ఆయిల్ కంపెనీల దోపిడి -కార్టూన్


శక్తి జనించడానికి ఇంధనం అత్యవసరం. ఆధునిక సమాజంలో ఆయిల్, విద్యుత్ లే ప్రధాన శక్తి జనితాలుగా ఉండడంతో ఆయిల్ కంపెనీల దోపిడి కి అడ్డు లేకుండా పోతోంది. పౌరులందరికీ సమాన స్ధాయిలో అందుబాటులో ఉండవలసిన ప్రకృతి వనరులు కొద్ది మంది పెట్టుబడిదారుల చేతిలో లాభార్జనా సాధనంగా మిగిలిపోయింది. వారికి ప్రభుత్వాలు అండదండలిస్తున్నాయి. ఫలితంగా ఆయిల్ క్రమంగా లగ్జరీ సరుకు గా మారిపోతోంది. సగటు జీవికి మళ్లీ సైకిలే ప్రధాన రవాణా సాధనంగా మారిపోయే పరిస్ధితులు తలెత్తుతున్నాయి.

మరో పక్క అమెరికాలో ఇటీవల జరిగిన బ్లాక్ టీనేజర్ ట్రేవాన్ హత్య అక్కడ ప్రకంపనలు సృష్టించింది. నిరాయుధుడైన బ్లాక్ టీనేజర్ “A back guy, who is up to no good” అని చెబుతూ ఒక పోలీసు కాల్చి చంపాడు. జాత్యహంకారమే ఈ హత్యకి కారణం అని పత్రికలు, ప్రజలు ఆగ్రహిస్తున్నారు. తనపైన దాడి చేయడం వల్లనే కాల్చి చంపానన్న పోలీసు వాదనను పూర్వ పక్షం చేస్తూ సాక్ష్యాలు వెల్లడి అవుతున్నాయి. ‘రక్షించండంటూ’ అరిచిన కేక పోలీసు (జిమ్మర్ మేన్) ది కాదని ఫోరెన్సిక్ నిపుణులు తేల్చారు.

ఈ రెండు అంశాలను పోలుస్తూ గీసిన ఈ కార్టూన్ ని ఎబౌట్ డాట్ కామ్ అందించింది.

Gas prices

వ్యాఖ్యానించండి