సామాజికంగా, జీవ శాస్త్ర పరంగా “జాతి” నిర్వచనం


అన్నా హజారే బృందంలో ప్రముఖ సభ్యుడు, పౌర హక్కుల కార్యకర్త, సుప్రీం కోర్టు లాయర్ ప్రశాంత్ భూషణ్ పైన బుధవారం ఢిల్లీలో దాడి జరిగింది. శ్రీరాం సేన, భగత్ సింగ్ క్రాంతి సేన లకు చెందిన సభ్యులు ముగ్గురు ఈ దాడిలో పాల్గొన్నారని పత్రికలు నిర్ధారించాయి. ఒకరు దాడి జరిగినపుడే పట్టుబడగా, మిగిలిన ఇద్దరు గురువారం కోర్టులో లొంగిపోయారు.

ఎందుకు లొంగిపోతున్నారని విలేఖరులు ప్రశ్నిస్తే “మేము చట్టాన్ని ఉల్లంఘించాము. అది నేరం. కనుక లొంగిపోతున్నాం” అని చెప్పారు. ఈ అవగాహన వీరికి దాడి చేసే సమయంలో కూడా ఉంటే పనికొచ్చేది. చట్టాన్ని ఉల్లంఘించి అయినా, ప్రజాస్వామిక సూత్రాలకు పరిహాస భాజనమైనా, తమకు భిన్నమైన అభిప్రాయం ఉన్నవారిపైన భౌతిక దాడి చెయ్యాలి అని వీరు చెప్పదలుచుకున్నారు.

అయితే కొన్ని ‘పిచ్చి కుక్కలు’, ‘మత మౌఢ్యం’ అనే ‘ర్యాబీస్’ సోకి విషంతో నిండిన చొంగను నాబ్లాగ్ నిండా కుమ్మరిస్తున్నాయి. మరికొంతమంది ‘సన్నాసులు’ హిమాలయాల్లో పడి ఏడవక సంసారుల కొంపల్లోకి జొరబడి బెడ్ రూం లకి కాపలా కాయడానికి కూడా సిద్ధపడ్డారు. అంటే సన్యాసం పుచ్చుకున్నవారు హిమాలయాల్లో తపస్సు చేసుకోక దేశంలోకి చొరబడి, వివిధ మత సంస్ధల ముసుగు వేసుకుని వచ్చి, పుచ్చిపోయిన వారి బుర్రల్లో ఉన్న కుళ్ళుని నమ్మాలని ఆజ్ఞలు జారీ చేస్తున్నారు.

వీరి సంగతి ఎలా ఉన్నా చర్చ జరుపుతున్న కొద్దిమంది మిత్రుల కోసం “జాతి” కి ఉన్న నిర్వచనాలను ప్రచురిస్తున్నాను. ఇవి ప్రధానంగా జీవ శాస్త్రపరంగా, డార్విన్, మెండెల్‌ల పరిణామ సిద్ధాంతాల ఆధారంగా చారిత్రకంగా ఏర్పాటయిన సైద్ధాంతిక నిర్వచనాలు. ఈ అంశాలపై బ్లాగ్మిత్రులు స్నేహ పూరిత చర్చకు దిగుతారని ఆశిస్తున్నాను.

వ్యాఖ్యానించండి