
హిందువుల పుణ్య క్షేత్రం హరిద్వార్ లో ‘ఆచార్య పండిట్ శ్రీరాం శర్మ’ గారి వందవ పుట్టినరోజు సందర్భంగా జరిగిన మత కార్యక్రమంలో తొక్కిసలాట జరిగి 14 మంది స్త్రీలు, ఇద్దరు పురుషులు దుర్మరణం చెందారు. గంగా నదిపై గల ప్రఖ్యాతి చెందిన ‘హర్ కి పురి’ ఘాట్ వద్ద జరిగిన ఈ తొక్కిసలాటలో మరో ముప్ఫై మంది గాయపడ్డట్లుగా జిలా కలెక్టర్ తెలిపాడు. చనిపోయినవారు ఎక్కువమంతి వయసు మళ్ళినవారేనని ఎస్.పి తెలిపాడు.
కొన్ని పదుల వేలమంది హాజరైన ఈ కార్యక్రమంలో ఒక దశలో భక్తులకు ఊపిరాడక పోవడంతో గాలికోసం వెతుకులాటలో తొక్కిసలాట జరిగినట్లు కనిపిస్తున్నదనీ, ఖచ్చితమైన కారణం దర్యాప్తులో తేలుతుందనీ జిల్లా ఎస్.పి చెప్పాడు. కార్యక్రమాన్ని ఇంతటితో ముగించాలని నిర్వాహకులకు చెప్పామనీ, బుధవారం ప్రార్ధన ముగిశాక ముగిస్తామన్నారని ఎస్.పి చెప్పాడు. దర్యాప్తుకు ఆదేశించినట్లు జిల్లా మెజిస్ట్రేట్ తెలిపాడు.
‘చండీద్వీప్ ఘాట్’ వద్ద ఉన్న ‘యజ్ఞశాల’ లోకి వెళ్ళడానికి భక్తులు నెట్టుకోవడంతో తొక్కిసలాట జరిగిందని ‘ది హిందూ’ పత్రిక తెలిపింది. ఆచార్య పండిట్ శ్రీరాం శర్మ సాదువు, తత్వవేత్త అనీ ‘శాంతి కుంజ్ ఆశ్రమ్’ వ్యవస్ధాపకుడనీ, ‘అఖిల్ విశ్వ గాయత్రి పరివార్’ ను కూడా ఆయన స్ధాపించాడనీ తెలుస్తోంది. ఈ గాయత్రి పరివార్ కు పెద్ద ఎత్తున అనుచరగణం ఉన్నట్లుగా తెలుస్తోంది.
ఉదయం పది న్నర ప్రాంతంలో తొక్కిసలాట జరిగిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. యజ్ఞశాల వద్దకు వెళ్ళడానికి పదులవేలమంది సిద్ధమయి వెళ్తుండగా కొద్దిమంది రద్దీలో చిక్కుకున్నారనీ వెనక ఉన్నవారు అదేపనిగా తొందరపెడుతూ నెట్టడంతో తొక్కిసలాట జరిగిందని వారు చెప్పారు. యజ్ఞశాలలో భక్తులు కానుకలు ఇవ్వవలసి ఉన్నదని తెలుస్తోంది. అక్కడ ఉన్న మిని బ్రిడ్జిని దాటి యజ్ఞశాల చేరడానికి భక్తులు మెట్లు ఎక్కుతుండగా సంఘటన చోటు చేసుకుందని చెప్పారు. యజ్ఞశాలలో ‘గాయత్రి మహా యజ్ఞ’ కు భక్తులు హాజరు కావలసి ఉందని వారు తెలిపారు.
కొద్ది సేపట్లోనే పరిస్ధితి అదుపు తప్పిందనీ స్త్రీలూ, పిల్లలూ ఒత్తిడి తట్టుకోలేక కింద పడిపోయారనీ ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఉత్తరా ఖండ్ ముఖ్యమంత్రి బి.సి.ఖండూరి చనిపోయినవారి బంధువులకు రెండు లక్షల నష్టపరిహారం ప్రకటించాడు. ఆశ్రమం కూడా అంతే మొత్తంలో నష్టపరిహారం ప్రకటించింది. దేశ, విదేశాలనుండి రెండు లక్షల మంది భక్తులు హాజరయ్యారని పోలీసులు తెలిపారు. కుంభమేళా తర్వాత ఇదే పెద్దదని వారు తెలిపారు.
భారత దేశంలో జరిగే మత పండుగల సందర్భంగా ఇటువంటి తొక్కిసలాట జరిగి భక్తులు ప్రాణాలు కోల్పోవడం తరచుగా జరుగుతుంటుంది. బక్రీద్ పండగనాడు మక్కాలో ఓ పెద్ద రాయిపైన రాళ్లు విసిరి సాతాను పైన విసురుతున్నట్లు ముస్లింలు భావిస్తారు. అదొక దైవ కార్యక్రమంగా వారు నిర్వహిస్తారు. రాళ్ళు వేయడానికి జరిగే ప్రయత్నాల్లో కొన్నిసార్లు తొక్కిసలాట కూడా జరుగుతుంది. అలా తొక్కిసలాటలో చనిపోవడాన్ని గౌరవంగా ముస్లింలు భావిస్తారని పత్రికల ద్వారా తెలుస్తోంది. హిందూ మతంలో ఈ విధంగా ‘మత కార్యక్రమాల్లో చనిపోయినపుడు గౌరవంగా భావించే’ ఆచారం ఉన్నదో లేదో తెలియదు.
హిందూ మతంలో ఈ విధంగా ‘మత కార్యక్రమాల్లో చనిపోయినపుడు గౌరవంగా భావించే’ ఆచారం ఉన్నదో లేదో తెలియదు.
పూర్వము కాశికి పోయినా కాటికి పోయినా ఒక్కటే అనేవారు. ఎందుకంటే అప్పట్లో రవాణా సౌకర్యాలు సరిగా లేనందున అలా వెల్లినవారు మార్గమధ్యములోనే చనిపోవడమో లేక మరేవన్నా జబ్బుల బారిన పడడమో జరిగేది. అయినా సరే చాలా మంది కాశీకి బయలు దేరివెల్లేవారు. అలా కాశికి వెల్లే మార్గములో కానీ, కాశీలో కానీ చనిపోవడం చాలా మంచిదని, పుణ్యలోకాలకు వెలతారు ఒక నమ్మకం. కాశీలో తనువు చాలిస్తే పుణ్యలోకాలకు వెలతారని ఇప్పటికీ కొంత మంది నమ్ముతారు. కాకపోతే అదృష్టవశాత్తూ ఇది బాగా తగ్గుముఖం పడుతోంది.
ఇక అమర్నాద్ యాత్ర గురించి వేరే చెప్పనవసరం లేదు. అక్కడ ఉన్న వాతావరణం వలన కొంత మంది చనిపోతే, మతమౌడ్యుల తీవ్రవాదం వలన మరికొంత చనిపోతారు. అయినా సరే ఆ యాత్ర నిర్విఘ్నంగా కొనసాగుతూనే ఉంది. కొన్ని అంతే, కొన్నింటిని పవిత్రతకు చిహ్ణంగా భావించే అలవాటు అన్ని మతాలలోనూ ఉంది. పోయేది మనిషి ప్రాణాలు అయినా లెక్కచేయని మనస్తత్వం అన్ని మతాలలో ఉంది. దీన్ని తప్పు చేయకండి అని అనాలో, నీ విశ్వాశం ప్రకారం నీవు నడుచుకో అనాలో నాకు అర్థం కాదు.
అయినా సరే, ఇటువంటివి మానుకుంటే బాగుంటుంది అని నేను భావిస్తాను.
What about Sabarimala!
అవును శబరిమల కూడా మినహాయింపు కాదు. అక్కడ మరీ దారుణం ఏమిటంటే కొండలపైన మంట పెట్టి దాన్ని భక్తులకు జ్యోతిగా చూపించడం, ఆ ఘన కార్యాన్ని రాష్ట్ర ప్రభుత్వమే స్వయంగా చేపట్టడం.
వామ పక్షాలుగా చెప్పుకునే సి.పి.ఐ, సి.పి.ఎం పార్టీల నాయకత్వంలోని లెఫ్ట్ ఫ్రంట్ ప్రభుత్వం కూడా ఆ మోసాన్ని కొనసాగించడం ఇంకా దారుణం.
ఈ దేశంలోని ప్రధాన స్రవంతిలో ఉన్న వామ పక్షాల సైద్ధాంతిక నిబద్ధత నేతి బీర లోని నెయ్యిలాంటిదని చెప్పే అనేక అంశాల్లో ఇదీ ఒకటి.
మృత్యువుని కూడా దైవంగా భావిస్తారు హైందవ మతస్తులు. అందుకే “మృత్యు దేవత” అని సంబోధిస్తారు. ఇక్కడ మరణించినంతనో లేక అక్కడ మరణించినంతనో గౌరవ భావం అన్నది అసలు లేదు. మరణ సోపానం మోక్షావస్థకు తోడ్పడితే దానిని ఉత్తమ గతి కింద భావిస్తారు.
“కాశ్యాంతు మర్ణాన్ముక్తిః” అని స్కాందపురాణంలో ఉన్న దాన్ని బట్టీ, కాశీ క్షేత్రంలో సహజ మరణం సంభవించడం మోక్షానికి దారితీస్తుంది. దీనిని తెలిసిన ప్రతి సనాతన ధార్మికుడు నమ్ముతాడు.
పౌరాణిక, ఐతిహాసికపరంగా తెలియదు; ఎక్కడ చదివానో లేక విన్నానో గుర్తులేదు కానీ, జగన్నాథ పురి రథ యాత్రతో ముడిబడి ఉన్న విశేషం ఒకటుందనుకుంటాను.
అవును, నేనూ విన్నాను తె.భా గారూ.