దిటవు గుండె గలవారే ఈ ఫొటోలను చూడాలి


మై గుడ్‌నెస్! ఈ బాంబు పెట్టినవారు ఈ ఫొటోలను చూసి జీవితంలో మళ్ళీ బాంబు పేలుళ్ళకు పాల్పడరని ఆశిద్దాం!

ఇరవై రూపాయల బాడుగకు ఆశపడిన రిక్షా కార్మికుడికి ఎదురైన ఫలితం ఇది. మణిపూర్ రాజధాని ఇంఫాల్ లో నవంబరు 30 న జరిగిన బాంబు పేలుడు సంభవించింది. పేలుడు అనంతరం ఈ హృదయ విదారకమైన సన్నివేశం ఆవిష్కృతమయ్యింది. సాంగై ఫెస్టివల్ సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రధాని మన్మోహన్ డిసెంబరు 3 తేదీన ఇంఫాల్ సందర్శించనుండగా ఈ ఘటన జరిగింది. కాంగ్లీపాక్ కమ్యూనిస్టు పార్టీ కి చెందిన కార్యకర్త తనకు పార్సెల్ ఇచ్చాడని ఇరవై రూపాయల బాడుగుకి ఒప్పుకున్నానని తన చివరి క్షణాల్లో కార్మికుడు పోలీసులకు తెలిపాడు. ప్రధాని మన్మోహన్ డిసెంబర్ 3 తేదీన ప్రసంగించిన చోటుకి యాభై మీటర్ల దూరంలోనే ఈ పేలుడు జరిగింది. రిక్షా కార్మికుడి పేరు ‘కోరా’ గా తెలిసింది. ఘటన జరిగిన కొద్ది సేపటికి కోరా మరణించాడు.

ఇంతలా గాయపడిన ‘కోరా’ స్పృహలో ఉండడమే గొప్ప విషయం. కమ్యూనిస్టు సిద్ధాంతాలను సరిగ్గా అర్ధం చేసుకున్నవారు ఇటువంటి మతిలేని హింసకు పాల్పడరు.

One thought on “దిటవు గుండె గలవారే ఈ ఫొటోలను చూడాలి

  1. its very cruel and its the meaning less thing to do for some one what’s his crime to die like this.god also not punish humans this much with live.”APARICHITUDU” is only one to punish this createdshadows.please pray to him to punish who is this bl……’s.

వ్యాఖ్యానించండి