మియాన్మార్ ఎన్నికల్లో ‘ఆంగ్ సాన్ సూక్యీ’ గెలుపు -కార్టూన్


మియాన్మార్ ఉప ఎన్నికల్లో ‘ఆంగ్ సాన్ సూక్యీ’ పార్టీ ఎన్.ఎల్.డి (నేషనల్ లీగ్ ఫర్ డెమొక్రసి) విజయ దుందుభి మోగించిందని పత్రికలు రాస్తున్నాయి. ఇంకా ఫలితాలు వెల్లడికాకపోయినా, కౌంటింగ్ కేంద్ర్రాల నుండి వస్తున్న సమాచారం ద్వారా, ఎన్నికలు జరిగిన నలభై ఐదు స్ధానాల్నీ ఆ పార్టీ గెలుచుకోబోతున్నట్లు తెలిసిందని అవి రాస్తున్నాయి. మియాన్మార్ మిలట్రీ పాలకులపైన ఉన్న వ్యతిరేకతా, సూక్యీ కి ఉన్న పరపతిని దృష్టిలొ పెట్టుకున్నపుడు ఆ వార్తలు పెద్దగా ఆశ్చర్యం కలిగించేవి కావు. ఇన్నాళ్ళూ నిర్బంధంలో గడిపిన సూక్యీ మొదటిసారి పార్లమెంటులోకి అడుగుపెట్టడమే గమనించదగిన వార్త.

Myanmar elections

సూక్యీ ని అక్కడి మిలట్రీ జుంటా 1990 నుండి గృహ నిర్బంధంలో ఉంచింది. 1990 లో జరిగిన ఎన్నికల్లో ఎన్.ల్.డి గెలిచినా ఆ ఫలితాల్ని అంగీకరించకుండా సూక్యీని ప్రభుత్వం నిర్భంచించింది. మధ్యలో కొద్ది రోజులు తప్ప ఆమె ఇన్నాళ్లూ నిర్బంధంలోనే ఉంటూ వచ్చింది. మియాన్మార్ ప్రభుత్వం తలపెట్టిన రాజకీయ సంస్కరణలలో భాగంగా ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ సంస్కరణలు ఎన్నాళ్లు కొనసాగుతాయన్న విషయంలో సూక్యీ కూడా అనుమానాలు వ్యక్తం చేసింది.

మొత్తం 660 స్ధానాల్లో రిటైర్డ్ మిలట్రీ అధికారులు స్ధాపించిన పార్టీకి ఎనభై స్ధానాలు ఉన్నాయి. కనుక సూక్యీ పార్టీ గెలుచుకోబోయే 45 స్ధానాల వల్ల పెద్ద మార్పులేవీ జరగవు. ఎన్నికల వరకు చూసుకున్నా వాటికవే ప్రజాస్వామ్యానికి పక్కా సూచికలు కావు. ప్రపంచంలో అనేక నియంతృత్వ ప్రభుత్వాలు ఎన్నికలు నిర్వహిస్తున్నట్లే చెబుతూ వచ్చాయి. పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో జరుగుతున్న ఎన్నికల ద్వారా కూడా ప్రజలకు నిజమైన అధికారం దక్కుతున్న పరిస్ధితి లేదు. ప్రభుత్వాల విధానాలు ప్రధానంగా ధనికుల కోసం, వారి కంపెనీల కోసమే ఉపయోగపడుతున్నాయి. మెజారిటీ ప్రజలు మాత్రం ఆకలి, దరిద్రంలో కొనసాగుతూనే ఉన్నారు.

వ్యాఖ్యానించండి