ఆఫ్ఘన్ దురాక్రమణకు వ్యతిరేకంగా జర్మన్ల ప్రదర్శన


Anti war protests in Germany 01ఆఫ్ఘన్ దురాక్రమణ యుద్ధానికి వ్యతిరేకంగా వేలాదిమంది జర్మన్లు శనివారం నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. జర్మనీ వ్యాపితంగా ఉన్న డెబ్బై పైగా నగరాలలో పదుల వేలమంది జర్మన్లు ఈ ప్రదర్శనలలో పాల్గొన్నారని ప్రెస్ టి.వి. తెలిపింది. సాంప్రదాయక ఈస్టర్ ‘పీస్ మార్చ్’ లో భాగంగా నిర్వహించిన ప్రదర్శనలో, ప్రదర్శకులు నాటో దురాక్రమణ యుద్ధాలకు వ్యతిరేకంగా, అణ్వాయుధాలకు వ్యతిరేకంగా నినాదాలిచ్చారు. రాజధాని బెర్లిన్ లో  అమెరికా ఎంబసీ ముందు వందలమంది నిరసనలు చేపట్టారు. ఆఫ్ఘనిస్ధాన్ లోనూ, పశ్చిమాసియాలోనూ అమెరికా అనుసరిస్తున్న విధానాలను వారు నిరసించారు.

ప్రఖ్యాత జర్మనీ సాహిత్యకారుడు, నోబెల్ బహుమతి గ్రహీత గంటర్ గ్రాస్ కి పరదర్శనలు మద్దతు తెలిపాయి. ఇజ్రాయెల్ అక్రమ సెటిల్ మెంట్ల నిర్మాణాలని నిరసిస్తూ గంటర్ గ్రాస్ ఇటీవల రాసిన కవిత అంతర్జాతీయ స్ధాయిలో చర్చల్లో చోటు చేసుకుంది. ఇజ్రాయెల్ అణు స్ధావరాలలో కూడా తనిఖీలు నిర్వహించాలని గ్రాస్ కోరాడు. జర్మన్లలో గ్రాస్ కి పలుకుబడి ఉన్న దృష్ట్యా ఈ కవితపైన అంతర్జాతీయంగా ఖండన మండనలు చోటు చేసుకున్నాయి. అక్రమ సెటెల్ మెంట్ల నిర్మాణాని వ్యతిరేకిస్తూ రాసిన కవితను ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్gunter_grass నేతన్యాహూ ‘యూదు వ్యతిరేకంగా’ అభివర్ణించి సానుభూతి సంపాదించడానికి ప్రయత్నించాడు. నాజీ హిట్లర్ సాగించిన యూదు వ్యతిరేక హత్యాకాండని గుర్తుకి తెచ్చి తాము పాలస్తీనీయులపై జరుపుతున్న జాత్యహంకార దమనకాండను సమర్ధించుకోవడానికి ప్రయత్నించాడు. ఈ నేపధ్యంలో జర్మనీలో జరిగిన నిరసనకారులు గంటర్ గ్రాస్ కి తమ పూర్తి మద్దతును ప్రకటించారు.

యుద్ధాలని ముగించి నిరంతర హింసకు స్వస్తి పలకాలని ప్రదర్శకులు డిమాండ్ చేశారు. “హింసకు వ్యతిరేకంగా మేమీ ప్రదర్శనీ నిర్వహిస్తున్నాం. హింసను కొనసాగిస్తూ, యుద్ధ బెదిరింపులకి దిగడాన్ని నిరాశిస్తున్నాం. ఆఫ్ఘనిస్ధాన్ నుండి జర్మనీ సైనికులను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నాం” అని ప్రదర్శనలో పాల్గొన్న బ్రేమెన్ పీస్ ఫోరం నాయకుడు ఎక్కేహార్డ్ లెండ్జ్ అన్నాడు. జర్మనీలో వివిధ నగరాలలో ఉన్న అమెరికా ఎంబసీల ముందు కూడా ప్రదర్శనలు జరిగాయి.

Anti war protests in Germany 02జర్మనీ లోని నైరుతి ప్రాంతంలో ఉన్న మిలట్రీ బేస్ ముందు కూడా నిరసన ప్రదర్శనలు జరిగాయి. అమెరికాకి చెందిన 20 అణు వార్ హెడ్ లు ఇక్కడ ఉండడంతో వాటిని తొలగించాలని నిరసనకారులు డిమాండ్ చేశారు. ప్రపంచ వ్యాపితంగా మరిన్ని అణ్వాయుధాలు తయారు చేస్తున్నారనీ, ఆయుధాల కొనుగోళ్ళు మరింత పెరిగాయనీ నిరసనకారులు ఆందోళన వ్యక్తం చేశారు. ఫెడర్ కమిటీ ఆఫ్ పీస్ కౌన్సిల్ సభ్యుడు పీటర్ స్టర్టింస్కీ కూడా ప్రదర్శనల్లో పాల్గొన్నాడు. గత రెండు రోజులుగా జర్మనీ అంతటా ప్రదర్శనలు జరుగుతున్నాయి. గత సంవత్సరం లక్ష ఇరవై వేలమంది ఈ ప్రదర్శనల్లో పాల్గొన్నారని పత్రికలు తెలిపాయి.

గత సంవత్సరం ఫిబ్రవరిలో ఆఫ్ఘనిస్ధాన్ లోని జర్మనీ సైనికులు యుద్ధానికి వ్యతిరేకంగా బ్యాడ్జిలు ధరించి సంచలనం రేపారు. తాము ఆఫ్ఘనిస్ధాన్ లో ఉండడానికి కారణాన్ని వారు పరోక్షంగా ప్రశ్నించారు. ‘ఐ ఫైట్ ఫర్ మెర్కెల్’ అని రాసి ఉన్న బ్యాడ్జిలు ధరించి యుద్ధ వ్యతిరేకతను తెలియజేశారు. అణ్వాయుధాలు టెర్రరిస్టుల చేతుల్లోకి వెళ్లకుండా ఉండడానికే తమ సైనికులు ఆఫ్ఘనిస్ధాల్ లో ఉన్నారని ఛాన్సలర్ మెర్కెల్ అప్పట్లో జర్మనీ పార్మామెంటులో విచిత్రమైన సమాధానం చెప్పింది. అణ్వాయుధాల పట్ల జర్మన్లకు ఉన్న వ్యతిరేకతను అడ్డు పెట్టుకుని ఆఫ్ఘన్ దురాక్రమణ యుద్ధాన్ని సమర్ధించడానికి ప్రయత్నించింది.

వ్యాఖ్యానించండి