‘పులి పాప’ను పాల డబ్బాతో సాకుతున్న ‘పిల్ల చింపాంజీ’ -ఫొటోలు


మనిషికి, ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే హోమో సెపియన్ కి అత్యంత దగ్గరి పోలికలు ఉన్నది చింపాంజీకే నని జీవ శాస్త్రవేత్తలు చెబుతారు. చింపాంజీల చేష్టలు, అలవాట్లు, వివిధ అవసరాల కోసం అవి చూపించే కదలికలు, కొద్ది ముఖంలో కూడా ప్రతిఫలించే హావ భావాలు… ఇవన్నీ ఆ విషయం నిజమేనని స్పష్టం చేస్తాయి కూడా.

పేదల ఇళ్ళల్లో తల్లి దండ్రులు పని చేయగల వారినందర్నీ కూలి పనులకు పట్టుకుపోతే, ఇంట్లోనే ఉండక తప్పని చంటి పాపను, పాపకంటే నాలుగో, అయిదో ఏళ్లు మాత్రమే పెద్దదయిన అక్క రోజంతా సాకుతుంది. కూలిపనులకు వెళ్ళే కుటుంబాల ఇళ్లల్లో సహజంగా కనిపించే దృశ్యం ఇది. ఇక్కడ పులి పాపకు కూడా అదేదో కష్టం దాపురించినట్లుంది. జాతి భేధం మరిచి పాలను అరువు తెచ్చుకుని మరీ ఆ పాపను సాకుతున్న ఈ పిల్ల చింపాంజి హావ భావాలు చూడవలసిందే.

జాతి భేదాన్ని మరవగల శక్తి, యుక్తి, ఆలోచన, అవగాహన ఉన్నది జీవజాలంలో మనిషి ఒక్కరికే. ఆ లక్షణం అప్పుడప్పుడూ జంతువుల్లో కూడా కనబడుతూ మనిషికి తోడొస్తాయి. దానికి ఇక్కడ చింపాంజీ తో పాటు మరికొన్ని దృష్టాంతాలు మనం చూస్తుంటాం అప్పుడప్పుడూ. కానీ లేని జాతి వైరాన్ని కొని తెచ్చుకుని కుత్తుకలు కోసుకునే సంస్కృతి మాత్రం ఒక్క మనిషికే సాధ్యం. ఆ విషయంలో చింపాంజీతో పాటు మరే జీవీ మనిషికి తోడు లేదు, రాదు.

రెండు నెలల ‘ఓర్న్’ ను రెండు సంవత్సరాల ‘డు డు’ సాకుతున్న ఈ దృశ్యాలు ధాయిలాండ్ రాజధాని బ్యాంకాక్ లో ఉన్న  “సాముట్ ప్రకన్ క్రొకొడైల్ ఫాం అండ్ జూ” లోనివి. జులై 30 న తీసిన ఈ ఫొటోలను రాయిటర్స్ వార్తా సంస్ధ సేకరించి ప్రచురించింది.

2 thoughts on “‘పులి పాప’ను పాల డబ్బాతో సాకుతున్న ‘పిల్ల చింపాంజీ’ -ఫొటోలు

  1. “జాతి భేదాన్ని మరవగల శక్తి, యుక్తి, ఆలోచన, అవగాహన ఉన్నది జీవజాలంలో మనిషి ఒక్కరే. దానికి ఇక్కడ చింపాంజీ తో పాటు మరికొన్ని దృష్టాంతాలు మనం చూస్తుంటాం అప్పుడప్పుడూ. కానీ లేని జాతి వైరాన్ని కొని తెచ్చుకుని కుత్తుకలు కోసుకునే సంస్కృతి మాత్రం ఒక్క మనిషికే సాధ్యం. ఆ విషయంలో చింపాంజీతో పాటు మరే జీవీ మనిషికి తోడు లేదు, రాదు.”

    కొటేషని బాగుంది….

  2. వాసవ్య గారూ, నిజానికి మీరు ఉదహరించిన పేరా ఇలా ఉండాలి:

    “జాతి భేదాన్ని మరవగల శక్తి, యుక్తి, ఆలోచన, అవగాహన ఉన్నది జీవజాలంలో మనిషి ఒక్కరికే. ఆ లక్షణం అప్పుడప్పుడూ జంతువుల్లో కూడా కనబడుతూ మనిషికి తోడొస్తాయి. దానికి ఇక్కడ చింపాంజీ తో పాటు మరికొన్ని దృష్టాంతాలు మనం చూస్తుంటాం అప్పుడప్పుడూ. కానీ లేని జాతి వైరాన్ని కొని తెచ్చుకుని కుత్తుకలు కోసుకునే సంస్కృతి మాత్రం ఒక్క మనిషికే సాధ్యం. ఆ విషయంలో చింపాంజీతో పాటు మరే జీవీ మనిషికి తోడు లేదు, రాదు.”

    జాతివైరాన్ని మరిచిపోవడంలో మనిషికి జంతువులనుండి తోడు అందుతుంది గానీ, లేని జాతి వైరాన్ని తెచ్చుకోవడంలో చింపాంజీ తో పాటూ మరే జంతువూ తోడు రాదని చెప్పడం నా ఉద్దేశ్యం. కాని ఒక వాక్యం మిస్ కావడంతొ ఆ అర్ధం పూర్తిగా స్ఫురించలేదు.

    మీ వ్యాఖ్య ద్వారా నా తప్పు గుర్తించడానికి వీలయ్యింది. పోస్టు లో కూడా సవరించాను. కృతజ్ఞతలు.

వ్యాఖ్యానించండి