‘ఎల్ మేక్’ అమెరికా దేశస్ధుడు. 1980 లో జననం. చిన్నతనం నుండీ బొమ్మలు గీస్తూ స్వతంత్రంగా అధ్యయనం చేస్తూ వచ్చాడట. మనుషుల బొమ్మలు ముఖ్యంగా ముఖాలపైన ఇతను ప్రధానంగా కేంద్రీకరించినట్లు కనపడుతోంది. మెక్సికో, అమెరికాల సంస్కృతి నుండి స్ఫూర్తి పొందినట్లు ఆయన చెప్పుకున్నాట్లు తెలుస్తొంది. నైరుతి అమెరికా సంస్కృతి, మతపరమైన చిత్రలేఖనం, గ్రాఫిటి లతో పాటు అనేక రకాల సాంప్రదాయక చిత్ర కళను ఈయన అధ్యయనం చేశాడు. అనేక దేశాల్లో ఈయన వీధి చిత్రాలు గీసాడు. మెక్సికో, డెన్మార్క్, స్వీడన్, కెనడా, దక్షిణ కొరియా, ఫ్రాన్సు, సింగపూర్, వియత్నాం తదితర ఇరవైకి పైగా దేశాల్లో ఈయన వీధి చిత్రాలు గీశాడు. అనేక ప్రపంచ స్ధాయి ప్రదర్శనల్లో సైతం ఈయన పాల్గొన్నాడు.
–
–




















ఈ వీధి పోర్ట్రెయిట్లలో బొమ్మల కోణంలోనే కాదు, గీసిన పద్ధతుల్లోనూ వైవిధ్యం గొప్పగా ఉంది. ముభావం, గాంభీర్యం.. ఎక్కువ చిత్రాల్లో కనపడే లక్షణం!