేయడం మానేయడం వల్లనే నిరుద్యోగం తగ్గుతున్నట్లు కనిపిస్తున్నదని వారు చెబుతున్నారు. పరిస్ధితి తీవ్రంగా ఉన్నప్పటికీ ఫెడరల్ బ్యాంక్ అధిపతి బెన్ బెర్నాంక్, ట్రెజరీ సెక్రటరి తిమోతి గీధనర్ లు ఆశావహంగా ఉన్నట్లు ప్రకటిస్తున్నారు.
అమెరికాకి చెందిన ఈగాన్-జోన్స్ క్రెడిట్ రేటింగ్ సంస్ధ మూడు రోజుల క్రితం అమెరికా రేటింగ్ ను ఎఎ+ నుండి ఎఎ కు తగ్గించింది. వార్షిక జిడిపి ని అప్పు మించిపోతున్నదని ఆ సంస్ధ పేర్కొంది. ఎస్ & పి రేటింగ్ సంస్ధ అమెరికా రేటింగ్ ను మొదటిసారి తగ్గించడానికి కొన్ని నెలల ముందుగానే ఈగాన్-జోన్స్ సంస్ధ అమెరికా రేటింగ్ ను తగ్గించింది. అమెరికా క్రెడిట్ రేటింగ్ ను ఈగాన్-జోన్స్ తగ్గించడం ఇది రెండవసారి. 2012 జిడిపి $15.7 ట్రిలియన్లుగా అంచనా వేసినా, అప్పు $16.7 ట్రిలియన్లకు చేరుకోనుందని ఈగాన్ జోన్స్ తెలిపింది. 2012 లో ద్రవ్య లోటు $1.4 ట్రిలియన్లుగా అంచనా వేసింది. జిడిపిలో అప్పు శాతం 60 శాతం దాటడం సమస్యగా ఆర్ధికవేత్తలు భావిస్తారు. అలాంటిది అమెరికా అప్పు 100 శాతం దాటనున్నది.
–
–
Reblogged this on Gpvprasad's Blog and commented:
Apple ని తీసేస్తే బాగుంటాది.