‘కోస్టా కంకోర్డియా’ పేరు గల ఓడ ఇటలీ సముద్ర జలాల్లో ఒరిగిపోయి మునిగిపోయింది. 4,200 మందిని ఒరుగుతున్న ఓడ నుండి రక్షించగా ఆరుగురు చనిపోయినట్లు ఇప్పటివరకూ తేలింది. ఓడ కెప్టెన్ తనకు నిర్దేశించబడిన మార్గం నుండి అనుమతి లేకుండా పక్కకు వెళ్ళడంతో ఈ ప్రమాదం సంభవించిందని ఓడ సొంత దారు చెబుతున్నాడు. ప్రయాణీకులు రక్షించబడకుండానే ఓడను వదిలేవేళ్ళాడని కేప్టేన్ విచారణను ఎదుర్కొంటున్నాడు. అలా వెళ్ళడం ఇటలీ ఓడ నియమాలకి విరుద్ధం.
శనివారం ఈ ప్రమాదం జరిగింది. ఓడ ఒరుగుతుండగానే అప్రమత్తమైన రక్షణ సిబ్బంది ప్రయాణీకులను రక్షించారు. సోమవారం వాతావరణం బాగులేక రక్షణ చర్యలు నిలిపివేసినట్లు తెలుస్తోంది. ప్రపంచంలోనే అత్యంత పెద్ద ఓడల కంపెనీ ‘కార్నివాల్ కార్పొరేషన్’ కి చెందినదే ‘కోస్టా కంకోర్డియా’. కోస్టా రూట్ ని ముందే ప్రోగ్రామ్ చేసి ఉంచుతారట. అది తన మార్గం నుండి పక్కకు వెళ్తే అలారం మోగుతుంది. ఆ విధంగా ప్రమాదం గురించి త్వరగా తెలుసుకుని అత్యధికుల్ని రక్షించగలిగారు.
–
–



















