యూరప్ సంక్షోభంలోనూ దండుకుంటున్న ధనికులు -కార్టూన్


యూరప్ రుణ సంక్షోభం యూరప్ ప్రజలకు ఉద్యోగాలు లేకుండా చేసింది. ఉన్న ఉద్యోగాలు ఊడగొట్టింది. కొత్త ఉద్యోగాలు రాకుండా అడ్డుకుంది. సామాజిక సదుపాయాలు రద్దు పరిచింది. ప్రభుత్వరంగ కంపెనీలను ప్రవేటోడిక అమ్మించింది. ప్రజలను ఇంతగా అతలా కుతలం చేసి సామాజిక సంక్షోభాలను (ఉదా: లండన్ అల్లర్లు) కూడా సృష్టించిన యూరప్ రుణ సంక్షోభం ధనికులను తాకలేకపోయింది. కారణం గ్రీసు, ఐర్లండు, పోర్చుగల్ సంక్షోభాల పేరుచెప్పి ఇ.యు, ఐ.ఎం.ఎఫ్ లు ఆ దేశాలకు ఇచ్చిన బెయిలౌట్ రుణాలు నిజానికి ఆ దేశాలలో ఉన్న బడా బడా బ్యాంకుల కోసం కావడమే.

గ్రీసు, ఐర్లండ్, పోర్చుగల్ దేశాల్లో జర్మనీ, ఫ్రాన్సు, బ్రిటన్, అమెరికా తదితర ధనిక దేశాల బ్యాంకుల శాఖలు ఉన్నాయ్. ఇవన్నీ సంక్షుభిత దేశాల రుణాలలో పెట్టుబడులు పెట్టి ఉన్నాయి. అవి కాక ధనిక దేశాలలో ఉన్న బ్యాంకులు కూడా సంక్షుభిత దేశాల రుణాలలో (సావరిన్ అప్పు బాండ్లు కొనుగోలు చేయడం ద్వారా) పెట్టుబడులు పెట్టాయి. సంక్షుభిత దేశాల ఆర్ధిక వ్యవస్ధలు కుచించుకు పతుండడంతో అవి తమ బ్యాంకులకు అప్పులు తిరిగి చెల్లించవేమో నన్న భయం పట్టుకుంది. అందుకే పని గట్టుకుని వాటికి అప్పులిచ్చి ఆ సొమ్ముని మళ్ళీ తమ బ్యాంకుల ద్వారా వసూలు చేసుకున్నాయి. ఈ సందర్భంగా కఠిన షరతులు విధించి ప్రవేటీకరణ లక్ష్యాన్ని కూడా సాధించుకున్నాయి. బెయిలౌట్ రుణాల భారం అదనంగా సంక్షుభిత దేశాల ప్రజలపై పడడమే కాక వారి ఉద్యోగాలు, సదుపాయాలు రద్దు చేసి మరిన్ని లాభాలు గుంచుకోవడానికి భూమికను ఏర్పాటు చేసుకున్నాయి. అంతిమంగా బలయ్యంది ప్రజలే. ప్రజలు ధనికుల్ని మేపింది కాక బికారులుగా మారిపోయారు.

Euro crisis profited rich

వ్యాఖ్యానించండి