ఆ మధ్య రెండు తలల పాము ఒకటి కనపడి ఆశ్చర్యపరిచింది. ఇప్పుడు రెండు తలల పిల్లి వార్తలకెక్కి అబ్బుర పరుస్తోంది. ఈ ఫోటోలు సెప్టెంబరు 28 న తీసినవి. మసాఛుసెట్స్ లోని వార్సెస్టర్ లో నివసిస్తున్న మార్టి అనే ఆవిడ తన పిల్లిని ఫొటో లు తీయడానికి అనుమతించింది. తన రెండు తలల పిల్లికి ఆమే ఫ్రాంక్, లూయి అని పేర్లు పెట్టిందట. ఈ తరహా పిల్లులని జానుస్ కేట్ అంటారట. రోమన్ మైధాలజీలో ఒకే తలలో రెండు మొఖాలుండే జంతువు పేరుమీద ఆపేరు వచ్చింది. అసొసియేటెడ్ ప్రెస్ అందించిన ఈ ఫోటోలను యాహూ న్యూస్ ప్రచురించింది.



