మానవ నాగరికత సాధించిన ప్రగతికి ఈ వంతెనలు ప్రతి రూపాలు. అత్యంత పొడవైన వంతెనలు, భారీ వంతెనలు, ఎత్తయిన వంతెనలు చూసినపుడు మానవ మేధస్సుకి పరిమితులు లేవేమో అనిపిస్తుంది. ‘అరచేతిలో వైకుంఠం’ కాదు గానీ, అరచేతిలో ఇమిడి పోతున్న సెల్ ఫోన్లలోకి ప్రపంచం అంతటినీ క్షణాల్లో సాక్షాత్కరింపజేయగలిగిన మేధస్సు మనిషి సొంతం. ఫ్యూడల్ వ్యవస్ధ సాధించిన భారీ నిర్మాణాలకు సాంకేతికతను జోడించి మనిషి జీవనానికి మరింత సౌఖ్యాన్ని జోడించడంలో పెట్టుబడిదారీ వ్యవస్ధ సాధించిన ప్రగతిని కొట్టివేయడానికి వీల్లేదు.
లాభార్జనే అడ్డంకి కానట్లయితే, ప్రజల ప్రయోజనాలకే ప్రధమ ప్రాధాన్యం ఇచ్చినట్లయితే పెట్టుబడిదారీ వ్యవస్ధ సాధించగలిగే అద్భుతాలకు కొదవ ఉండకపోను. కాని లాభార్జన ధ్యేయంగా లేని పెట్టుబడి ప్రకృతి విరుద్ధం. ‘నిరంతర లాభాలే’ పెట్టుబడి కి మోటివేషన్. లాభాల కోసం వెంపర్లాడని రోజున పెట్టుబడి తన ‘విధ్వంసక’ స్వాభావికతను కోల్పోతుంది. అదే సమయంలో మోటివేషన్ కోల్పోయి నడక మానుతుంది. అప్పుడా నడకను అందిపుచ్చుకునేది కార్మికవర్గం. పెట్టుబడిదారీ వ్యవస్ధ అందించిన సామూహిక ఉత్పత్తి కార్యక్రమాన్ని కార్మికవర్గం కొనసాగించి మానవ నాగరికత మరింత పరిఢవిల్లడానికి బాటలు వేస్తుంది. ఉత్పత్తి విధానంతో పాటు ఉత్పత్తి పంపిణీని కూడా ప్రజాస్వామీకరించి దరిద్రాన్ని పారద్రోలుతుంది.
- చైనాలోని ఐఝై వంతెన. ఎత్తైన ప్రాంతంలో రెండు సొరంగాల్ని కలుపుతూ దీన్ని నిర్మించారు. 336 మీ. పొడవు, 1176 మీ. ఎత్తు ఉన్న దీనిని హూనాన్ రాష్ట్రంలో మార్చి 31, 2012 తేదీన ప్రారంభించారు
- ప్రపంచంలోని నాలువందల ఎత్తయిన వంతెనల్లో ఐఝై ఒకటి. ఐఝై వాటన్నింటిలో పొడవైనది.
- క్వింగ్ డావో జియావో ఝౌ బే బ్రిడ్జి. సముద్రంలో నిర్మించిన వంతెనల్లో ఇది పొడవైనది. చైనా లోని షాన్ డాంగ్ రాష్ట్రంలో జియావో ఝౌ అఘాతం పైన నిర్మించిన ఈ వంతెన పొడవు 36.48 కిలో మీటర్లు. నిర్మాణం ప్రారంభించిన నాలుగేళ్లకే వినియోగం లోకి వచ్చింది.
- Lake Pontchartrain Causeway. అమెరికాలో లూసియానా రాష్ట్రంలో నిర్మించబడిన రెండు సమానాంతర వంతెనలు. 38.35 కి.మి పొడవుగల దీని నిర్మాణానికి 9,500 కాంక్రీట్ స్తంభాలు నింపారు.
- డోంఘై వంతెన. చైనాలోని షాంఘై నగరాన్ని యాంగ్ షాన్ పోర్ట్ తో కలుపుతుంది. పొడవు 32.5 కి.మీ. ప్రారంభించి ఏడేళ్లవుతుంది.
- Chesapeake Bay Bridge. ఈ నాలుగు లేన్ల వంతెన వర్జీనియా (అమెరికా) రాష్ట్రం లోనిది. పొడవు 37 కి.మీ.
- వాస్కో డి గామా వంతెన. పోర్చుగల్ రాజధాని లిస్బన్ లోని ఈ వంతెన పొడవు 37 కి.మీ.
- పీనాంగ్ వంతెన. పీనాంగ్ ద్వీపంలోని గెలుగోర్, సెబెరాంగ్ ప్రాయ్ లను మలేషియా ప్రధాన భూభాగంతో కలుపుతుంది. పొడవు 13.5 కి.మీ.
- రియో నిటెరోయ్ బ్రిడ్జి బ్రెజిల్ లోనిది. బ్రెజిల్ రాజధాని రియో డి జెనీరియో ను నిటెరోయ్ నగరంతో కలుపుతుంది. పొడవు 13 కి.మీ. 1974 లోనే ఇది ప్రారంభం అయింది.
- కాన్ఫెడరేషన్ బ్రిడ్జి. కెనడా. ప్రిన్స్ ఎడ్వర్డ్ ద్వీపాన్ని న్యూ బ్రన్స్ విక్ నగరంతో కలుపుతుంది.
- శాన్ మేటియా-హేవార్డ్ బ్రిడ్జి. అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కో లో నిర్మించారు. మొత్తం పొడవు 11.26 కి.మీ
- సెవెన్ మైల్ బ్రిడ్జి. అమెరికాలోని ఫ్లోరిడా లో నిర్మించబడింది.1982 లో ప్రారంభించారు.
–
-యాహూ న్యూస్ ఈ ఫొటోల్ని అందించింది.











