‘కిమ్ జోంగ్-ఇల్’ చనిపోయిన రోజే ‘క్షిపణి’ని పరీక్షించిన ఉత్తర కొరియా


ఉత్తర కొరియా అత్యున్నత రాజకీయ, మిలట్రీ నాయకుడు ‘కిమ్ జోంగ్-ఇల్’ చనిపోయిన రోజే ఆ దేశం స్వల్ప దూరంలో గల లక్ష్యాన్ని ఛేదించే శక్తి గల క్షిపణి పరీక్షించి సంచలన సృష్టించింది. అయితే మిసైల్ పరీక్ష కూ, కిమ్ మరణానికీ సంబంధం ఉన్నదని తాము భావించడం లేదని దక్షిణ కొరియా అధికారులు చెప్పినట్లుగా రాయిటర్స్ సంస్ధ తెలిపింది. మిసైల్ పరీక్షించిన విషయాన్ని కూడా దక్షిణ కొరియా మీడియా నే వెల్లడించాయి.

పేరు చెప్పడానికి ఇష్టపడని దక్షిణ కొరియా అధికారిను ఉటంకిస్తూ యోన్ హాప్ వార్తా సంస్ధ, ఛైర్మన్ కిమ్ జోంగ్-ఇల్ మరణానికీ, క్షిపణి పరీక్షకీ సంబంధం లేదని తెలిపింది. ఉత్తర కొరియా ప్రభుత్వ వార్తా సంస్ధలు మధ్యాహ్నం సమయంలో కిమ్ మరణాన్ని ప్రకటించక మునుపే, బాగా ఉదయం పూట క్షిపణిని పరీక్షించి ఉండవచ్చని రాయిటర్స్ అంచనా వేసింది. శనివారం ఉదయం కిమ్ గుండె పోటుతో మరణించిన సంగతి విదితమే. ఓ అధికారిక కార్యక్రమం నిమిత్తం కిమ్ రైలు ప్రయాణంలో ఉండగానే గుండె పోటుతో చనిపోయినట్లుగా ఉత్తర కొరియా తెలిపింది.

దక్షిణ కొరియా రక్షణ మంత్రిత్వ శాఖ గానీ, జాయింట్ ఛీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కార్యాలయం గానీ క్షిపణి పరీక్ష వార్తను ధృవీకరించడానికి నిరాకరించినట్లు తెలుస్తోంది. ఉత్తర కొరియా అప్పుడప్పుడూ క్షిపణి లను పరీక్షించడం మామూలే. రెగ్యులర్ ట్రైనింగ్ లో భాగంగా అప్పుడప్పుడూ ఆ దేశం సముద్ర జలాల్లోకి తక్కువ దూరంలో లక్ష్యాన్ని ఛేదించే క్షిపణిలను పరీక్షిస్తుందని వార్తా సంస్ధలు తెలుపుతున్నాయి. సున్నితమైన రాజకీయ పరిణామాలు సంభవించినప్పుడు కూడా క్షిపణిలను ఉత్తర కొరియా పరీక్షిస్తుందని అవి తెలిపాయి. చివరిసారిగా గత జూన్ లో క్షిపణి పరీక్ష జరిపినట్లుగా రాయిటర్స్ తెలిపింది.

వ్యాఖ్యానించండి