గుండెలు అవిసేలా రోదిస్తున్న ఈ పెద్దాయనకి స్వాంతన ఎవరు ఇవ్వగలరు? శతాబ్దాల పాటు ఊరంతటికీ నీడనిచ్చిన మర్రిమాను నిలువునా కూలినట్లున్న ఈ దృశ్యం చూపరులను కంట తడిపెట్టేలా ఉంది. ఏం జరిగిందో తెలియని పాప అమాకపు చూపులు మరింతగా హృదయాలను పిండేస్తున్నాయి. తాతో, తండ్రో, మామయ్యో ఇంకెవరో గాని ఈయనని ఓదార్చడానికి కాసింత అవకాశం దొరికితే బాగుడ్ను.
వెల్లూరు జిల్లాలోని అరక్కోణం వద్ద కిల్కండిగై వద్ద ఆగి ఉన్న పాసెంజర్ రైలును 90 కి.మీ వేగంతో వస్తున్న మరొక రైలు మంగళ వారం (సెప్టెంబరు 12) ఢీకొట్టడంతో పది మంది మరణించారు. ఢీకొట్టడానికి ముందు డ్రైవర్ సెల్ ఫోన్ లో మాట్లాడాడనీ, దానితో ఎర్రలైటుని గమనించలేకపోయి ఉండవచ్చనీ రైల్వే అధికారులు చెబుతున్నారు. అదే నిజమైతే సెల్ ఫోన్ వినియోగదారులు వాహనాలలో, వాహనాల పైనా ఉపయోగించ కూడదన్న సంగతిని ఈ ప్రమాదం మరొకసారి గుర్తు చేస్తున్నది. రైల్వే డ్రైవర్ కొద్ది పాటి నిర్లక్ష్యం పది కుటుంబాలకు తీరని దుంఖం మిగిలిచింది.
—

