పూర్తిగా చూడండి.
–
–
దీన్ని పంచుకోండి:
- Click to share on Facebook (కొత్త విండోలో తెరుచుకుంటుంది) ఫేస్బుక్
- Click to share on X (కొత్త విండోలో తెరుచుకుంటుంది) X
- Click to print (కొత్త విండోలో తెరుచుకుంటుంది) Print
- వాట్సాప్ లో పంచుకోవడానికి నొక్కండి (కొత్త విండోలో తెరుచుకుంటుంది) వాట్సాప్
- Click to email a link to a friend (కొత్త విండోలో తెరుచుకుంటుంది) ఈమెయిలు
ఇలాంటి వీడియోల్లో నాకు “చైల్డ్ అబ్యూజ్” కనపడుతుందండీ! I’m sorry to say this! ఏం చేస్తోందో, అదేమిటో, అంతమంది ముందు ఎందుకు చేయాలో, అసలు అది నేర్చుకోడానికి ఏడాది వయసులో ఎన్ని ఆటలు, ఎంత అల్లరి, ఎంత నిద్ర త్యాగం చేసి ఉంటుంది ఆ పసిది? ఈ స్టేజ్ పెర్ఫార్మెన్స్ కోసం ఎంత ప్రాక్టీస్ చేయించి ఉంటారు ఆ పెద్ద వాళ్ళు? ఆ పాప అందరి ముందు పెర్ఫార్మ్ చేయాలని, అందరూ ఆ తల్లిదండ్రుల్ని ఓ అని మెచ్చేసుకోవాలని ఎందుకండీ ఈ ఆర్భాటాలు? ఆ పసి పాపకు ఎంత స్ట్రెస్? దాన్ని ఎలా వ్యక్తం చేయాలో కూడా తెలీక ఎంత కలత పడుతుందో కదా!
సుజాత గారూ మీరన్నది నిజమే. ఆ పాప ప్రాక్టీస్ చేస్తున్న వీడియోలు కూడా యూట్యూబ్ లో ఉన్నాయి. అవి చూస్తే మీరు చెప్పినంత అబ్యూజ్ కనిపించలేదు గానీ, ఏదో ఒక మేరకు పాపకు కష్టంగానే ఉంటుంది.
అబ్యూజ్ అంటే చిన్నపాటి హింస అనే నా ఉద్దేశం లెండి! అంటే ప్రాక్టీస్ కి కూడా ప్రచారం కావాలనుకున్నారన్నమాట తల్లిదండ్రులు!ఆహా!
ఈ వీడియో మొత్తం చూడలేకపోయాను. కష్టంగా అనిపించింది.
వీడియో చివర్లో పాప బాగా నాట్యం చేసింది. అందుకని మొత్తం చూడండి అని క్యాప్షన్ రాశాను.
విశేఖర్ గారూ! ఈ పాప చివర్లో బాగానే movements ఇచ్చింది. కానీ అలా చేయటం నేర్చుకోవటానికి ఎంత కష్టపడివుండాలి, ఆ పసివయసులో! తల్లిదండ్రుల గొప్పకూ, ప్రేక్షకుల వినోదానికీ పాపను ఇబ్బంది పెట్టటం ఎంత ఘోరం! ఇంట్లో కుటుంబ సభ్యులు సరదాగా అడుగులు నేర్పటమూ, వేదికమీద ఫోకస్ లైట్ల మధ్య నేపథ్యంలో బిగ్గరగా వచ్చే సంగీతానికి తగ్గట్టుగా ‘ప్రదర్శన’ ఇవ్వటమూ ఒకటి కాదు. అసలు అంత పసిపిల్లలతో ప్రదర్శనలు ఇప్పించాలనే తొందరపాటు అవసరమా? కళలు నేర్పటానికి కూడా కనీస వయసు అవసరం లేదా?
ఈ అపసవ్యధోరణి ఇంతటితో ఆగదు. చాలామందికి ప్రేరణనిస్తుంది. సరికొత్త రికార్డు కోసం ‘పుట్టిన ఆరు నెల్లకే భరత నాట్యం’ చేయించేసి, వీడియోలు తీయకుండా ఉంటారా? ఇది ‘పువ్వు పుట్టగానే పరిమళించటం’ కాదు. పసిమొగ్గల నుంచి పరిమళం కోసం (తద్వారా రాగల ఘనత కోసం ) అర్రులు చాచటం!
అవును వేణూ గారు. మీరన్నది నిజం. మనం ఉన్న వ్యవస్ధ అటువంటి గొప్పలకే విలువనిస్తుందని తెలియకపోవడమే లోపం.
ప్రేరణ నిచ్చే క్రమం నిజానికి ఎప్పుడో మొదలైంది.
టి.వి ఛానెళ్లలో ఢీ, అనీ ఢాం అనీ పిల్లల మధ్య పోటీలు పెట్టడం పైన మాజీ మానవహక్కుల కమిషనర్ సీరియస్ అయ్యాడు.
తల్లిదండ్రులను శిక్షించవలసి ఉంటుందని హెచ్చరించాడు.
నిర్వాహకులు హైకోర్టుకి వెళ్లడంతో అది స్టే ఇచ్చింది. అప్పటి నుండి మళ్ళీ మొదలు.
ఈ మధ్య పిల్లలనే యాంకర్ లుగా నియమించి కానించేస్తున్నారు.
ఆ చిన్న పిల్లకి డాన్స్ అంటే ఏమిటో తెలియదు. గాడిదకి గడ్డి మేపి రెండు చక్రాల బండికి కట్టేసి చల్ అంటే లాగుతుంది. అది బండి ఎందుకు లాగుతుందో దానికే తెలియదు. చిన్న పిల్లకి లాలీపాప్ తినిపించి డాన్స్ చెయ్యమంటే చేస్తుంది. ఆమె ఎందుకు డాన్స్ చేస్తుందో ఆమెకే తెలియదు. ఇందులో ఏదో కళాత్మకత ఉందని అనుకోవలసిన అవసరం లేదు.
మగ పిల్లలని అంత కష్ట పెట్టి డాన్స్ నేర్పించరు. వాళ్ళని చదువుకుని ఉద్యోగం చూసుకోవడానికే ప్రిఫరెన్స్ ఇవ్వమంటారు. ఆడ పిల్లల విషయంలో అలా కాదు. వాళ్ళు చదువుకోకపోయినా పెళ్ళి చేసుకుని బతకగలరు. అందుకే ఆడ పిల్లలకి చిన్నప్పటి నుంచే ఆటపాటలు నేర్పిస్తారు. వీళ్ళు పెళ్ళైన తరువాత భర్త ఒప్పుకోలేదని డాన్స్ మానేస్తారు. వీళ్ళు తమ జీవితంలో నిండా పాతిక సంవత్సరాలు పాటైనా నాట్య విద్యని ఉపయోగించుకోరు. దాని కోసం అంత కష్టపడి నాట్యం నేర్చుకోవడం ఎందుకు?
సంగీతానికీ, నాట్యానికీ నేను వ్యతిరేకం కాదు. ఆడ పిల్లలకి సంగీతం, నాట్యం నేర్పించి మగవాళ్ళకి ఉద్యోగాలకి పనికొచ్చే చదువులు నేర్పించే సంస్కృతికే నేను వ్యతిరేకం. నాకు ఒక బాబు పుట్టాడనుకుందాం. బాబుని ఏ పదో తరగతి వరకో చదివించి తరువాత విజయనగరం సంగీత కళాశాలకి పంపించి సంగీత కళాకారుణ్ణి చేస్తానంటే నా భార్య ఒప్పుకుంటుందా? సంగీతం నేర్చుకుంటే అంత డబ్బులు రావని తెలిస్తే ఆమె ఒప్పుకోదు. అబ్బాయి సినిమా మ్యూజిక్ డైరెక్టర్ అవ్వడానికైనా పనికొస్తాడు అనుకున్నా సినిమాలలో అవకాశాలు ఎంత వరకు వస్తాయో చెప్పలేము. అదే ఆడ పిల్లని టెంత్ క్లాస్ వరకు చదివించి ఆ తరువాత సినిమాలలోకి పంపిస్తానంటే నా భార్య ఒప్పుకునే అవకాశాలు ఎక్కువ. ఎందుకంటే అమ్మాయికి తరువాత సినిమాలలో అవకాశాలు తగ్గిపోయినా పెళ్ళి చేసుకుని స్థిరపడిపోగలదు. సంగీతనాట్య కళలలో పురుషాధిక్యత స్పష్టంగా కనిపిస్తుంది. ఇందులో అభివృద్ధికరం అనుకోవడానికి ఏమీ లేదు.