న్యూయార్క్‌లోని వాల్‌స్ట్రీట్‌లో ఉన్న “టూ బిగ్ టు ఫెయిల్” బడా బ్యాంకులే ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధను గొప్ప మాంద్యం (ది గ్రేట్ రిసెషన్) లోకి జారడానికి దోహదపడ్డాయి. సబ్ ప్రైమరీ హౌసింగ్ రుణాలను అతిగా సెక్యూరిటైజేషన్ చేసి తాజా కేకులుగా ప్రపంచం అంతా అమ్మి ద్రవ్య సంక్షోభంలోకి ప్రపంచాన్ని తోశాయి. అందుకు వారికి శిక్షకు బదులు ట్రిలియన్ల కొద్దీ బెయిలౌట్ల రూపంలో నజరానాలు అందాయి. అవి అందుకున్న బెయిలౌట్లు, రెండు యుద్ధాలు కలిసిన అమెరికా అప్పు, హిమాలయాలతో పోటీకి సవాలు విసిరింది. మరోవైపు, ట్రిలియన్ల డాలర్లు మింగినా వాల్‌స్ట్రీట్ బడా కంపెనీలు ఉద్యోగాలు ఇచ్చే బాధ్యతను గాలికొదిలేశాయి. అటు అప్పులూ పెంచి, ఇటు ఉద్యోగాలు ఇవ్వకా, అమెరికా ఆర్ధిక వ్యవస్ధ రుణ సంక్షోభం వాకిట నిలిచింది. ఇంతా చేసిన ఇన్‌వెస్ట్ బ్యాంకులనూ, ఇన్సూరెన్సు కంపెనీలను అమెరికా ప్రభుత్వం ఉదారంగా వదిలిపెట్టింది. దానితో అమెరికా ఆర్ధిక వ్యవస్ధ అంతకంతకూ ఎదుగూ బొదుగూ లేకుండా, దాదాపు సునన్ ఆర్ధిక వృద్ధి నమోదు చేస్తున్నది. బ్యాంకుల సంస్కరణలను అమలు చేస్తామని గప్పాలు కొట్టిన ఒబామా ప్రభుత్వానికి ఆ దమ్ములేదు. యూరోజోన్ పరిస్ధితి అమెరికాకి ఏమీ తీసిపోలేదు.
అసలే మందగమనంతో సాగుతున్న ఆమెరికా వ్యవస్ధ బడా బ్యాంకుల స్పీడ్ బ్రేకర్ల వలన సున్నకు దగ్గరగా ఆర్ధిక వృద్ధి నమోదు చేస్తుండగా దానినే “స్లో రికవరి” అని చెప్పుకుని సరిపెట్టుకుంటున్న పరిస్ధితిపై ఈ కార్టూన్:
కార్టూనిస్టు: కాల్, ది ఎకనమిస్టు, లండన్.
—
