2జి కుంభకోణంలొ కొత్త పాత్రధారులు బైటికి వస్తున్నారు. మాజీ టెలికం మంత్రి దయానిధి మారన్ పాత్ర పైన తమకు ఆధారాలు లభ్యమైనాయనీ, ఆయనపైన రెండురోజుల్లో క్రిమినల్ కేసు దాఖలు చేయనున్నామనీ సి.బి.ఐ గురువారం సుప్రీం కోర్టుకు తెలిపింది. పి.చిదంబరం అరెస్టుకు సుప్రమణ్యస్వామి తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు. సి.బి.ఐ నిస్పక్షపాతంగా దర్యాప్తు జరిపితే ప్రధాని మన్మోహన్ పాత్ర కూడా వెల్లడవుతుంది.
వీరంతా వి.వి.ఐ.పిలు. దేశాన్ని పాలిస్తున్నవారు. సుప్రీం కోర్టు చురుకుగా ఉన్నందున ఈ వి.వి.ఐ.పిలు వాస్తవానికి వి.వి.ఐ.పి లు కాదనీ జేబు దొంగలను మించిన కేడి గాళ్లని తేలుతోంది. తీహార్ జైలు ఈ వి.వి.ఐ.పి ఉరఫ్ కేడీ గాళ్ళతొ నిండిపోతున్నది.
మరింతమంది వి.ఐ.పి లు వస్తున్నారట! అందుకని జైలుని అప్‌గ్రేడ్ చేశారట!
కార్టూనిస్టు: సురేంద్ర, ది హిందూ
—
