వన్డేలనుండి ‘ది గ్రేట్ వాల్ ఆఫ్ ఇండియా’ రిటైర్‌మెంట్, కొన్ని కెరీర్ ఫోటోలు


“ది గ్రేట్ వాల్ ఆఫ్ ఇండియా” గా అనధికార బిరుదును సంపాదించుకున్న రాహుల్ ద్రవిడ్ వన్డేల నుండి రిటైర్ అయ్యాడు. ఇంగ్లండ్ తో ముగిసిన చివరి వన్డే మ్యాచ్‌తో రాహుల్ వన్డేల నుండి రిటైర్‌‌మెంట్ ప్రకటించాడు. వివిధ అకాడమీలు, ప్రభుత్వాలు ఇచ్చే బిరుదులు అవార్డుల కంటే తమ ఆటతీరును బట్టి ఆటగాళ్ళు పొందే బిరుదులు చాలా విలువైననవి. ఆ బిరుదులే ఆటగాళ్ళ నిజమైన ట్యాలెంట్‌ను గుర్తిస్తాయి. ఆ విధంగా రాహుల్ సంపాదించుకున్న బిరుదే ‘ది గ్రేట్ వాల్ ఆఫ్ చైనా’. దానికి రాహుల్ ఎంతగా తగినవాడే ఆయన కెరీరే చెబుతుంది. రాహుల్ రిటైర్‌మెంట్ సందర్భంగా కొన్ని ఫోటోలను యాహూ సంస్ధ ప్రచురించింది. వాటిలో కొన్ని ఇవి.

2 thoughts on “వన్డేలనుండి ‘ది గ్రేట్ వాల్ ఆఫ్ ఇండియా’ రిటైర్‌మెంట్, కొన్ని కెరీర్ ఫోటోలు

  1. ‘ది గ్రేట్ వాల్ ఆఫ్ ఇండియా’ కాదు, ‘ది గ్రేట్ వాల్ ఆవ్ చైనా’ అని చెప్పదలుచుకున్నారా తమరు?
    అయితే మీరు తెలుసుకోవలసిన విషయం ఒకటుంది. రాహుల్ ద్రవిడ్ క్రికెట్ మాచుల్లో వికెట్లు వరుసగా పడిపోతున్న తరుణంలో అడుగు పెట్టి మరిన్ని వికెట్లు పడిపోకుండా చాలా మ్యాచుల్లో అడ్డుకున్నాడు. అందుకని రాహుల్ ద్రవిడ్ ను “ది గ్రేట్ వాల్ ఆఫ్ ఇండియా’ గా అనధికారికంగా పత్రికలు, విశ్లేషకులు కొనియాడతాయి. అందువలన ‘ది గ్రేట్ వాల్ అఫ్ ఇండియా’ అని రాశాను.
    తప్పులు ఎంచేముందు మనకు తెలిసింది నిజమా కాదా అని నిర్ధారించుకోవాల్సిన అవసరం ఉంది. ఏమంటారు?

వ్యాఖ్యానించండి