ఢిల్లీ బాంబు పేలుడు -ఫోటోలు


బుధవారం ఉదయం ఢిల్లీ హైకోర్టు గేటు వద్ద జరిగిన బాంబు పేలుడు ఘటనలో 11 మంది చనిపోగా 65 మంది గాయపడ్డారు. గాయపడిన వారిలో 15 మంది పరిస్ధితి విషమంగా ఉందని కేంద్ర హోం శాఖ వర్గాలు తెలిపాయి. గత మే 25 తేదీన ఇదే కోర్టు ప్రాంగణంలో తక్కువ శక్తితో బాంబు పేలింది. ఆ ఘటనలో ఎవరికీ హాని జరగలేదు. ఈ రోజు జరిగిన బాంబు పేలుడుకి మే నెలలో జరిగిన పేలుడు ట్రయల్ గా జరిపారా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. బుధవారం పేలుడు ఘటనకు సంబంధించి ‘ది హిందూ’ ప్రచురించిన కొన్ని ఫొటోలు:

వ్యాఖ్యానించండి