ఇరాన్ వీధి చిత్రకళ -ఫొటోలు

ఇరాన్ వీధి చిత్రకారులు ఐ.సి.వై, ఎస్.ఓ.టి లు గీసిన వీధి చిత్రాలివి. వీరు ఇరాన్ లోని తాబ్రిజ్ నగరానికి చెందినవారు. ప్రఖ్యాత లండన్ వీధి చిత్రకారుడు బ్యాంక్సీ లాగా వీరు స్టెన్సిల్ టెక్నిక్ తో వీధి చిత్రాలు గీయడంలో సిద్ధ హస్తులు. బ్యాంక్సీ లాగా వీరు కూడా పిన్న వయస్కులు. ఐ.సి.వై వయసు 26 ఏళ్ళు కాగా ఎస్.ఓ.టి వయసు 20 యేళ్ళు. యువకులే అయినప్పటికీ వీరు గీసిన వీధి చిత్రాలలో పరిణితికి కొదవేమీ లేదు.  అసత్యారోపణలతో…

నా కొడుకుది రాజకీయ హత్య -ఐ.పి.ఎస్ అధికారి తండ్రి

మధ్య ప్రదేశ్ లో మైనింగ్ మాఫియా చేతిలో దారుణ హత్యకు గురయిన ఐ.పి.ఎస్ అధికారి నరేంద్ర కుమార్ ను రాజకీయ నాయకులే హత్య చేహించారని అతని తండ్రి, పోలీసు అధికారి కూడా అయిన కేశవ్ దేవ్ ఆరోపించాడు. కొద్ది రోజులుగా తాను అక్రమ మైనింగ్ కి సంబంధించిన ట్రక్కులను సీజ్ చేస్తున్నప్పటికీ రాజకీయ నాయకుల జోక్యంతో వదిలి పెడుతున్నారని తన కొడుకు చెప్పాడని ఆయన తెలిపాడు. రాజకీయ కుట్ర వల్లనే తన కొడుకు హత్యకు గరయ్యాడని కేశవ్…

అమెరికా కంటే చైనా పార్లమెంటు సభ్యులే సంపన్నులు -సర్వే

అమెరికా, చైనా దేశాల పార్లమెంటు సభ్యులలో ఎవరు ఎక్కువ సంపన్నులై ఉంటారు? సాధారణంగా అమెరికా కాంగ్రెస్, సెనేట్ సభ్యులే ఎక్కువ సంపన్నులై ఉంటారని భావిస్తాం. కానీ అది నిజం కాదని ‘బ్లూమ్ బర్గ్’ పత్రిక చెబుతోంది. చైనా పీపుల్స్ కాంగ్రెస్ సభ్యులతో గానీ, చైనా కమ్యూనిస్టు పార్టీ లోని ఉన్నత స్ధానాల్లో ఉన్న నాయకులతో గాని పోల్చి చూస్తే అమెరికా కాంగ్రెస్, సెనేట్ సభ్యులు కడు పేదలని ఆ పత్రిక చెబుతోంది. అమెరికా కాంగ్రెస్ లో మొత్తం…

అమెరికా, చైనా లు లేకుండా ప్రపంచ సమస్యల పరిష్కారం కుదరదు -హిల్లరీ

చైనాకు ప్రపంచ రాజకీయాల్లో ఉన్న స్ధాయిని అమెరికా మరొకసారి బహిరంగంగా అంగీకరించింది. ప్రపంచ వ్యవహారాల్లో ప్రతి టేబుల్ వద్దా చైనాకు సీటు ఉందనీ, ప్రపంచ స్ధాయిలో ప్రాముఖ్యం కలిగిన ప్రతి సంస్ధలోనూ చైనాకు పాత్ర ఉందనీ, అమెరికా, చైనాలు లేకుండా ప్రపంచంలో ఏ సమస్య అయినా పరిష్కారం కావడం అసంభవమనీ అమెరికా విదేశాంగ మంత్రి (సెక్రటరీ ఆఫ్ స్టేట్) హిల్లరీ క్లింటన్ ప్రకటించింది. అమెరికా మాజీ అధ్యక్షుడు నిక్సన్ చైనా సందర్శించి 40 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా…

ఇటలీ ఇండియా రాయబార యుద్ధంలో ఇండియా పై చేయి

కేరళ రాష్ట్ర సమీపంలోని సముద్ర జలాల్లో ఇద్దరు భారతీయ జాలర్లను కాల్చి చంపిన కేసులో ఇటలీ, ఇండియాల మధ్య రాయబార సంబంధాలలో ఉద్రిక్తతలు తలెత్తి కొనసాగుతున్నాయి. ఈ ఘర్షణలో ప్రస్తుతానికి ఇండియాడే పై చేయిగా కనిపిస్తోంది. ఇద్దరు ఇటాలియన్ మెరైన్లు ఇప్పటికీ కేరళ పోలీసుల కస్టడీలో కొనసాగుతుండడంతో ఇటలీ ప్రభుత్వంపై స్ధానికంగా ఒత్తిడులు తీవ్రం అవుతున్నాయి. ప్రభుత్వం సమర్ధవంతంగా వ్యవహరించలేదంటూ ఇటలీ ప్రతిపక్షాలు ప్రభుత్వంపైన దుమ్మెత్తి పోస్తుండడంతో ఇటలీలోని ఇండియా రాయబారిని పిలిపించుకుని తమ మెరైన్ల నిర్బంధం…

ఇండియా అగ్రరాజ్యం అయ్యే ఛాన్సే లేదు -అధ్యయనం

అగ్ర రాజ్యంగా అవతరించాలని కలలు కంటున్న భారత దేశానికి ఆ అవకాశాలు కనుచూపు మేరలో లేవని “లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్” (ఎల్.ఎస్.ఇ) జరిపిన అధ్యయన నివేదిక తేల్చింది. అనేకమంది భారతీయ స్కాలర్లు కూడా ఈ అధ్యయనంలో పాల్గొన్నట్లు తెలుస్తోంది. 2009లో భారత్ సందర్శిస్తూ అమెరికా విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్ “ఇండియా కేవలం ప్రాంతీయ శక్తి కాదు, అదొక ప్రపంచ శక్తి” అని ప్రకటించడాన్ని కొట్టి పారేసింది. ప్రజాస్వామ్యాన్ని ముందుకు తీసుకెళ్ళడంలోనూ, ఆర్ధిక వృద్ధి సాధించడంలోనూ,…

Water problem in India

భారత దేశంలో నీటి సమస్య ‘విశ్వరూపం -ఫొటో

ఇన్ఫర్మేషన్ అన్న పేరుతో ఉన్న ఫేస్ బుక్ ఎకౌంట్ లో ఈ ఫొటో లబ్యమయింది. భారత దేశంలో తాగు నీరు సమస్య కళ్లకు కట్టినట్లు ప్రతిబింబిస్తున్న ఈ ఫొటో తీసిన ఫొటో గ్రాఫర్ ని అభినందించకుండా ఎవరైనా ఉండగలరా? ఫొటోగ్రఫీ కళతో ప్రజల సమస్యలను ఎంత శక్తివంతంగా చెప్పవచ్చో ఈ ఫోటో తెలుపుతోంది. కళలన్నవి ప్రజలకు ఉపయోగపెట్టాలన్న స్పృహ ఉన్నపుడు కళలతో అద్భుతాలు సాధించవచ్చు.

ఆడలేక ‘మద్దెల ఓడు’ అంటున్న సోనియా

ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఎదురైన పరాభవానికి సరైన అభ్యర్ధులను నిలబెట్టక పోవడమే కారణమని సోనియా గాంధీ చెపుతోంది. ఓటమి వల్ల యు.పి.ఏ ప్రభుత్వానికి వచ్చిన నష్టమేమీ లేదని విశ్వాసం వ్యక్తం చేసింది. యు.పి ఎన్నికల్లో పార్టీ బలహీనం కావడం వల్లే ఓట్లు పడలేదని తేల్చేసింది. ‘అధిక ధరలు’ పార్టీ అభ్యర్ధుల ఎన్నికల అవకాశాలను దెబ్బ తీసి ఉండవచ్చని కూడా ఆమె అంగీకరించింది. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో జరగనున్న ఎన్నికలకు పార్టీని సంసిద్ధం చేయవలసి ఉందని…

2012 అసెంబ్లీ ఎన్నికలు: ఏ పార్టీనీ నమ్మని భారత ప్రజలు

భారత దేశ ప్రజలు తమ వద్దకు ఓట్లు అడగడానికి వచ్చిన ఏ పార్టీనీ నమ్మని పరిస్ధితికి చేరుకున్నారని ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు స్పష్టం చేస్తున్నాయి. ఒక్కో రాష్ట్రాన్ని పరిగణనలోకి తీసుకున్నపుడు ఏదో ఒక పార్టీకి పట్టం కట్టినట్లు కనపడుతున్నప్పటికీ మొత్తంగా చూసినపుడు ఒకే సమయంలో దేశవ్యాపితంగా ఒకే పార్టీని నమ్మే పరిస్ధితి ఇక రాకపోవచ్చన్న అనుమానాలు బలంగా కలుగుతున్నాయి. కొన్ని మినహాయింపులు ఉన్నప్పటికీ, అప్పటికి అధికారంలో ఉన్న పార్టీలను తిరస్కరించడానికే పరిమితమవుతున్న పరిస్ధితి కనిపిస్తోంది. అంటే…

ఇరాన్ పై అమెరికా దాడికి ఒప్పుకోం -పాకిస్ధాన్

‘అణ్వాయుధాలు ఉన్నాయన్న’ పేరుతో ఇరాన్ పై అమెరికా మిలట్రీ దాడికి పూనుకుంటే తాము అంగీకరించేది లేదని పాకిస్ధాన్ విదేశాంగ మంత్రి హీరా రబ్బానీ ఖర్ తేల్చి చెప్పింది. మరోక మిలట్రీ దాడికి ఈ ప్రాంతం భరించే స్ధితిలో లేదని ఆమె అభిప్రాయపడింది. అమెరికా ఎన్ని అభ్యంతరాలు చెప్పినప్పటికీ ఇరాన్ తో గ్యాస్ పైప్ లైన్ ఒప్పందాన్ని కొనసాగిస్తామని కూడా ఖర్ తేల్చి చెప్పింది. “అవసరమైతే ఇరాన్ పైన బల ప్రయోగం చేయడానికైనా సిద్ధమేనంటూ ఒబామా చేసిన ప్రకటన …

యు.పి ఎన్నికల్లో సైకిల్ హవా -కార్టూన్

ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో అధికారంలో ఉన్న పార్టీలు గల్లంతు కాగా ప్రతిపక్షం లో ఉన్న పార్టీలు అధికారం దిశలో పయనిస్తున్నాయి. మణి పూర్ పంజాబ్ లలో మాత్రం కాంగ్రెస్, బి.జె.పి కూటమి తిరిగి నిలబెట్టుకునే వైపుగా ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. మొత్తగా చూస్తే యు.పి.ఏ, ఎన్.డి.ఏ రెండు కూటములకూ నిరాశ కలిగించేవిగానే ఎన్నికల ఫలితాలు ఉన్నాయి. గాంధీల కంచుకోటలుగా భావించే అమేధీ, రాయబరేలలోనూ కాంగ్రెస్ అభ్యర్ధులు వెనకబడి ఉన్నారని తెలుస్తోంది. ఉత్తర ప్రదేశ్ లో అధికార బి.ఎస్.పి…

గుజరాత్ నరమేధంపై అమెరికా కాంగ్రెస్ తీర్మానం సామ్రాజ్యవాద ప్రయోజనాల కోసమే

గుజరాత్ ముఖ్య మంత్రి నరేంద్ర మోడి ప్రత్యక్ష పర్యవేక్షణలో ముస్లిం లపై సాగిన దారుణ నరమేధం జరిగి దశాబ్దం పూర్తయిన సందర్భంగా అమెరికా ప్రతినిధుల సభ ఒక తీర్మానాన్ని ఆమోదించింది. గుజరాత్ రాష్ట్రంలో అన్నీ మతాల వారూ మత స్వేచ్చతో బతికే సుహృద్భావ పూరిత వాతావరణం కల్పించాలని గుజరాత్ లోని నరేంద్ర మోడి ప్రభుత్వాన్ని ఆ తీర్మానం కోరింది. 2002 నాటి ‘ముస్లింల హత్యాకాండ’లో బాధితులైన వారికి నరేంద్ర మోడి ప్రభుత్వం సరైన న్యాయం కల్పించేందుకు ఎటువంటి…

‘గాలి’ సొమ్ము లాయర్లకు బహు తీపి

అక్రమ పద్ధతుల్లో సంపాదించిన ‘గాలి’ జనార్ధన రెడ్డి గారి సొమ్ము అంటే బెంగుళూరు లాయర్లకు ఎంత ఇష్టమో బెంగుళూరు కోర్టు వద్ద శుక్రవారం జరిగిన ఘటనలు వెల్లడించాయి. బెంగుళూరు కోర్టు ఆదేశాల మేరకు కోర్టులో విచారణకు హాజరయిన ‘గాలి జనార్ధన రెడ్డి’ ని మీడియా ఫోటోగ్రాఫర్లు ఫోటో తీయకుండా అడ్డుకోవడానికి వారు పెద్ద యుద్ధమే చేశారు. గుంపులు గుంపులు గా మీడియా ఫోటో గ్రాఫర్లను అడ్డుకోవడానికి ప్రయత్నించినప్పటికీ తమ వల్ల కాకపోవడంతో వారిపై రాళ్ళ దాడికి కూడా…