62.8 సెంటీ మీటర్లు లేదా 24.7 అంగుళాల ఎత్తుకలిగిన జ్యోతి ఆమ్గే ప్రపంచంలోనే అత్యంత పొట్టి మహిళగా గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ కి ఎక్కింది. తన పద్దెనిమిదవ పుట్టిన రోజు డిసెంబరు 16 న ఆమే ఈ ఘనత సాధించింది. తన ఎత్తుతో సంబంధం లేకుండా ఆమె బాలీవుడ్ స్టార్ కావాలని కలలు కంటోందిట. గత సెప్టెంబరు నెలలోనే ప్రపంచ పొట్టి మహిళగా రికార్డుల కెక్కిన 22 ఏళ్ళ అమెరికన్ మహిళ రికార్డును జ్యోతి అధిగమించింది. అమెరికన్ కంటే జ్యోతి ఏడు సెంటీమీటర్లు ఎత్తు తక్కువని తేలింది. నాగపూర్ వాసి అయిన జ్యోతి వచ్చే సంవత్సరం రెండు బాలీవుడ్ చిత్రాల్లో నటించనున్నదని తెలుస్తోంది.
–






