ఇరాక్ యుద్ధం ముగిసిందట! -ఫొటోలు


‘ఇరాక్ యుద్ధం’ ముగిసిందని డిసెంబరు 15 తేదీన అమెరికా అధ్యక్షుడు బారక్ ఒబామా ప్రకటించాడు. ఇరాక్ లో తమ పని ముగిసిందనడానికి ప్రతీకగా అక్కడ అమెరికా పతాకాన్ని అవనతం చేశారు. రెండు నెలల్లో ముగుస్తుందనుకున్న యుద్ధం ఎనిమిదేళ్ల పాటు ఎందుకు కొనసాగిందో అమెరికా నాయకులు ఇంతవరకూ వివరించలేదు. సామూహిక విధ్వంసక ఆయుధాలు లేవని తెలిసినా ఇరాక్ లో సైన్యాన్ని ఎందుకు కొనసాగించారో ఇంకా చెప్పలేదు. అమెరికా లెక్క ప్రకారమే లక్షమంది ఇరాక్ పౌరులను చంపిన అమెరికా నాయకులకు అంతర్జాతీయ న్యాయ స్ధానం ఎందుకు విచారించదో న్యాయస్ధానం ఇంకా చెప్పవలసే ఉంది. 4,500 మంది అమెరికా సైనికులను అర్పించి అమెరికా, అమెరికాకి గానీ, ఇరాక్ కి గానీ, ప్రపంచానికి గానీ సాధించిపెట్టిందేమిటో అమెరికాలో ఎవరిని అడిగినా చెప్పలేరు. కాని ఇరాక్ యుద్ధం ముగిసిందట! ముగిసినా ఇంకా ఇరాక్ లో కొంత సైన్యం కొనసాగుతుందని ఒబామా చెబుతున్నాడు. అయితే ముగిసింది ఏ యుద్ధం? కొనసాగనున్నది ఏ యుద్ధం?

వ్యాఖ్యానించండి