“రాకాసి మొసలి తో కుస్తీ పట్టా. తిమింగలంతో కలబడ్డా, గత వారమే ఓ బండరాయిని చంపేశా. మరో రాయిని మోది గాయపరిచా, ఇటుకని ఆసుపత్రి పాల్జేశా. నేనెంత క్షుద్రుడ్నంటే నన్ను చూస్తే మందులకి కూడా జబ్బొస్తుంది.”
లెజెండరీ బాక్సర్ మహమ్మద్ ఆలీ చెప్పిన మాటలివి. తన ఏనుగు బలంపై అయనకెంత నమ్మకమో ఈ మాటలే చెబుతాయి. ఆ నమ్మకమే లేకుంటే లెజెండ్ గా ఎలా మారగలడు?
నిజమో కాదో తెలియదు కాని మహమ్మద్ ఆలీ కవిత్వం కూడా రాయగలడట. బరిలో మహా మహా బాక్సింగ్ వీరుల్ని నిర్దాక్షిణ్యంగా మట్టి కరిపించే బాక్సర్ సున్నిత హృదయం లేకుండా కవితలు రాయగలడా? పోరాట యోధుడైనా తాను జెంటిల్మెనే అని చెప్పడానికి కవిత్వమే ఆధారం కావచ్చు. అమెరికాకి మొట్టమొదటి నల్ల జాతి అధ్యక్షుడుగా బారక్ ఒబామా గెలవడం వెనక మహమ్మద్ ఆలీ సాయం ఎంతో ఉందని మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ చెప్పడాన్ని బట్టి మహమ్మద్ ఆలీ ప్రభ అమెరికాలో ఇంకా కొనసాగుతున్నదనే చెప్పవచ్చు.
–
–






