చెన్నై (ఛేపక్) అగ్నిప్రమాదం -ఫొటోలు


ఆదివారం ఆర్ధ రాత్రి (సోమవారం తెల్లవారు ఝాము) ఛేపక్ (చెన్నై) లో అగ్ని ప్రమాదం జరిగింది. మంటలార్పుతున్న సిబ్బందిలో ఒకరు దుర్మరణం చెందాడు. మరో ముగ్గురు సిబ్బంది గాయపడ్డారు. డైరెక్టర్ ఆఫ్ ఇండస్ట్రీస్, కామర్స్, సోషల్ వెల్ఫేర్ కార్యాలయాలున్న భవనం ఈ అగ్ని ప్రమాదంలో తీవ్రంగా దెబ్బ తింది. ప్రమాదానికి కారణాలు ఇంకా తెలియలేదు. మొదటి అంతస్ధులో మంటల్ని చూసిన వాచ్ మెన్ పోలీసులకు సమాచారం అందించడంతో వారి ద్వారా సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ప్రమాద స్ధలానికి చేరుకున్నారు. గంట సేపు కృషి చేసి మంటలార్పాక లోపలికి వెళ్ళిన సిబ్బందిపై పై కప్పు కూలిపడిపోవడంతో యాభై ఐదేళ్ల ఫైర్ మన్, అంబఝగన్ అక్కడికక్కడే మృతి చెందాడు.

వ్యాఖ్యానించండి