గ్వాంటనామో చీకటి కొట్టం మూసివేత! ఇది బారక్ ఒబామా అధ్యక్షుడుగా ఎన్నిక కాకముందు అమెరికా ప్రజలకు ఇచ్చిన ఘనమైన వాగ్దానం. విమానాశ్రాయాలలో అనుమానితుల్ని అరెస్టు చేసినా వారిని ఈ చీకటి కారాగారానికే తరలించారు. ప్రజాస్వామిక విలువలపైన అమెరికా రాజ్యానికి ఉన్న గౌరవం ఒట్ఠి బూటకం అని నిరూపించిన అనేక అంశాల్లో గ్వాంటనామో బే జైలు ఖైదీలపైన అమెరికా సాగించిన అకృత్యాలు ఒకటి మాత్రమే.
బారక్ ఒబామా, అధ్యక్షుడిగా గెలవడం కోసం అనేక వాగ్దానాలు చేశాడు. అవేవీ అమలు చెయ్యకుండానే మరోసారి తనను గెలిపించమని ఆయన అమెరికా ప్రజలను ఈ సంవత్సరం కోరనున్నాడు. ఆఫ్ఘన్ దురాక్రమణ విరమణ, రష్యాతో స్నేహ సంబంధాలు, పాలస్తీనా సమస్య పరిష్కారం, ముస్లిం దేశాలతో సంబంధాల మెరుగు ఆయన చేసిన వాగ్దానాల్లో ముఖ్యమైనవి కాగా ఇవేవీ అమలు కాలేదు.
ఆఫ్ఘన్ దురాక్రమణ లో అమాయకుల హననం కొనసాగుతోంది. ‘యాంటి మిసైల్ డిఫెన్స్ సిస్టం’ విస్తరణకోసం అమెరికా రష్యాతో ఘర్షణ కొనసాగిస్తోంది. ఇజ్రాయెల్ జాత్యహంకారంతో రాజీపడడంతో పాలస్తీనా సమస్య కొనసాగుతోంది. లిబియాకి తన దాడిని విస్తరించడమే కాక సిరియా, ఇరాన్ దేశాలలో తన కీలుబొమ్మ ప్రభుత్వాలను ప్రతిష్టించడానికి ‘సాయుధ కుట్ర’ లను ప్రోత్సహించడం కొనసాగిస్తోంది. బారక్ ఒబామా మళ్ళీ అధ్యక్షుడుగా ఎన్నిక కావడానికి అనర్హుడనని ఇప్పటికే నిరూపించుకున్నాడు.
–

Nice…
పునరాగమనం :-). మంచి విశేషాలు
శీను గారూ, ‘పునరాగమనం’ అనడంలోనే మీకు నచ్చనిది చెప్పేశారు. కొన్నిసార్లు తప్పదేమో.
గ్వాంటనామో బే రహస్య కారాగారం అమెరికా యొక్క ద్వంద్వ నీతికి నిదర్శనం.
రొనాల్డ్ రీగన్ అమెరికా అధ్యక్షునిగా ఉన్న కాలంలో కమ్యూనిస్ట్ వ్యతిరేక ప్రోపగాండా చెయ్యడానికి స్టాలిన్ కాలం నాటి GULAG(కారావాస శిబిరాలు) గురించి స్కూల్ పుస్తకాలలో వ్రాసి ఆ పేరు చెప్పి కమ్యూనిస్ట్ వ్యతిరేక విషం పిల్లలలోకి ఎక్కించడానికి ప్రయత్నించారు. కానీ ఆ అమెరికా సమర్ధకులు గ్వాంటనామో బే రహస్య కారాగారం GULAG కంటే భయానకంగా ఉంటుందని ఒప్పుకోరు.